-
వెలుగు చూస్తున్న కీచక గురువు లీలలు
-
రెండేళ్లుగా విద్యార్థినులను వేధిస్తున్న వైనం
-
ప్రిన్సిపాల్‌కు వందలాది మంది విద్యార్థినుల ఫిర్యాదు
భానుగుడి (కాకినాడ) :
అధ్యాపకుడి వేధింపులకు తాము కూడా బాధితులమేనంటూ వందలాది మంది విద్యార్థినులు ప్రిన్సిపాల్‌కు ఫిర్యా దు చేయడంతో కళాశాల ప్రాంగణంలో కలకలం రేగింది. పీఆర్‌జీ కళాశాలలోని ఓ ఒప్పంద అధ్యాపకుడు తనను ప్రేమ పేరుతో మోసగించాడంటూ కళాశాల ఫైనలియర్ విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై ‘సాక్షి’లో గత నెల 29న ‘వంచకుడిపై చర్యలు తీసుకోండి’ పేరిట కథనం వెలువడిన విషయం తెలిసిందే. కీచక గురువు వికృత చేష్టలు ఒక్కొక్కటీ బయట పడుతున్నాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే తమతో అసభ్యంగా ప్రవర్తించేవాడని, వెకిలి చేష్టలు, వేధింపులతో నిత్యం నరకం చూపేవాడని ఆ విషయంలో తామంతా బాధితులమే నంటూ వందలాది మంది విద్యార్థినులు శుక్రవారం పీఆర్‌జీ కళాశాల ప్రిన్సిపాల్‌కు, ఉమె¯ŒS ఎంపవర్‌మెంట్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. తమ సహచర విద్యార్థిని ఫిర్యాదు చేసి రెండు వారాలు గడుస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ వారు ప్రశ్నించారు. ఆ అధ్యాపకుడితో అధికారులు, కళాశాల యాజమాన్యం కుమ్మౖMð్క రాజకీయాలు చేస్తున్నారంటూ దుమ్మెత్తిపోశారు. రెండేళ్లుగా అధ్యాపకుడు తమను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని వారు వినతిపత్రంలో ఆవేదనను వెళ్లగక్కారు. అధ్యాపకుడిపై చర్యలు తీసుకోకుంటే ధర్నాలు చేస్తామని వారు హెచ్చరించారు. కొన్ని వందల మంది విద్యార్థినులు బోటనీ అధ్యాపకుడిపై చర్యలకు, మోసపోయిన విద్యార్థినికి న్యాయం చేయాలని సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని స్వయంగా ప్రిన్సిపాల్‌కు అందించారు. బాధిత విద్యార్థిని, అధ్యాపకుడు మాట్లాడుకున్న ఆడియో టేపులను విద్యార్థినులు శుక్రవారం ఎంపవర్‌మెంట్ సెల్‌కు, ప్రిన్సిపాల్‌కు అందించారు.
న్యాయం జరగకుంటే ముఖ్యమంత్రి వద్దకు..
చరిత్ర కలిగిన కళాశాలలో ఓ ఒప్పంద అధ్యాపకుడి కారణంగా విద్యార్థినులు అనుభవించిన నరకానికి పూర్తి అధారాలున్నా చర్యలకు జిల్లా అధికార యంత్రాంగం ముందుకు రాకపోవడాన్ని విద్యార్థినులు తప్పుబట్టారు. ఇంత జరిగినా కలెక్టర్‌గానీ, ఉన్నతాధికారులు గానీ కళాశాలను సందర్శించిన దాఖలాలు లేవని ఆరోపించారు. తమకు న్యాయం జరగకుంటే రోడ్డెక్కి ధర్నాలు చేస్తామని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని హెచ్చరించారు.
కాసులకు అమ్ముడుపోయారా..!
ఒప్పంద అధ్యాపకుడు తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని పీఆర్‌జీ కళాశాలలో గత నెల 24న బీఎస్సీ ఫైనలియర్ విద్యార్థిని ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. రెండు వారాలైనా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయమై ప్రిన్సిపాల్ 24 రాత్రే కమిషనరేట్‌కు కళాశాలలో జరిగిన విషయాన్ని, విద్యార్థిని అందించిన ఆధారాలను మెయిల్ చేశారు. ఈ విషయమై కమిషనరేట్ కార్యాలయం ఆర్జేడీని విచారించాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం. ఆర్జేడీ ఇప్పటివరకు కళాశాలకు రాకపోవడంతో, కాసులకోసం కక్కుర్తిపడి కేసును నీరుగార్చారని కళాశాల వర్గాలు ఆరోపిస్తున్నాయి. డబ్బుకు లొంగిపోయిన అధికారులు విచారణ కమిటీని పంపుతున్నామంటూ తాత్సారం చేస్తున్నారే గానీ ఇప్పటికీ కమిటీ వచ్చి కళాశాలలో విచారించిన పాపానపోలేదని విద్యార్థినులు ‘సాక్షి’కి
వివరించారు.