కాకినాడ: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే వికృత చేష్టాలకు పాల్పడుతున్నారు. తాజాగా కాకినాడ జగన్నాథపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్(పీఈడీ) లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.
తనను ప్రేమించాలని, లేకుంటే హాల్‌టికెట్ రాకుండా చేస్తానని అంటూ అతడు వారం రోజులుగా వేధిస్తున్నాడు. దీంతో ఈ విషయాన్ని బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ నేపథ్యంలో వారు బుధవారం పాఠశాల ప్రతినిధులను నిలదీశారు. కష్టంలో ఉన్నానని చెబితే ఉద్యోగమిచ్చామని, అతడిని తక్షణం ఉద్యోగం నుంచి తొలగించామని పాఠశాల ప్రతినిధులు చెప్పుతున్నారు. బాలిక కుటుంబ సభ్యులు మాత్రం నిందితుడిని పట్టుకుని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంలేదని.. అతడికి బుద్ధి చెప్పేందుకే పోలీసులకు అప్పగించామని వారు తెలిపారు.