pr college
-
కళాశాలలో కలకలం
వెలుగు చూస్తున్న కీచక గురువు లీలలు రెండేళ్లుగా విద్యార్థినులను వేధిస్తున్న వైనం ప్రిన్సిపాల్‌కు వందలాది మంది విద్యార్థినుల ఫిర్యాదు భానుగుడి (కాకినాడ) : అధ్యాపకుడి వేధింపులకు తాము కూడా బాధితులమేనంటూ వందలాది మంది విద్యార్థినులు ప్రిన్సిపాల్‌కు ఫిర్యా దు చేయడంతో కళాశాల ప్రాంగణంలో కలకలం రేగింది. పీఆర్జీ కళాశాలలోని ఓ ఒప్పంద అధ్యాపకుడు తనను ప్రేమ పేరుతో మోసగించాడంటూ కళాశాల ఫైనలియర్ విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై ‘సాక్షి’లో గత నెల 29న ‘వంచకుడిపై చర్యలు తీసుకోండి’ పేరిట కథనం వెలువడిన విషయం తెలిసిందే. కీచక గురువు వికృత చేష్టలు ఒక్కొక్కటీ బయట పడుతున్నాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే తమతో అసభ్యంగా ప్రవర్తించేవాడని, వెకిలి చేష్టలు, వేధింపులతో నిత్యం నరకం చూపేవాడని ఆ విషయంలో తామంతా బాధితులమే నంటూ వందలాది మంది విద్యార్థినులు శుక్రవారం పీఆర్జీ కళాశాల ప్రిన్సిపాల్‌కు, ఉమె¯ŒS ఎంపవర్మెంట్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. తమ సహచర విద్యార్థిని ఫిర్యాదు చేసి రెండు వారాలు గడుస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ వారు ప్రశ్నించారు. ఆ అధ్యాపకుడితో అధికారులు, కళాశాల యాజమాన్యం కుమ్మౖMð్క రాజకీయాలు చేస్తున్నారంటూ దుమ్మెత్తిపోశారు. రెండేళ్లుగా అధ్యాపకుడు తమను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని వారు వినతిపత్రంలో ఆవేదనను వెళ్లగక్కారు. అధ్యాపకుడిపై చర్యలు తీసుకోకుంటే ధర్నాలు చేస్తామని వారు హెచ్చరించారు. కొన్ని వందల మంది విద్యార్థినులు బోటనీ అధ్యాపకుడిపై చర్యలకు, మోసపోయిన విద్యార్థినికి న్యాయం చేయాలని సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని స్వయంగా ప్రిన్సిపాల్‌కు అందించారు. బాధిత విద్యార్థిని, అధ్యాపకుడు మాట్లాడుకున్న ఆడియో టేపులను విద్యార్థినులు శుక్రవారం ఎంపవర్మెంట్ సెల్‌కు, ప్రిన్సిపాల్‌కు అందించారు. న్యాయం జరగకుంటే ముఖ్యమంత్రి వద్దకు.. చరిత్ర కలిగిన కళాశాలలో ఓ ఒప్పంద అధ్యాపకుడి కారణంగా విద్యార్థినులు అనుభవించిన నరకానికి పూర్తి అధారాలున్నా చర్యలకు జిల్లా అధికార యంత్రాంగం ముందుకు రాకపోవడాన్ని విద్యార్థినులు తప్పుబట్టారు. ఇంత జరిగినా కలెక్టర్‌గానీ, ఉన్నతాధికారులు గానీ కళాశాలను సందర్శించిన దాఖలాలు లేవని ఆరోపించారు. తమకు న్యాయం జరగకుంటే రోడ్డెక్కి ధర్నాలు చేస్తామని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని హెచ్చరించారు. కాసులకు అమ్ముడుపోయారా..! ఒప్పంద అధ్యాపకుడు తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని పీఆర్జీ కళాశాలలో గత నెల 24న బీఎస్సీ ఫైనలియర్ విద్యార్థిని ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. రెండు వారాలైనా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయమై ప్రిన్సిపాల్ 24 రాత్రే కమిషనరేట్‌కు కళాశాలలో జరిగిన విషయాన్ని, విద్యార్థిని అందించిన ఆధారాలను మెయిల్ చేశారు. ఈ విషయమై కమిషనరేట్ కార్యాలయం ఆర్జేడీని విచారించాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం. ఆర్జేడీ ఇప్పటివరకు కళాశాలకు రాకపోవడంతో, కాసులకోసం కక్కుర్తిపడి కేసును నీరుగార్చారని కళాశాల వర్గాలు ఆరోపిస్తున్నాయి. డబ్బుకు లొంగిపోయిన అధికారులు విచారణ కమిటీని పంపుతున్నామంటూ తాత్సారం చేస్తున్నారే గానీ ఇప్పటికీ కమిటీ వచ్చి కళాశాలలో విచారించిన పాపానపోలేదని విద్యార్థినులు ‘సాక్షి’కి వివరించారు. -
పేదల చదువుతో..ఆటానమస్
- పీఆర్ కాలేజీలోచీటికీ మాటికీ ఫైన్లు - బడుగు విద్యార్థులపై కొరవడ్డ కనికరం - పెద్దల సిఫారసులకు జీ హుజూర్ - ప్రిన్సిపాల్, అధ్యాపకులు తమ బిడ్డల్ని వేధిస్తున్నారంటున్న తల్లిదండ్రులు భానుగుడి (కాకినాడ) : దశాబ్దాలుగా లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన పీఆర్ అటానమస్ ప్రభుత్వ కళాశాల బోధనా సిబ్బంది వైఖరితో అపకీర్తి పాలవుతోంది. విద్యార్థులకు అపరాధ రుసుము (ఫైన్) విధింపులో మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయి నుంచి సిఫారసులు వస్తే ఉదారంగా స్పందిస్తున్న వారే.. అలాంటివి తేలేని పేదలపై భారం మోపుతున్నారు. ఈ కళాశాలలో అనేకమంది విద్యార్థులు ఏటీఎం సెంటర్లు, హోటళ్లు, క్యాటరింగ్ సంస్థల్లో పని చేస్తూ, కూలి పనులు సైతం చేస్తూ చదువుకుంటున్నారు. తాము ఫీజు చెల్లించడం ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా, హాజరు కొరత పడ్డా, ఇతర సాకులు చూపి రూ.500 నుంచి రూ.1000 వరకు ఫైన్ వేస్తున్నారని అలాంటి విద్యార్థులు వాపోతున్నారు. కోర్సులను బట్టి ఓసీలకు రూ.5 వేల నుంచి రూ.6 వేలు, బీసీ, ఎస్సీలకు రూ.3 వందల నుంచి రూ.4 వందల మధ్యలో ఫీజులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాటిని కట్టేందుకే కటకటలాడుతున్న వారెందరో ఉన్నారు. అదనంగా ఫైన్లు విధిస్తే ఎక్కడ నుంచి తేవాలని వాపోతున్నారు. పైగా కించపరుస్తూ మాట్లాడడంతో ఆత్మన్యూనతకు గురవుతున్నారు. ఫీజుల పేరుతో వేధింపుల్ని తట్టుకోలేక ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే ప్రిన్సిపాల్, అధ్యాపకులు బాధ్యత వహిస్తారా అని తల్లితండ్రులు ప్రశ్నిస్తున్నారు. కన్నీరు పెట్టినా కరగరు.. పరీక్ష ఫీజులు ఆలస్యమైతే అటానమస్ కళాశాలల్లో రూ.100 నుంచి రూ.200 వరకు ఫైన్ నిర్ణయిస్తున్నారు. పేదవిద్యార్థుల నుంచి ఫైన్లు వసూలు చేయడం ఏ జీవోలో లేదని పలువురు అంటున్నారు. క్రమశిక్షణ పేరుతో పీఆర్ కళాశాలలోనే వేలల్లో ఫైన్లు నిర్ణయిస్తున్నారని, కన్నీరు మున్నీరరుునా ఇక్కడ అధ్యాపకులు కరగడం లేదని విద్యార్థులు మొర పెడుతున్నారు.కళాశాలలో ప్రస్తుతం ఇంటర్నల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షల్లో 20 మార్కుల వరకు వెయిటేజి నిర్ణయించి వాటిని సెమిస్టర్ల 80 మార్కులకు కలుపుతారు. ఇంటర్నల్‌లో ఫెయిలయిన విద్యార్థులు సెమిస్టర్లో పూర్తిస్థాయి మార్కులు సాధించాలి. కళాశాలలో ప్రస్తుతం ఇంటర్నల్ పరీక్షలకు 40 మందికి పైగా విద్యార్థులను ఫీజులు సకాలంలో చెల్లించలేదనో, హాజరు తక్కువనో అనుమతించనట్లు తెలుస్తోంది. వీరంతా సెమిస్టర్లలో పూర్తిస్థాయి మార్కులు సాధించకుంటే వచ్చే ఏడాది మళ్లీ అవే పరీక్షలను మళ్ళీ రాసుకోవాల్సిందే. కలెక్టర్ గారూ! న్యాయం చేయండి! ఈ కళాశాలలో సీటు కావాలన్నా, ప్రాక్టికల్ మార్కులు వేయాలన్నా, ఇతర పనులేమైనా ఏ ఎమ్మెల్యేలు, మంత్రులు లేదా వారి పీఏల నుంచో, ప్రముఖుల నుంచో సిఫార్సు తెచ్చుకుంటే ఆగమేఘాల మీద పని జరుగుతుంది. సామాన్యులు చిన్నపనులపై వెళ్ళినా చేదుఅనుభవమే ఎదురవుతుంది. కళాశాల అటానమస్ కావడం, ప్రాక్టికల్‌తో సహా, అన్ని మార్కులూ వారి చేతుల్లో ఉండడమే దీనికి ప్రధాన కారణమని విద్యార్థులంటున్నారు. అదేమని ప్రశ్నిస్తే కళాశాలకు దూరం కాకతప్పదని జంకుతున్నారు. దీనిపై ప్రిన్సిపాల్ వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా అందుబాటులో లేరు. పేద విద్యార్థులకు అన్యాయం జరగకుండా కలెక్టర్ విచారణ జరపాలని, ఫైన్ల విధింపును రద్దు చేయూలని తల్లితండ్రులు కోరుతున్నారు. పైరవీలకు కాకుండా పేదలకు విద్యాదానం చేయూలన్న దాతల మూల ఆశయం నెరవేరేలా చూడాలని అభ్యర్థిస్తున్నారు. -
ఆ హోదా.. సాధిస్తారా..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాకు లభించే ఒక మహత్తర అవకాశం చేజారిపోయేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో స్వయంప్రతిపత్తి కలిగిన కళాశాలల్లో ఆరింటికి డీమ్డ్ యూని వర్సిటీ హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ జాబితాలో చోటు దక్కించుకునేందుకు జిల్లా నుంచి 129 ఏళ్ల చరిత్ర కలిగిన పీఆర్ కళాశాల బరిలోకి దిగింది. అనుమతి కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలికి ప్రతిపాదనలు కూడా పంపించింది. ఫలితం కోసం నిరీక్షిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ కళాశాలకు డీమ్డ్ హోదా సాధించేందుకు కాకినాడకే చెందిన కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు కనీస ప్రయత్నం చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీమ్డ్ యూనివర్సిటీ హోదాకు అవసరమైన అన్ని అర్హతలూ పీఆర్ కాలేజీకి ఉన్నాయి. పిఠాపురం మహారాజా రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దూర్ 1884లో సువిశాలమైన 32 ఎకరాల ప్రాంగణంలో ఈ కళాశాలను స్థాపించారు. ఇది 2000 సంవత్సరంలో స్వయంప్రతిపత్తి సాధించింది. ఏటా 3 వేల మందిని విద్యావంతులను చేసి ఉత్తమ పౌరులుగా సమాజానికి అందిస్తోంది. ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ లక్షా 50 వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దింది. పళ్లంరాజు తలచుకుంటే పెద్ద విషయమే కాదు కేంద్ర కేబినెట్లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రాతినిధ్యం వహిస్తున్న పళ్లంరాజు తలచుకుంటే పీఆర్ కాలేజీకి డీమ్డ్ హోదా లభించడం పెద్ద విషయమేమీ కానే కాదు. ఈ కాలేజీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ పార్లమెంటు స్థానం పరిధిలోనే ఉంది. కేంద్ర మంత్రిగా రెండు శాఖలు మారి, పదోన్నతి లభించినా ఈ ప్రాంతానికి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాజెక్టులు సాధించలేకపోయారనే విమర్శలను ఆయన ఇప్పటికే ఎదుర్కొంటున్నారు. ఇదే స్థానం నుంచి గతంలో కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన ఆయన తండ్రి శ్రీరామ సంజీవరావు కాకినాడకు టీవీ రిలే కేంద్రం తీసుకువచ్చారు. శ్రీరామ సంజీవరావు విద్యాభ్యాసం చేసింది కూడా ఈ కళాశాలలోనే కావడం గమనార్హం. పీఆర్ కాలేజీకి డీమ్డ్ హోదా సాధించేందుకు కేంద్ర మంత్రి పళ్లంరాజు సహా జిల్లా ప్రజాప్రతినిధులందరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.