pallamraju
-
చిరంజీవి గైర్హాజరుపై కాంగ్రెస్ క్లారిటీ
విజయవాడ: ఏపీసీసీ సమన్వయ కమిటీ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు చిరంజీవి గైర్హాజరుపై కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇచ్చారు. కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల చిరంజీవి పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని, ఆయన ఎప్పటికీ కాంగ్రెస్ తోనే ఉంటారని తెలిపారు. కాగా శనివారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎం.పీ దిగ్విజయ్ సింగ్, కుంతియా, కొప్పుల రాజు, కె.వి.పి., రామచంద్రయ్య, మాజీ కేంద్ర మంత్రులు కిల్లి కృపారాణి, పల్లం రాజు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు కేంద్ర మాజీమంత్రి పల్లంరాజు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత, ప్రజాసమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించామన్నారు. పార్టీ ఫిరాయింపులకి కాంగ్రెస్ వ్యతిరేకమని, ఇప్పటికే ఈ విషయమై రాష్ట్రపతికి ఉత్తరం రాశామన్నారు. అలాగే మాజీ ఎంపీ జేడీ శీలం మాట్లాడుతూ ఫిరాయించిన ఎవరైనా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని తెలిపారు. ఫిరాయింపులపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తప్పుబట్టిన చంద్రబాబు నాయుడు నేడు అదే విధానాన్ని అవలంభించడం దారుణమని విమర్శించారు. తమ పార్టీ నుంచి వెళ్లినవారికి కూడా పదవులు ఇచ్చారన్నారు. ఫిరాయింపుకు పాల్పడివారు ఎవరైనా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. -
శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మాజీ మంత్రి
చిత్తూరు: శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో అన్ని పార్టీల అనుమతితోనే ప్రత్యేక హోదా అంశం కేబినెట్లో ప్రవేశపెట్టామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావటం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక హోదాపై ప్రణాళికపరంగా పోరాటం చేయలేకపోవటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రత్యేక హోదాపై చేసే పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. -
సాయంత్రం పల్లంరాజు నివాసంలో కాపు నేతల భేటీ
హైదరాబాద్ : భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ప్రముఖ కాపు నేతలు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు నివాసంలో సమావేశం కానున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు కాపు నేతలతో తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు కన్నబాబు భేటీ అయ్యారు. కాపులను వేధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడకు ఏం జరిగినా అందుకు చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని కన్నబాబు డిమాండ్ చేశారు. ఇక ముద్రగడ దీక్షపై కడపలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాపు, బలిజ, అఖిలపక్ష నేతలు హాజరయ్యారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, రఘురాంరెడ్డి, మేయర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కాగా ముద్రగడ దీక్షను వెనకుండి నడిపిస్తున్నారంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ముద్రగడకిచ్చిన హామీలు అధికారులు చెప్పినవే అని, లోకేశ్ చెప్పినవి కాదని అన్నారు. కాపులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తోందని గంటా తెలిపారు. -
'సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు తెరపైకి వచ్చిన నేపథ్యంలో పల్లంరాజు స్పందించారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడినట్టు రికార్డయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు పాత్రను పల్లంరాజు తప్పుపడుతూ సీఎం పదవికి రాజీనామా చేయాలని పేర్కొన్నారు. ఇక ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీకి కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సహాయం చేయడం సరికాదని పల్లంరాజు అన్నారు. -
హైదరాబాద్ విషయంలో విఫలం-తూర్పుగోదావరి కోసం ప్రయత్నం
కాకినాడ: హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యుటి) చేసేందుకు కేంద్రాన్ని ఒప్పించడంలో తాము విఫలమయ్యామని, ఇప్పుడు సీమాంధ్ర రాజధానిని తూర్పు గోదావరి జిల్లాకు తీసుకురావడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పళ్లం రాజు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకే రాజధానిని రప్పించడానికి తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్లు చెప్పారు. కాకినాడలో సీబీఎస్సీ ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర రాజధాని ఎక్కడనే విషయంపై కేంద్రం ఓ కమిటీని నియమిస్తుందని చెప్పారు. ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా స్వీకరిస్తాం రాష్ట్రవిభజన విషయంలో తాము పొరబాటు చేసినట్లు ప్రజలు భావిస్తే, వచ్చే ఎన్నికల్లో వారు ఎటువంటి తీర్పు ఇచ్చినా స్వీకరిస్తామని పళ్లంరాజు చెప్పారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఓ ల్యాబ్‌తో పాటు నూతనంగా నిర్మించే ఐసీయూకి ఆయన శంకుస్ధాపన చేశారు. 2014 ఎన్నికల్లో కాకినాడ నుంచే లోక్‌సభకు పోటీచేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ అంశం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ అన్ని పార్టీల నిర్ణయం మేరకే విభజన జరిగిందని తెలిపారు. హైదరాబాద్‌ను యూటీ చేసేందుకు కేంద్రాన్ని ఒప్పించడంలో తాము విఫలమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. -
కిరణ్ వైఖరి సబబే: పళ్లంరాజు
కాకినాడ: రాష్ట్ర విభజన బిల్లును వెనక్కిపంపాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సబబేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పళ్లంరాజు అన్నారు. బిల్లులో లోపాలున్నాయని తాము ఎప్పటి నుంచో కాంగ్రెస్ అధిష్టానికి చెబుతున్నామని చెప్పారు. బిల్లుకు సంబంధించిన అంశాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి వచ్చిన తర్వాతే స్పందిస్తానని పళ్లంరాజు తెలిపారు. కాగా విభజనపై బిల్లు, ఓటింగ్ పై ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అస్పష్ట వైఖరి అవలంభిస్తుండటంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. -
మళ్లీ విధుల్లోకి పళ్లంరాజు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ 2 నెలల నుంచి విధులకు దూరంగా ఉన్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎం.ఎం. పళ్లంరాజు మళ్లీ తన కార్యాలయానికి వచ్చారు. శుక్రవారం ఇక్కడి శాస్త్రి భవన్‌లోని తన కార్యాలయంలో విధులు చేపట్టారు. విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసినా.. అక్టోబర్ 4 నుంచి ఆయన తన అధికార నివాసం నుంచో లేదా మంత్రిత్వ శాఖ కమిటీ హాల్ నుంచో విధులు నిర్వర్తిస్తున్నారు. నెల రోజుల నుంచి అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు పళ్లంరాజు మంత్రిత్వ కార్యాలయానికి వచ్చే వరకూ ఆయన వస్తున్న సంగతి తమకు తెలియదని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. -
ఆ హోదా.. సాధిస్తారా..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాకు లభించే ఒక మహత్తర అవకాశం చేజారిపోయేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో స్వయంప్రతిపత్తి కలిగిన కళాశాలల్లో ఆరింటికి డీమ్డ్ యూని వర్సిటీ హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ జాబితాలో చోటు దక్కించుకునేందుకు జిల్లా నుంచి 129 ఏళ్ల చరిత్ర కలిగిన పీఆర్ కళాశాల బరిలోకి దిగింది. అనుమతి కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలికి ప్రతిపాదనలు కూడా పంపించింది. ఫలితం కోసం నిరీక్షిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ కళాశాలకు డీమ్డ్ హోదా సాధించేందుకు కాకినాడకే చెందిన కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు కనీస ప్రయత్నం చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీమ్డ్ యూనివర్సిటీ హోదాకు అవసరమైన అన్ని అర్హతలూ పీఆర్ కాలేజీకి ఉన్నాయి. పిఠాపురం మహారాజా రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దూర్ 1884లో సువిశాలమైన 32 ఎకరాల ప్రాంగణంలో ఈ కళాశాలను స్థాపించారు. ఇది 2000 సంవత్సరంలో స్వయంప్రతిపత్తి సాధించింది. ఏటా 3 వేల మందిని విద్యావంతులను చేసి ఉత్తమ పౌరులుగా సమాజానికి అందిస్తోంది. ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ లక్షా 50 వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దింది. పళ్లంరాజు తలచుకుంటే పెద్ద విషయమే కాదు కేంద్ర కేబినెట్లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రాతినిధ్యం వహిస్తున్న పళ్లంరాజు తలచుకుంటే పీఆర్ కాలేజీకి డీమ్డ్ హోదా లభించడం పెద్ద విషయమేమీ కానే కాదు. ఈ కాలేజీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ పార్లమెంటు స్థానం పరిధిలోనే ఉంది. కేంద్ర మంత్రిగా రెండు శాఖలు మారి, పదోన్నతి లభించినా ఈ ప్రాంతానికి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాజెక్టులు సాధించలేకపోయారనే విమర్శలను ఆయన ఇప్పటికే ఎదుర్కొంటున్నారు. ఇదే స్థానం నుంచి గతంలో కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన ఆయన తండ్రి శ్రీరామ సంజీవరావు కాకినాడకు టీవీ రిలే కేంద్రం తీసుకువచ్చారు. శ్రీరామ సంజీవరావు విద్యాభ్యాసం చేసింది కూడా ఈ కళాశాలలోనే కావడం గమనార్హం. పీఆర్ కాలేజీకి డీమ్డ్ హోదా సాధించేందుకు కేంద్ర మంత్రి పళ్లంరాజు సహా జిల్లా ప్రజాప్రతినిధులందరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. -
విభజన ప్రక్రియ వేగంగా సాగుతోంది: పళ్లంరాజు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎంత కోరినా తమ మాటను కాంగ్రెస్ అధిష్టానం వినట్లేదని కేంద్ర మంత్రి పల్లంరాజు అన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ చాలా వేగంగా సాగుతోందని చెప్పారు. కాగా ఏ ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజిస్తున్నారో తెలియదని పళ్లంరాజు తెలిపారు. ప్రాంతాల వారీగా విడిపోయినా ప్రజల మధ్య విభేదాలు రాకూడదని కోరుకుంటున్నట్టు పళ్లంరాజు వ్యాఖ్యానించారు. సీమాంధ్రకు కేంద్ర ప్రభుత్వం ఎలా న్యాయం చేస్తుందనే విషయాన్ని చెప్పలేమని అన్నారు. 11 అంశాల్లో సీమాంధ్రకు న్యాయం చేయాలని జీవోఎంను కోరినట్టు మంత్రి తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామ చేసిన పళ్లంరాజు అనంతరం విధులకు హాజరవుతున్నారు. -
పల్లంరాజును అడ్డుకున్న సమైక్యవాదులు
-
పల్లంరాజును అడ్డుకున్న సమైక్యవాదులు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో అడుగడుగున కేంద్ర మంత్రి పల్లంరాజును సమైక్యవాదులు అడ్డుకుంటున్నారు. ఈ రోజు సామర్లకోటలో సమైక్యవాదులు ఆయనను అర్ధగంటసేపు ఘోరావ్ చేశారు. రాజీనామా ఎందుకు చేయలేదని నిలదీశారు. తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ నుంచి సామర్లకోట వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సమైక్యవాదులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ తన చేతిలో ఏమీలేదని అంతా కేంద్ర చేతిలో ఉన్నట్లు తెలిపారు. అంతకు ముందు శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో మంత్రి శత్రుచర్ల విజయమరామరాజును సమైక్యవాదులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఆయన కాన్వాయ్‌పై సమైక్యవాదులు రాళ్లు, చెప్పులు విసిరారు. సమైక్యాంధ్రకు ద్రోహం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు: పల్లంరాజు
తెలంగాణ ఏర్పాటు వల్ల సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు మరింతమంది రాజీనామా చేసే అవకాశముందని, దీనివల్ల కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చన్న ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వ్యాఖ్యలతో కేంద్ర మంత్రి పల్లంరాజు ఏకీభవించారు. పవార్ అనుభజ్ఞుడైన నేతని, ఆయన మాటల్లో నిజం ఉండొచ్చని పల్లంరాజు అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రుల బృందం కూడా సీమాంధ్రులకు న్యాయం చేయకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని పల్లంరాజు అన్నారు. కాగా ఇటీవల ప్రధానిని కలసి తన రాజీనామాను ఆమోదించమని కోరిన పల్లంరాజు మళ్లీ రాజీనామా మాట ఎత్తడం గమనార్హం. తూర్పుగోదావరికి వచ్చిన కేంద్ర మంత్రికి స్థానికుల నుంచి నిరసన ఎదురైంది. -
ఇన్నాళ్లూ ముఖం చాటేసి నేడు జిల్లాకు పళ్లంరాజు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : మూడున్నర నెలలుగా జిల్లాకు దూరంగా ఉన్న కేంద్రమంత్రి పళ్లంరాజు ఎట్టకేలకు సోమవారం జిల్లాకు వస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడ్డ సమయంలో జిల్లాలో అడుగుపెట్టేందుకు ధైర్యం చాలక ముఖం చాటేసిన ఆయన ఇప్పుడు మాత్రం ఎందుకు వస్తున్నారని సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. అలుపెరగకుండా జీతాలను వదులుకుని, కుటుంబ కష్టాలను సైతం ఖాతరు చేయని వేలాది మంది ఉద్యోగులతో పాటు సమాజంలోని వివిధ వర్గాలు 75 రోజులుగా జిల్లాలో సాగిస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమం కంటికి కనబడలేదా అని విమర్శిస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఇన్నాళ్లుగా అడుగుపెట్టకున్నా పళ్లంరాజుకు సమైక్యవాదుల నుంచి ఎదురైన అవమానాలు జిల్లాలో మరే ప్రజాప్రతినిధికీ ఎదురుకాలేదు. కాకినాడలో ఉద్యమకారులు ఆయన ఫ్లెక్సీలను తగలబెట్టడం, శవయాత్రలు చేయడం మొదలుకుని జేఎన్టీయూకే వద్ద స్త్రీ వస్త్రధారణలో ఆయన బొమ్మలను రూపొందించి నిలువెత్తు హోర్డింగ్‌లు పెట్టే వరకు చేసి నిరసనను చాటారు. ఆది నుంచి పార్టీ గాలి ఉంటే నెగ్గుకొస్తామనే సిద్ధాంతాన్ని నమ్ముకోబట్టే ఆయన సమైక్యాంధ్ర ఉద్యమం ఎగసిపడుతున్నా ప్రజల ఆకాంక్షలను ఏ కోశానా పట్టించుకోకుండా ఢిల్లీలో రాజీడ్రామాలాడుతూ కాలక్షేపం చేశారని ఉద్యమనేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ కుటుంబంతో ఉన్న అనుబంధంతో పళ్లంరాజు ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చి విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చేయగల అవకాశం లేకపోలేదు. అయినప్పటికీ ప్రజల ఆకాంక్షకంటే పదవిని కాపాడుకోవడమే ముఖ్యమన్నట్టు వ్యవహరించి చరిత్రహీనుడిగా మిగిలిపోయారని ఇంటా, బయటా విమర్శలను ఎదుర్కొన్నారు. ఢిల్లీలో ఉండి ఏం చేసినట్టో.. జిల్లావైపు కన్నెత్తి చూడని పళ్లంరాజు ఢిల్లీలో సమైక్యాంధ్ర కోసం లాబీయింగ్ చేస్తున్నట్టు ఇక్కడ ప్రజలను నమ్మించే ప్రయత్నం కూడా చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమైక్యాంధ్ర కోసం మాట్లాడిన అనంతరం పళ్లంరాజు పార్టీ అధిష్టానం విభజనకు వెనకడుగు వేస్తున్నట్టు చెప్పారని మీడియాలో ప్రచారం జరిగింది. తీరా తెల్లారేసరికి తెలంగాణ ప్రాంత నేతల ఫిర్యాదుతో సోనియాగాంధీ నుంచి అక్షింతలు పడటంతో ఆ తరువాత పళ్లంరాజుకు మూగనోము తప్పలేదని సమైక్యాంధ్ర ఉద్యమనేతలు ఆక్షేపిస్తున్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి మంత్రి పదవులకు రాజీనామా చేయాలని ఏపీఎన్జీఓలు ఇచ్చిన పిలుపునకు కూడా పళ్లంరాజు స్పందించిన దాఖలాలు లేవు. పదవికి రాజీనామా చేయకపోతే మానె.. తెలంగాణ నోట్‌ను కేబినెట్ మంత్రిగా ఉండి ఎందుకు వ్యతిరేకించలేదని ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విభజన నిర్ణయం ప్రకటించిన దగ్గర నుంచి టి నోట్ కేబినెట్‌కు వచ్చే వరకు పళ్లంరాజు ఈ ప్రాంతవాసిగా ఏమి చేశారని మండిపడుతున్నారు. మొదట్లో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన పళ్లంరాజు ప్రధాని మన్మోహన్సింగ్, సోనియాలు తొందరపడొద్దనడంతో ఆలోచిస్తున్నానని చెప్పుకొచ్చారు. టి నోట్ కేబినెట్ ఆమోదం పొందాక కూడా రాజీనామాపై డ్రామాలాడుతున్న తీరుపై సర్వత్రా నిరసనలు పెల్లుబకటంతో చివరకు అయిష్టంగానే మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పింది కాదు. జూన్ 30న కాకినాడలో జరిగిన జిల్లా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నప్పటి నుంచి ఢిల్లీకే పరిమితమైన ఆయన ఇన్ని రోజుల తరువాత ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని జిల్లాకు వస్తున్నారని సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ఆయనను అడ్డుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. -
కీలక సమావేశానికి పళ్లంరాజు దూరం
తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి పళ్లంరాజు గురువారం కీలక సమావేశానికి గైర్హాజరయ్యారు. మధ్యాహ్న భోజనం పథకం, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర అంశాలను సమీక్షించడానికి సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ (సీఏబీఈ) ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, విద్యా రంగ నిపుణులు పాల్గొంటున్నారు. పళ్లంరాజు గైర్హాజరీలో ఆ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద అధ్యక్షత వహిస్తున్నారు. పళ్లంరాజు రాజీనామా సమర్పించిన తర్వాత పలు సమావేశాలకు అధికారులే హాజరవుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఆయన లేనికారణంగా పలు సమావేశాలు రద్దయ్యాయి. కేంద్ర కేబినెట్ సమావేశానికి కూడా గైర్హాజరైన మంత్రి రాష్ట్రపతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాత్రం పాల్గొన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నలుగురు కేంద్ర మంత్రులు ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఇటీవల కలిసి రాజీనామాలను అంగీకరించాల్సిందిగా కోరినా ఆయన వీటిపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. -
రాజీనామాల్ని ఆమోదించాలని ప్రధానికి నలుగురు కేంద్ర మంత్రుల విన్నపం
తమ రాజీనామాల్ని ఆమోదించాల్సిందిగా సీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. తాము మంత్రులుగా కొనసాగలేమని, మంగళవారం నుంచి విధులకు హాజరుకాబోమని చెప్పారు. సోమవారం సాయంత్రం కేంద్ర మంత్రులు చిరంజీవి, పళ్లంరాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, దగ్గుబాటి పురంధేశ్వరి ప్రధానితో సమావేశమయ్యారు. అనంతరం చిరంజీవి, పురంధేశ్వరి విలేకరులతో మాట్లాడారు. పార్టీకి, ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో పదవులకు రాజీనామాలు చేసినట్టు వివరించారు. ఈ విషయంపై పునరాలోచించాల్సిందిగా ప్రధాని సూచించినట్టు చిరంజీవి చెప్పారు. సమస్యలపై కేంద్ర మంత్రుల బృందంతో మాట్లాడాల్సిందిగా చెప్పారని వెల్లడించారు. సీమాంధ్ర ప్రాంతంలో నెలకొన్న ఉద్రికత్త పరిస్థితుల గురించి ప్రధానికి వివరించినట్టు చిరంజీవి తెలిపారు. -
రాజీనామాపై వెనక్కు తగ్గిన కేంద్ర మంత్రి పల్లంరాజు
-
చిరంజీవికి ప్రధాని ఫోన్
న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవికి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ చేశారు. మంత్రి పదవికి చేసిన రాజీనామా ఉపసంహరించుకోవాలని చిరంజీవిని ప్రధాని కోరారు. రాజీనామాపై పునరాలోచన చేయాలని కోరారు. అయితే ప్రధాని విజ్ఞప్తిని చిరంజీవి సున్నితంతా తిరస్కరించినట్టు సమాచారం. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం బాధించిందని చిరంజీవి అన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కేంద్ర మానవరుల శాఖ మంత్రి పళ్లంరాజు సమావేశమయ్యారు. సీమాంధ్రలో పరిస్థితులను సోనియాకు ఆయన వివరించారు. ఈ ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పళ్లంరాజు భేటీ అయ్యారు. -
సీమాంధ్రుల అభిప్రాయాలను పరిశీలిస్తాం:సోనియా
న్యూఢిల్లీ: సీమాంధ్ర నేతల అభిప్రాయలను పరిశీలిస్తామని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ హామీ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి పళ్లంరాజు చెప్పారు. సీమాంధ్రకు చెందిన ఏడుగురు కేంద్ర మంత్రులు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఆ సమావేశం ముగిసిన తరువాత పళ్లంరాజు విలేకరులతో మాట్లాడారు. సమైక్య ఉద్యమ తీవ్రతను, సీమాంధ్రుల అభద్రతా భావాన్ని సోనియాకు వివరించినట్లు చెప్పారు. సీమాంధ్రుల మనోభావాలను గౌరవించాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణపై కమిటీ పూర్తి అయ్యేంతవరకు విభజన ప్రక్రియ ఆగుతుందని ఆయన చెప్పారు. ఆంటోనీ కమిటీకి అన్ని వివరాలు చెప్పమని సోనియా కోరినట్లు తెలిపారు. శాంతియుతంగా ఉండాలని సీమాంధ్ర ప్రజలను కోరుతున్నామన్నారు.