బెంగుళూరు: పోక్సో చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దీన్నీ సద్వినియోగం చేసుకునేవారు కంటే దుర్వినియోగం చేసేవారి సంఖ్యే ఎక్కువగా ఉందని బాంబే హైకోర్టు సీరియస్ అయ్యిన విషయం తెలిసిందే. అంతలోనే కర్ణాటక తుంకూరు జిల్లాలోని ఓ పాఠశాల అధ్యాపకునిపై హోంవర్క్ ఎక్కువగా ఇస్తున్న కారణంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు చిక్కనాయకనహళ్లి పోలీసులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోడెకెరె ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు హెచ్.ఎస్.రవి విద్యార్థులకు ఎక్కువగా హోంవర్క్ ఇస్తూ వేధిస్తున్నారని, హోంవర్క్ చేయకపోతే కఠినంగా శిక్షిస్తున్నారని పిల్లలు తల్లిదండ్రులకు తెలియజేశారు.
దీంతో పిల్లలు స్కూలుకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారని, వారిని ఇంతగా వేధిస్తున్నందుకు అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తలిదండ్రులు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. హోంవర్కు ఎక్కువగా ఇచ్చి పిల్లలను వేధిస్తున్నందుకు గాను సదరు లెక్కల మాస్టారుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.
అసలే పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తున్నారని బాంబే హైకోర్టు ఇటీవల మొట్టికాయలు మొట్టిన సంగతి తెలిసిందే. పార్లమెంటు కల్పించుకుని ఈ చట్టంలో తగిన సవరణలు చెయ్యాలని కోరుతూ ఒక కేసులో నిందితుడిని నిర్దోషిగా పేర్కొంటూ ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ కేసు గురించి తెలిస్తే బాంబే హైకోర్టు ఇంకెంత సీరియస్ అవుతుందో మరి.
ఇది కూడా చదవండి: పోక్సో చట్టం దుర్వినియోగం.. బాంబే హైకోర్టు కీలక తీర్పు
Comments
Please login to add a commentAdd a comment