తెలంగాణ ఏర్పాటు వల్ల సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు మరింతమంది రాజీనామా చేసే అవకాశముందని, దీనివల్ల కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చన్న ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వ్యాఖ్యలతో కేంద్ర మంత్రి పల్లంరాజు ఏకీభవించారు.
తెలంగాణ ఏర్పాటు వల్ల సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు మరింతమంది రాజీనామా చేసే అవకాశముందని, దీనివల్ల కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చన్న ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వ్యాఖ్యలతో కేంద్ర మంత్రి పల్లంరాజు ఏకీభవించారు. పవార్ అనుభజ్ఞుడైన నేతని, ఆయన మాటల్లో నిజం ఉండొచ్చని పల్లంరాజు అభిప్రాయపడ్డారు.
కేంద్ర మంత్రుల బృందం కూడా సీమాంధ్రులకు న్యాయం చేయకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని పల్లంరాజు అన్నారు. కాగా ఇటీవల ప్రధానిని కలసి తన రాజీనామాను ఆమోదించమని కోరిన పల్లంరాజు మళ్లీ రాజీనామా మాట ఎత్తడం గమనార్హం. తూర్పుగోదావరికి వచ్చిన కేంద్ర మంత్రికి స్థానికుల నుంచి నిరసన ఎదురైంది.