న్యూఢిల్లీ: దూర విద్య ద్వారా నాలుగు డీమ్డ్ యూనివర్సిటీలు అందించిన ఇంజినీరింగ్ పట్టాలను యూజీసీ రద్దు చేసింది. ఈ జాబితాలో రాజస్తాన్‌లోని జేఆర్‌ఎన్ రాజస్తాన్ విద్యాపీఠ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్, అలహాబాద్ అగ్రికల్చరల్ ఇనిస్టిట్యూట్, తమిళనాడులోని వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఉన్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ యూనివర్సిటీల ఇంజినీరింగ్ డిగ్రీలను సస్పెండ్ చేస్తున్నట్లు యూజీసీ కార్యదర్శి పీకే థాకూర్ చెప్పారు. డిగ్రీలు రద్దయిన విద్యార్థులకు 2018 జనవరి 15లోగా పరీక్షలు నిర్వహించాలని సుప్రీం ఇదివరకే ఆదేశించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment