![Teacher Got Suspended For Harassment Students Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/3/Teacher.jpg.webp?itok=6-_-os1n)
ప్రతీకాత్మక చిత్రం
రాయచూరు రూరల్: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు తప్పటడుగులు వేశాడు. విద్యార్థులను లైంగికంగా వేధించాడు. దీంతో ఉన్నతాధికారులు సదరు ఉపాధ్యాయుడిపై వేటువేశారు. వివరాలు... సింధనూరు తాలూకా సింగాపుర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అజారుద్దీన్ విద్యార్థులను అర్దనగ్నంతో నిలబెట్టి వీడియోలు చిత్రీకరించాడు.
అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఉపాధ్యాయుడు విధులకు గైర్హాజరయ్యాడు. తాలూకా విద్యాశాఖ అధికారి శరణప్ప నివేదిక మేరకు డీఈఓ వృభేంద్రయ్య ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment