ఆ హోదా.. సాధిస్తారా..! | Deemed University status to the pr college | Sakshi
Sakshi News home page

ఆ హోదా.. సాధిస్తారా..!

Published Wed, Dec 18 2013 5:06 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM

Deemed University status to the pr college

సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాకు లభించే ఒక మహత్తర అవకాశం చేజారిపోయేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో స్వయంప్రతిపత్తి కలిగిన కళాశాలల్లో ఆరింటికి డీమ్డ్ యూని వర్సిటీ హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ జాబితాలో చోటు దక్కించుకునేందుకు జిల్లా నుంచి 129 ఏళ్ల చరిత్ర కలిగిన పీఆర్ కళాశాల బరిలోకి దిగింది. అనుమతి కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలికి ప్రతిపాదనలు కూడా పంపించింది. ఫలితం కోసం నిరీక్షిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ కళాశాలకు డీమ్డ్ హోదా సాధించేందుకు కాకినాడకే చెందిన కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు కనీస ప్రయత్నం చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

డీమ్డ్ యూనివర్సిటీ హోదాకు అవసరమైన అన్ని అర్హతలూ పీఆర్ కాలేజీకి ఉన్నాయి. పిఠాపురం మహారాజా రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దూర్ 1884లో సువిశాలమైన 32 ఎకరాల ప్రాంగణంలో ఈ కళాశాలను స్థాపించారు. ఇది 2000 సంవత్సరంలో స్వయంప్రతిపత్తి సాధించింది. ఏటా 3 వేల మందిని విద్యావంతులను చేసి ఉత్తమ పౌరులుగా సమాజానికి అందిస్తోంది. ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ లక్షా 50 వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దింది.
 పళ్లంరాజు తలచుకుంటే పెద్ద విషయమే కాదు
 కేంద్ర కేబినెట్‌లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రాతినిధ్యం వహిస్తున్న పళ్లంరాజు తలచుకుంటే పీఆర్ కాలేజీకి డీమ్డ్ హోదా లభించడం పెద్ద విషయమేమీ కానే కాదు. ఈ కాలేజీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ పార్లమెంటు స్థానం పరిధిలోనే ఉంది. కేంద్ర మంత్రిగా రెండు శాఖలు మారి, పదోన్నతి లభించినా ఈ ప్రాంతానికి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాజెక్టులు సాధించలేకపోయారనే విమర్శలను ఆయన ఇప్పటికే ఎదుర్కొంటున్నారు. ఇదే స్థానం నుంచి గతంలో కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన ఆయన తండ్రి శ్రీరామ సంజీవరావు కాకినాడకు టీవీ రిలే కేంద్రం తీసుకువచ్చారు. శ్రీరామ సంజీవరావు విద్యాభ్యాసం చేసింది కూడా ఈ కళాశాలలోనే కావడం గమనార్హం. పీఆర్ కాలేజీకి డీమ్డ్ హోదా సాధించేందుకు కేంద్ర మంత్రి పళ్లంరాజు సహా జిల్లా ప్రజాప్రతినిధులందరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement