Deemed University
-
ఫీజు కట్టకపోతే నీ సీటు రద్దవుతుంది.. స్వయంగా ప్రిన్సిపాలే రాసి ఇచ్చి..
సాక్షి, హైదరాబాద్: ఉన్నత తరగతుల విద్యార్థులకు సైతం ఫీజుల వేధింపులు తప్పడం లేదు. ఏకంగా ఫీజులు చెల్లించక పోతే అడ్మిషన్‌తోపాటు సీటు రద్దు చేస్తామని ఒత్తిళ్లు చేస్తున్న వైనం వెలుగు చూసింది. ఏపీలో అనుమతులు పొంది, తెలంగాణలో యుజీసీ ప్రత్యేక ఆర్డర్‌తో నగర శివార్లలోని కొండాపూర్, అజీజ్ నగర్, మియాపూర్‌లో వివిధ కోర్సుల తరగతులు నిర్వహిస్తొంది ఒక డీమ్డ్ యూనివర్సిటీ. నగరానికి చెందిన ఒక విద్యార్థి ఆ యూనివర్సిటీలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో చేరారు. కోర్సుకు రూ. 1,85,000 ఫీజు పేర్కొనడంతో ఈ ఏడాది ఏప్రిల్ 24న మొదటి విడతగా రూ. 50 వేలు చెల్లించి అడ్మిషన్ తీసుకొని తరగతులకు హాజరు అవుతున్నారు కాగా తాజాగా పూర్తి ఫీజు చెల్లించాలని విద్యార్థిపై ఒత్తిళ్లు ప్రారంభయ్యాయి. కాగా, గురువారం ఏకంగా ప్రిన్సిపాల్ తక్షణమే ఫీజు చెల్లించకుంటే సీటు రద్దు అవుతుందని లిఖిత పూర్వకంగా రాసి సంతకం చేసి విద్యార్థికి ఇవ్వడం విస్మయానికి గురిచేసింది. ఫీజు కట్టకుంటే సీటు రద్దేంటి..? పూర్తి స్థాయి ఫీజు చెల్లించకుంటే సీటు రద్దు చేస్తామని ప్రిన్సిపాల్ లిఖిత పూర్వకంగా రాయడాన్ని టీఎస్టీసీఈఏ అధ్యక్షుడు అయినేని సంతోష్‌కుమార్ తప్పుబట్టారు. కనీసం గడువు ఇవ్వకుండా ఈ రోజు ఫీజు కట్టకపోతే సీటు రద్దు అవుతుందని పేర్కొనడం సమంజసంకాదన్నారు. విద్యార్థుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడం సరైంది కాదుని వెంటనే వారిని పిలిపించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. -
విద్యార్థులు, నిరుద్యోగులకు డీఆర్డీఓ శుభవార్త
న్యూఢిల్లీ: విద్యార్థులు, నిరుద్యోగులకు డీఆర్డీఓ శుభవార్త తెలిపింది. భారత ప్రభుత్వ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ), డీమ్డ్ విశ్వవిద్యాలయం ఆద్వర్యంలో స్వల్ప కాలనికి రెండు షార్ట్ టర్మ్ ఆన్లైన్ కోర్సులను ప్రారంభిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), సైబర్ సెక్యూరిటీపై రెండు స్వల్పకాలిక ఆన్లైన్ కోర్సులను ప్రారంభించింది. ఈ రెండు కోర్సులు 12వారాల పాటు కొనసాగుతాయి. వారంలోని ఐదు రోజులలో రోజుకి రెండు గంటల చొప్పున ఈ ఆన్లైన్ క్లాస్ నిర్వహించనున్నారు.(చదవండి: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్) ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ కోర్సులలో ఏదైనా స్ట్రీమ్‌లో ప్రవేశం పొందవచ్చు. డిగ్రీ ఫైనల్ చదువుతున్న విద్యార్థులు కూడా ప్రవేశపరీక్షకు హాజరయ్యేందుకు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష రుసుము ఉచితం కాగా, ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒక్కో కోర్సు ధరఖాస్తు కోసం అభ్యర్థులు 15 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కోర్సుల ప్రవేశ పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ జనవరి 28 నుంచి అధికారిక వెబ్సైట్ https://onlinecourse.diat.ac.in/DIATPortal/ ద్వారా ప్రారంభమవుతుంది. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అడ్మిషన్ ఫీజును ఫిబ్రవరి 26లోగా చెల్లించాల్సి ఉంటుంది. డీఆర్డీఓ ఆన్లైన్ కోర్సుల 2021: రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: జనవరి 28 రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ఫిబ్రవరి 15 ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 20 సైబర్ సెక్యూరిటీ ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 21 మూడు కోర్సుల ఫలితాలు విడుదల తేదీ: ఫిబ్రవరి 22 రుసుము చెల్లించాల్సిన చివరి తేదీ: ఫిబ్రవరి 26 ఆన్లైన్ క్లాస్ ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 28 -
'కేఎల్ యూనివర్సిటీ ఆ హోదాను కోల్పోలేదు'
సాక్షి, విజయవాడ : కేఎల్ యూనివర్సిటీ.. ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ హోదాను కోల్పోయిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎల్ఎస్ఎస్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో వస్తోన్న ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రచారంపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. '40 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య అందిస్తున్నాం. విద్యా రంగంలో కేఎల్ యూనివర్సిటీ కనబరుస్తున్న ప్రతిభ వల్ల మా విద్యా సంస్థ డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదాను పొందింది. యూజీసీ, ఎంహెచ్ఆర్డీ నిబంధనలకు అనుగుణంగానే మా యూనివర్సిటీలో ప్రవేశాలు, విద్యా బోధన, పరిశోధనలు జరుగుతాయి' అని వీసీ వెల్లడించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చదవండి: కీలక బిల్లులపై హైకోర్టులో విచారణ వాయిదా -
ఎస్ఆర్ఎం వర్సిటీలో సాంస్కృతికోత్సవాలు
చెన్నై: నగరంలోని ఎస్ఆర్ఎం డీమ్డ్ యూనివర్సిటీలో మిలన్–2018 పేరుతో సాంస్కృతికోత్సవాలు బుధవారం ఘనంగా మొదలయ్యాయి. ఈ వేడుకల ప్రారంభ కార్యక్రమానికి అర్జున్ రెడ్డి చిత్ర హీరో విజయ్ దేవరకొండతోపాటు ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ వ్యవస్థాపక చాన్స్‌లర్ టీఆర్ పారివేందర్, వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్ తదితరులు హాజరయ్యారు. మొత్తం ఐదు రోజులపాటు సాంస్కృతికోత్సవాలు జరగనుండగా తొలిరోజు దాదాపు 6,000 మంది వచ్చారనీ, వేడుకల్లో పాల్గొనేందుకు ఐదు ఖండాల్లోని 40 దేశాల నుంచి విద్యారంగ ప్రముఖులు ఇక్కడకు రానున్నారని నిర్వాహకులు తెలిపారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి మొత్తంగా రూ.15 లక్షల నగదును ఇవ్వనున్నట్లు చెప్పారు. -
ఆ 30వేల మంది ఇంజినీర్లకు అర్హత పరీక్ష
న్యూఢిల్లీ: డీమ్డ్ వర్సిటీల్లో దూరవిద్యలో ఇంజినీరింగ్ పట్టాలు పొందిన వారంతా తిరిగి తాము నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పేర్కొంది. జేఆర్‌ఎన్ రాజస్తాన్ విద్యాపీఠ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (రాజస్తాన్), అలహాబాద్ అగ్రికల్చరల్ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు వినాయక మిషన్ రీసెర్చి ఫౌండేషన్ (తమిళనాడు) దూరవిద్య విధానం ద్వారా 30వేల మందికి ఇంజినీరింగ్ డిగ్రీలు ప్రదానం చేశాయి. అయితే, ఈ పట్టాలు చెల్లవంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో యూజీసీ తాజా నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మే, జూన్ నెలల్లో జరిగే ఈ పరీక్ష రాయాలనుకునే వారు జనవరి 15లోగా పేర్లను నమోదు చేయించుకోవాలని కోరింది. ఇందులో పాసైన వారికే ఇంజినీరింగ్ డిగ్రీలు ప్రదానం చేస్తామని పేర్కొంది. -
‘దూర విద్య’ ఇంజినీరింగ్ పట్టాలు రద్దు
న్యూఢిల్లీ: దూర విద్య ద్వారా నాలుగు డీమ్డ్ యూనివర్సిటీలు అందించిన ఇంజినీరింగ్ పట్టాలను యూజీసీ రద్దు చేసింది. ఈ జాబితాలో రాజస్తాన్‌లోని జేఆర్‌ఎన్ రాజస్తాన్ విద్యాపీఠ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్, అలహాబాద్ అగ్రికల్చరల్ ఇనిస్టిట్యూట్, తమిళనాడులోని వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఉన్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ యూనివర్సిటీల ఇంజినీరింగ్ డిగ్రీలను సస్పెండ్ చేస్తున్నట్లు యూజీసీ కార్యదర్శి పీకే థాకూర్ చెప్పారు. డిగ్రీలు రద్దయిన విద్యార్థులకు 2018 జనవరి 15లోగా పరీక్షలు నిర్వహించాలని సుప్రీం ఇదివరకే ఆదేశించిన సంగతి తెలిసిందే. -
డీమ్డ్ వర్సిటీలపై ‘సుప్రీం’ కొరడా!
న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ముందస్తు అనుమతి లేనిదే దూర విద్యా కోర్సులు కొనసాగించొద్దని సుప్రీంకోర్టు అన్ని డీమ్డ్ యూనివర్సిటీలను ఆదేశించింది. అలాగే 4 డీమ్డ్ యూనివర్సిటీలకు గడిచిన కాలం నుంచి అమల్లోకి వచ్చేలా అనుమతులివ్వడంపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్రానికి సూచించింది. 2001–05 మధ్య కాలంలో రాజస్తాన్‌లోని జేఆర్‌ఎన్ రాజస్తాన్ విద్యాపీఠ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్(ఐఏఎస్ఈ), అలహాబాద్ అగ్రికల్చరల్ ఇనిస్టిట్యూట్(ఏఏఐ), తమిళనాడులోని వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే ఆ నాలుగు డీమ్డ్ యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్ చేసిన విద్యార్థుల పట్టాలను నిలిపివేయాలని సూచించింది. ఈ వర్సిటీలకు యూజీసీ ఇచ్చిన అనుమతులు చెల్లవని స్పష్టం చేసింది. ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఏఐసీటీఈని ఆదేశించింది. -
సేంద్రియ పశుపోషణపై స్వల్పకాలిక కోర్సు
దీర్ఘకాలిక వ్యాధులు నానాటికీ విజృంభిస్తుండడానికి సాంద్ర వ్యవసాయంలో, పశుపోషణలో వాడుతున్న రసాయనాలు కొంతమేరకు కారణభూతమవుతున్నాయి. శారీరక ఆరోగ్య సమస్యలతోపాటు, మానసిక ఆరోగ్య సమస్యలకు కూడా ఇవి దారితీస్తున్నాయి. ఫలితంగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఇటీవల ఆసక్తి పెరుగుతోంది. సేంద్రియ పశుపోషణ - కోళ్ల పెంపకం ప్రమాణాల అమలుకు సంబంధించి 2015 జూన్ 1న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇజ్జత్‌నగర్ (యూపీ)లోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్)కి చెందిన భారతీయ పశువైద్య పరిశోధనా సంస్థ (ఐవీఆర్ఐ) ‘సేంద్రియ పద్ధతుల్లో పశుపోషణ- భావన, ప్రమాణాలు, పద్ధతుల’పై 10 రోజుల స్వల్పకాలిక కోర్సును నిర్వహిస్తున్నది. వచ్చే నవంబర్ 28- డిసెంబర్ 7 తేదీల మధ్య శిక్షణ ఉంటుంది. వ్యవసాయ, పశువైద్య పరిశోధన, విద్యా, విస్తరణ సంస్థలు.. డీమ్డ్ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు శిక్షణకు అర్హులు. వివరాలకు కోర్సు డెరైక్టర్ డా. మహేష్ చందర్‌ను సంప్రదించవచ్చు. +915812302391(O) Fax No. +915812303284 Email: mahesh64@email.com -
డీమ్డ్ వర్సిటీల ఆగడాలు పట్టవా?
విశ్లేషణ సదరు డీమ్డ్ వర్సిటీపై క్రిమినల్ కేసు నమోదై ఉన్నా, అది అత్యధిక ఫీజులు వసూలు చేసినా, చివరకు నాలుగేళ్లు చదివి, కోటిన్నర రూపాయలు వెచ్చించి సాధించిన డిగ్రీలు పనికి రాకుండా పోయినా విద్యార్థులను రక్షించే బాధ్యత యూజీసీపైన లేదా? ప్రయివేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న డీమ్డ్ విశ్వ విద్యాలయాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పరిశీలించి, తగు అర్హతలుంటే ఆ హోదాను ఇచ్చి, అజమాయిషీ చేయ వలసి ఉంటుంది. చెన్నైలోని వివేకానంద మిషన్ రిసెర్చ్ ఫౌండేషన్‌ను (వీఎమ్‌ఆర్‌ఎఫ్) యూజీసీ, డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తించినా దాని పనితీరును మెరు గుపరచడానికి ఏ చర్యా తీసుకోకపోవడం గురించి, విద్యార్థులు నష్టపోతున్నా యాజమాన్యాన్ని మందలించ కపోవడం గురించి నటరాజన్ అనే ఒక పీహెచ్డీ విద్యార్థి ఫిర్యాదు చేశాడు. సెల్వకుమార్ అనే మరొక వైద్య విద్యార్థి పోలీసుస్టేషన్లో ఒక క్రిమినల్ కేసు దాఖలు చేశాడు. ఏటా రూ. 3.5 లక్షలు మాత్రమే ఫీజు వసూలు చేయాలని నియమాలు నిర్దేశిస్త్తుండగా, ఆ సంస్థ వారు ఏటా దాదాపు నలభై లక్షల రూపాయల చొప్పున 42 మంది విద్యార్థుల దగ్గర నుంచి నాలుగేళ్లు వసూలు చేశారనీ, తీరా నాలుగేళ్లు చదివిన తరువాత వారి వైద్య విద్యా డిగ్రీకి గుర్తింపులేక, పనికిరాకుండాపోయిందనీ, కనీసం పోస్టు గ్రాడ్యుయేషన్ చదవడానికి కూడా అది ఉపయోగపడక తమకు చాలా నష్టం జరిగిందనీ ఫిర్యాదుదారు పేర్కొన్నాడు. దీన్ని మోసంగా భావించి నేర విచారణ చేయాలని ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. దాని ప్రతిని యూజీసీకి కూడా పంపారు. దీనిపైన ఏ చర్య తీసుకున్నారని నటరాజన్ సమాచార హక్కు చట్టం కింద కోరారు. తన పరిశోధనా పత్రం మూల్యాంకనం చేయలేదని ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది ఎందుకని నటరాజన్ యూజీసీని ప్రశ్నించారు. ఏ ఫిర్యాదూ అందలేదని ఒక్క వాక్యంతో యూజీసీ ప్రజాసమాచార అధికారి సమాధానం చెప్పారు. నట రాజన్ సమస్యను పరిష్కరించవలసింది యూనివర్సిటీ వారేనని, తమకు సంబంధం లేదని అన్నారు. సదరు విశ్వవిద్యాలయంపై క్రిమినల్ కేసు దాఖలై ఉన్నా, నియమాలను ఉల్లంఘించి అది అత్యధిక ఫీజులు వసూలు చేసినా, చివరకు నాలుగేళ్లు చదివి, కోటిన్నర రూపాయలు వెచ్చించి సాధించిన డిగ్రీలు పనికి రాకుండాపోయినా విద్యార్థులను రక్షించే బాధ్యత యూజీసీపైన లేదా? అని నటరాజన్ ప్రశ్నించారు. యూజీసీ సమాచార అధికారి శ్రీ చరణ్ దాస్, డీమ్డ్ సంస్థల వ్యవహారాలను చూసే బాధ్యతలు కూడా నిర్వ హిస్తున్నారు. ఆయన తన ఫిర్యాదుపై ఏ చర్యా తీసుకో లేదని, కనీసం కోరిన సమాచారం కూడా సదరు ప్రైవేటు విద్యాసంస్థ నుంచి ఇప్పించలేదని నటరాజన్ అన్నారు. డీమ్డ్ యూనివర్సిటీల ప్రమాణాలను అధ్యయనం చేసేందుకు భారత ప్రభుత్వం ప్రొఫెసర్ టాండన్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ 2009లో నివేదికను సమర్పించింది. దేశమంతటా పుట్టగొడు గుల్లా వ్యాపించిన డీమ్డ్ విశ్వవిద్యాలయాలు పెక్కిం టిలో ప్రమాణాలు లోపించడం, నిర్వహణ లోపభూయి ష్టంగా ఉండటం, అవి నియమాలను పాటించకపోవ డం వంటి సమస్యలపై తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. యశ్పాల్ కమిటీ కూడా ఈ సంస్థలలో ప్రమాణాల పత నం గురించి ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ముందు కొత్తగా ఏ సంస్థకూ విశ్వవిద్యాలయ హోదా ఇవ్వరాదని ఆంక్షలు విధించారు కూడా. డీమ్డ్ విశ్వవిద్యాలయాల ప్రమాణాలను పరిశీలించిన తరువాత టాండన్ కమిటీ వాటిని మూడు భాగాలుగా వర్గీకరించింది. మొదటి భాగంలో విశ్వవిద్యాలయ హోదాకు తగిన ఉన్నత ప్రమాణాలతో నడిచే సంస్థల జాబితాను ఇచ్చారు. మరీ ఉత్తమ ప్రమాణాలు లేక పోయినా, కొన్ని లోపాలు ఉన్న ప్పటికీ, ఆ లోపాలను సవరించడానికి వీలున్న డీమ్డ్ విశ్వవిద్యాలయాలను రెండో భాగంలో చేర్చారు. కొన్ని మార్పులతో ఈ సంస్థలు విశ్వవిద్యాలయాలుగా కొనసా గవచ్చని పేర్కొన్నారు. ఇక మూడో జాబితా పనికి రాని విశ్వవిద్యాలయాలది. అంటే స్థాపించిన నాటి నుంచి ఇప్పటివరకూ ఏ విధమైన ప్రమాణాలను పాటించని వాటిని, ఇక ముందు కూడా ఆ ప్రమాణాలను సాధించే అవకాశం లేని వాటిని, ఆ హోదాను కొనసాగించడానికీ వీల్ల్లేనివాటిని టాండన్ కమిటీ ఈ మూడో జాబితాలో చేర్చింది. ఆ మూడో జాబితాలో వివేకానంద సంస్థ ఉంది. సమాచార అధికారి సమాచారం ఇవ్వకపోగా, ఆ సంస్థలు కోర్టులో తమకు ప్రమాణాలు లేవన్న విమ ర్శను సవాలు చేశాయని, కనుక ఆ కేసు ముగిసేదాకా ఆ సంస్థలపై ఏ చర్యా తీసుకోవడానికి వీల్లేదని వాదిం చారు. ఆ కేసుకు, విద్యార్థుల సమస్యల పరిష్కారాలకు సంబంధం ఏమిటని అడిగితే జవాబు లేదు. విద్యార్థులు తమ డిగ్రీ పనికి రాకుండా పోయిందన్న ఫిర్యాదుపై స్పందించకపోగా, ఎఫ్ఐఆర్ దాఖైలైనట్టు తెలిసినా ఆ సంస్థను నిలదీయకపోవడం, విద్యార్థుల నుంచి అందిన ఇతర ఫిర్యాదులను సైతం పట్టించుకోకపోవడం అభ్యం తరకరమని కమిషన్ వ్యాఖ్యానించింది. వెంటనే చర్య తీసుకోవలసిన యూజీసీ నిర్లిప్తంగా ఉందన్నారు. అజ మాయిషీ నియమాలను అనుసరించి యూజీసీ ఏ చర్య తీసుకుందో వివరించాలనీ, వివేకానంద విద్యాసంస్థ మోసం చేసిందన్న అంశంపైన, డిగ్రీ చెల్లుబాటు కాక పోవడంపైన వివరణ ఇవ్వాలనీ, టాండన్ సిఫార్సుల అమలు గురించి వివరించాలనీ కమిషన్, యూజీసీని ఆదేశించింది. వీఎమ్‌ఆర్‌ఎఫ్ రిజిస్ట్రార్ గానీ, వైస్చాన్స లర్ గానీ వ్యక్తిగతంగా హాజరై సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. సమాచారం ఇవ్వకుండా వేధించినందుకు వినాయక విద్యా సంస్థ, నటరాజన్‌కు పదివేల రూపా యల పరిహారం ఇవ్వాలని తీర్పు చెప్పింది. యూజీసీకి జరిమానా ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వాలని నోటీసును కూడా జారీ చేసింది. (నటరాజన్ వర్సెస్ యూజీసీ కేసులో ఇచ్చిన తీర్పు ఆధారంగా) (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్: మాడభూషి శ్రీధర్) professorsridhar@gmail.com -
పుటపర్తిలో ఘనంగా సత్యసాయిబాబా వేడుకలు
అనంతపురం:పుటపర్తి సత్యసాయిబాబా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సత్యసాయి ట్రస్ట్ వార్షిక నివేదికను కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా విడుదల చేయగా, రూ.80 కోట్లతో చేపట్టిన సత్యసాయి తాగునీటి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చినరాజప్ప ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 128 గ్రామాలకు మంచి నీరు సరఫరా కానుంది. శనివారం సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 33వ స్నాతకోత్సవాన్నిపుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కన్నుల పండువగా నిర్వహించారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, భక్తులు శ్వేత వస్త్రధారులై.. వేడుకల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ ముఖ్యఅతిథిగా హాజరై.. విద్యార్థులనుద్దేశించి ఉపన్యసించారు. -
కన్నుల పండుగ
ఘనంగా సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవం పుట్టపర్తి టౌన్ : సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 33వ స్నాతకోత్సవాన్ని శనివారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కన్నుల పండువగా నిర్వహించారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, భక్తులు శ్వేత వస్త్రధారులై.. వేడుకల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ ముఖ్యఅతిథిగా హాజరై.. విద్యార్థులనుద్దేశించి ఉపన్యసించారు. ఉదయం 10.35 గంటలకు విద్యార్థుల బ్రాస్‌బ్యాండ్ వాయిద్యం నడుమ యూనివర్సిటీ బోర్డు ఆఫ్ మేనేజ్మెంట్, అకడమిక్ కౌన్సిల్ బృందాన్ని, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీలను, ముఖ్య అతిథి కస్తూరి రంగన్‌ను యజుర్ మందిరం నుంచి స్నాతకోత్సవ వేదికైన సాయికుల్వంత్ సభామందిరానికి తీసుకొచ్చారు. 10.45కు యూనివర్సిటీవిద్యార్థులు వేదపఠనం గావించారు. 10.48కి వైస్ ఛాన్సలర్ శశిధర్ ప్రసాద్ స్నాతకోత్సవాన్ని ప్రారంభించాలని యూనివర్సిటీ వ్యవస్థాపక కులపతి అయిన సత్యసాయిని ప్రార్థించారు. ‘నేను ప్రారంభిస్తున్నాను’ అంటూ సత్యసాయి వాణిని డిజిటల్ స్క్రీన్ల ద్వారా వినిపించారు. అనంతరం వీసీ శశిధర్ ప్రసాద్ యూనివర్సిటీ విద్యావిధానం, ఛాన్సలర్ జస్టిస్ వెంకటాచలయ్య, ముఖ్యఅతిథి కస్తూరి రంగన్ల నేపథ్యాన్ని వివరిస్తూ ప్రారంభోపన్యాసం చేశారు. యూనివర్సిటీ పరిధిలోని ప్రశాంతి నిలయం, ముద్దనహళ్లి, బృందావన్, అనంతపురం క్యాంపస్‌లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ఏడుగురు పరిశోధక విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలను ఛాన్సలర్ విశ్రాంత జస్టిస్ వెంకటాచలయ్య చేతుల మీదుగా ప్రదానం చేశారు. ‘తాము ఆర్జించిన జ్ఞానంతో సత్కర్మలను అచరిస్తామం’టూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ముఖ్య అతిథి కస్తూరి రంగన్ ఉపన్యసించారు. విలువలతో కూడిన సనాతన విద్యా వ్యవస్థను సత్యసాయి నెలకొల్పడం గర్వించదగ్గ విషయమన్నారు. 21వ శతాబ్దపు సమాజ అవసరాలకు అనుగుణంగా సత్యసాయి విద్యా వ్యవస్థ రూపుదిద్దుకుందని వివరించారు. విద్యావంతులైన యువత నూతన ఆవిష్కరణల వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఆవిష్కరణలకు మూలమైన పరిశోధనల వైపు విద్యార్థులను తీసుకెళ్లాల్సిన బాధ్యత యూనివర్సిటీలపై ఉందని అభిప్రాయపడ్డారు. మానవ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకున్నప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి సాధిస్తుందన్నారు. జాతీయ గీతాలాపనతో స్నాతకోత్సవం ముగిసింది. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్రాజు, చక్రవర్తి, మద్రాస్ శ్రీనివాస్, నాగానంద, ఎస్వీ గిరి, టీకేకే భగవత్, ట్రస్ట్ కార్యదర్శి ప్రసాద్ రావు, సిమ్స్ డెరైక్టర్ డాక్టర్ ఓలేటి చౌదరి, జేఎన్టీయూ(ఏ) వైస్ ఛాన్సలర్ లాల్‌కిశోర్, కదిరి ఆర్డీఓ రాజశేఖర్, గాయని సుశీల, కర్ణాటక సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ, విశ్రాంత డీజీపీలు హెచ్‌జే దొర, అప్పారావు, ప్రశాంతి నిలయం కౌన్సిల్ చైర్మన్ నరేంద్రనాథ్‌రెడ్డి, సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవం
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 33వ స్నాతకోత్సవం శనివారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభామందిరంలో బాబా మహా సమాధి చెంత ఘనంగా నిర్వహించనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) విశ్రాంత చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఉదయం 10.35 గంటలకు స్నాతకోత్సవం ప్రారంభమవుతుంది. 10.48కి వర్సిటీ వైస్ ఛాన్సలర్ శశిధర్ ప్రసాద్ స్నాతకోత్సవాన్ని డిక్లేర్ చేయాలని సత్యసాయిని ప్రార్థిస్తారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. 10.55కు ఛాన్సలర్ జస్టిస్ వెంకటాచలయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చేతుల మీదుగా విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేస్తారు.10.57కు విద్యార్థులు ప్రతిజ్ఞ చేస్తారు. 11 గంటలకు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలను బహూకరిస్తారు. 11.20కి ముఖ్యఅతిథి కస్తూరి రంగన్ విద్యార్థులకు స్నాతకోత్సవ సందేశాన్ని వినిపిస్తారు. 11.40కి ఉదయపు సెషన్ ముగుస్తుంది. సాయంత్రం 4.30 గంటలకు విద్యార్థుల వేదమంత్రోచ్ఛారణతో తిరిగి వేడుకలు ప్రారంభమవుతాయి. ఐదు గంటలకు విద్యాబోధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సాయికృష్ణ అవార్డులను ప్రదానం చేస్తారు. 5.15కు విద్యార్థులు స్నాతకోత్సవ నాటిక ప్రదర్శిస్తారు. విద్యా పరిమళాలు : విద్యావ్యాప్తికి సత్యసాయి విశేష కృషి చేశారు. ఇందులో భాగంగా 1981 అక్టోబర్ 10న సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయ్యర్ లర్నింగ్(సత్యసాయి డీమ్డ్ టు బీ యునివర్సిటీ)ను స్థాపించారు. దీని ఆధ్వర్యంలో అనంతపురం మహిళా క్యాంపస్, ప్రశాంతి నిలయం, ముద్దనహళ్లి, బృందావన్ క్యాంపస్‌లను నెలకొల్పారు. దేశీయంగా మరో ఆరు సత్యసాయి కళాశాలలతో పాటు 99 పాఠశాలలు నిర్వహిస్తున్నారు. విదేశాలలో సైతం 30 పాఠశాలలు, మరో 30 కళాశాలలు నడుపుతున్నారు. -
ఉన్నత విద్యకు ఇంటిగ్రేటెడ్ కోర్సులు
మంచిర్యాల సిటీ : ఇంటర్ చదివాక డిగ్రీ. ఆ తర్వాత పీజీ చదవాలంటే ప్రవేశ పరీక్ష రాయాలి. ర్యాంకు రాకుంటే.. సీటు రాక ఏడాది వృథానే. అయితే ఇలాంటి కష్టాలేవీ ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో చేరేవారికి ఉండవు. ఇంటర్ పూర్తయ్యాక ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో చేరితే పీజీ అర్హత పరీక్ష ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా కాలమూ కలిసొస్తుంది. ఏడాది ఖర్చులూ మిగులుతాయి. ఇంటర్‌తో ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు డిగ్రీ, పీజీ పట్టాతో రెండు కోర్సులు పూర్తి చేసుకొని యూనివర్సిటీ నుంచి బయటకు వస్తారు. అంటే ఒక్కసారి చేరితే డిగ్రీ, పీజీ పట్టాలతో బయటకు రావడమే. ఇక వెతుక్కోవాల్సింది ఉద్యోగమే. కొత్తగా పలు యూనివర్సిటీలు ఇంటిగ్రేటెడ్ కోర్సులుగా ఇంజినీరింగ్, ఎం.ఏ., ఎంబీఏ, ఎమ్మెస్సీ అందిస్తున్నాయి. ఇంటర్ విద్యార్హతతో డిగ్రీ, పీజీ కోర్సులను ఒకేచోట యూనివర్సిటీలు అందిస్తుండడంతో విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ కోర్సులవైపు ఆసక్తి చూపుతున్నారు. ఐఐటీ.. దేశంలోనే ఇంజినీరింగ్ పరిశోధనల్లో పేరున్న సంస్థ ఐఐటీ. ఎంతో విశిష్టత కలిగిన ఈ సంస్థ కూడా ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందిస్తోంది. ఎన్నో కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఇంజినీరింగ్‌తోపాటు ఎం.టెక్ కోర్సు అందిస్తోంది. దీనిద్వారా విద్యార్థులకు ఒక ఏడాది కాలం కలిసివస్తుంది. ఇంటిగ్రేటెడ్‌లో సీఎస్ఈ, కెమికల్, బయోటెక్నాలజీ, ఐటీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సులు అందిస్తోంది. ‘యోగి వేమన’.. యోగి వేమన యూనివర్సిటీలో బయోటెక్నాలజీ ఇన్ఫర్మాటిక్స్, ఎర్త్ సైన్స్‌లో ఐదేళ్ల కోర్సులు ఉన్నాయి. వీటిలో చేరడానికి ఇంటర్ ఎంపీసీ, బైపీసీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. ‘కాకతీయ’.. కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీలో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులున్నాయి. ఇంటర్లో బైపీసీ, ఎంపీసీలో ఉత్తీర్ణులైనవారు అర్హులు. ‘డీ మ్డ్’.. దేశంలోని పలు డీమ్డ్ యూనివర్సిటీలు ఐదేళ్ల ఇంజినీరింగ్ ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందిస్తున్నాయి. సాధారణంగా ప్రతీ విద్యార్థి ఇంజినీరింగ్ నాలుగేళ్లు, ఎంటెక్ రెండేళ్లు చదవాలి. ఎంటెక్ కోర్సుకు ప్రవేశపరీక్ష ఉంటుంది. ర్యాంకు రాని ఎడల ఒక సంవత్సర ం వృథా అవుతుంది. దీంతో డీమ్డ్ యూనివర్సిటీలైన ఎస్ఆర్ఎం, విట్, విజ్ఞాన్, కేఎల్, హిందుస్థాన్, అన్నమలై ఇంటిగ్రేటెడ్ కోర్సుల వైపు మన విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు. ‘నాగార్జున’.. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎమ్మెస్సీ కోర్సు అందిస్తోంది. దీంతోపాటు ఎంబీఏ(ఇంటర్నేషనల్ బిజినెస్) కోర్సు ఆఫర్ చేస్తోంది. ఈ రెండు కోర్సులకు ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణులైనవారు అర్హులు. ‘ఉస్మానియా’.. ఉస్మానియా యూనివర్సిటీలో ఐదే ళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ), ఎంఏ(ఎకనామిక్స్), ఎంబీఏ ఉన్నాయి. ఇంటర్లో సంబంధిత కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉత్తీర్ణులైతే సరిపోతుంది. ‘హైదరాబాద్ సెంట్రల్’.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ, ఎంఏ, లాంగ్వేజ్ కోర్సులు ఉన్నాయి. వీటిలో చేరడానికి ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు. జేఎన్టీయూ (కాకినాడ) జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ.. ఇంజినీరింగ్ విభాగంలో ఐదేళ్ల కోర్సులను అందిస్తోంది. ఐదేళ్ల కాలంలో మూడున్నరేళ్లు యూనివర్సిటీలో, మిగిలిన ఏడాదిన్నర కాలం కోర్సు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న విదేశీ యూనివర్సిటీలో విద్యార్థి చదవాల్సి ఉంటుంది. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు పూర్తిచేసినవారికి బీటెక్‌తోపాటు ఎంటెక్ సర్టిఫికెట్ యూనివర్సిటీ అందజేస్తుంది. ఈఈఈ, సివిల్, ఈసీఈ, సీఎస్ఈ, ఏవియేషన్, ఎయిర్‌క్రాఫ్ట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. -
ఆ హోదా.. సాధిస్తారా..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాకు లభించే ఒక మహత్తర అవకాశం చేజారిపోయేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో స్వయంప్రతిపత్తి కలిగిన కళాశాలల్లో ఆరింటికి డీమ్డ్ యూని వర్సిటీ హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ జాబితాలో చోటు దక్కించుకునేందుకు జిల్లా నుంచి 129 ఏళ్ల చరిత్ర కలిగిన పీఆర్ కళాశాల బరిలోకి దిగింది. అనుమతి కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలికి ప్రతిపాదనలు కూడా పంపించింది. ఫలితం కోసం నిరీక్షిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ కళాశాలకు డీమ్డ్ హోదా సాధించేందుకు కాకినాడకే చెందిన కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు కనీస ప్రయత్నం చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీమ్డ్ యూనివర్సిటీ హోదాకు అవసరమైన అన్ని అర్హతలూ పీఆర్ కాలేజీకి ఉన్నాయి. పిఠాపురం మహారాజా రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దూర్ 1884లో సువిశాలమైన 32 ఎకరాల ప్రాంగణంలో ఈ కళాశాలను స్థాపించారు. ఇది 2000 సంవత్సరంలో స్వయంప్రతిపత్తి సాధించింది. ఏటా 3 వేల మందిని విద్యావంతులను చేసి ఉత్తమ పౌరులుగా సమాజానికి అందిస్తోంది. ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ లక్షా 50 వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దింది. పళ్లంరాజు తలచుకుంటే పెద్ద విషయమే కాదు కేంద్ర కేబినెట్లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రాతినిధ్యం వహిస్తున్న పళ్లంరాజు తలచుకుంటే పీఆర్ కాలేజీకి డీమ్డ్ హోదా లభించడం పెద్ద విషయమేమీ కానే కాదు. ఈ కాలేజీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ పార్లమెంటు స్థానం పరిధిలోనే ఉంది. కేంద్ర మంత్రిగా రెండు శాఖలు మారి, పదోన్నతి లభించినా ఈ ప్రాంతానికి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాజెక్టులు సాధించలేకపోయారనే విమర్శలను ఆయన ఇప్పటికే ఎదుర్కొంటున్నారు. ఇదే స్థానం నుంచి గతంలో కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన ఆయన తండ్రి శ్రీరామ సంజీవరావు కాకినాడకు టీవీ రిలే కేంద్రం తీసుకువచ్చారు. శ్రీరామ సంజీవరావు విద్యాభ్యాసం చేసింది కూడా ఈ కళాశాలలోనే కావడం గమనార్హం. పీఆర్ కాలేజీకి డీమ్డ్ హోదా సాధించేందుకు కేంద్ర మంత్రి పళ్లంరాజు సహా జిల్లా ప్రజాప్రతినిధులందరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.