న్యూఢిల్లీ: డీమ్డ్ వర్సిటీల్లో దూరవిద్యలో ఇంజినీరింగ్ పట్టాలు పొందిన వారంతా తిరిగి తాము నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పేర్కొంది. జేఆర్‌ఎన్ రాజస్తాన్ విద్యాపీఠ్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (రాజస్తాన్), అలహాబాద్ అగ్రికల్చరల్ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు వినాయక మిషన్ రీసెర్చి ఫౌండేషన్ (తమిళనాడు) దూరవిద్య విధానం ద్వారా 30వేల మందికి ఇంజినీరింగ్ డిగ్రీలు ప్రదానం చేశాయి. అయితే, ఈ పట్టాలు చెల్లవంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో యూజీసీ తాజా నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మే, జూన్ నెలల్లో జరిగే ఈ పరీక్ష రాయాలనుకునే వారు జనవరి 15లోగా పేర్లను నమోదు చేయించుకోవాలని కోరింది. ఇందులో పాసైన వారికే ఇంజినీరింగ్ డిగ్రీలు ప్రదానం చేస్తామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment