
కిరణ్ వైఖరి సబబే: పళ్లంరాజు
రాష్ట్ర విభజన బిల్లును వెనక్కిపంపాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సబబేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పళ్లంరాజు అన్నారు.
కాకినాడ: రాష్ట్ర విభజన బిల్లును వెనక్కిపంపాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సబబేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పళ్లంరాజు అన్నారు. బిల్లులో లోపాలున్నాయని తాము ఎప్పటి నుంచో కాంగ్రెస్ అధిష్టానికి చెబుతున్నామని చెప్పారు.
బిల్లుకు సంబంధించిన అంశాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి వచ్చిన తర్వాతే స్పందిస్తానని పళ్లంరాజు తెలిపారు. కాగా విభజనపై బిల్లు, ఓటింగ్ పై ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అస్పష్ట వైఖరి అవలంభిస్తుండటంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.