POCSO Act Bombay High Court Criminalization Relations Burdened - Sakshi
Sakshi News home page

ముందు కలిసి కాపురం, తర్వాత పోక్సో కేసులు పెడతారా?: బాంబే హైకోర్టు

Published Sat, Jul 15 2023 6:41 PM | Last Updated on Sun, Jul 16 2023 7:02 AM

Pocso Act Bombay High Court Criminalization Relations Burdened - Sakshi

ముంబై: పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొని తర్వాత మనస్పర్థలు చోటుచేసుకున్నాయని పోక్సో చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయడం పెద్ద తలనొప్పిగా మారిందని తెలిపింది బాంబే హైకోర్టు. ఇదే క్రమంలో 17 ఏళ్ల బాలికతో శృంగారంలో పాల్గొన్న కేసులో నుండి ఓ యువకుడికి విముక్తి కలిగించింది. 

హైకోర్టు ఏం చెప్పింది?

ప్రస్తుత ఐపీసీ చట్టం ప్రకారం 20 ఏళ్ల వ్యక్తి ఒకరు, 17  ఏళ్ల 364 రోజుల వయసున్న బాలికతో ఆమె ఇష్టంతో శృంగారంలో పాల్గొంటే నేరంగా పరిగణించి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. దీనివలన చట్టాలను దుర్వినియోగం చేసేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోందని వ్యాఖ్యానించింది బాంబే హైకోర్టు. 

కోర్టు తెలిపిన వివరాల ప్రకారం శృంగార సంబంధాన్ని ఇష్టపూర్వకంగా కొనసాగించిన తర్వాత కేసులు నమోదు చేయడం క్రిమినల్ న్యాయ వ్యవస్థకు భారంగా మారింది. చట్టం, న్యాయవ్యవస్థ ఇటువంటి కేసుల్లో బాధితుడికి మద్దతుగా నిలవలేకపోతున్నాయి. యువతి సమ్మతంతోనే శృంగారం జరిగితే మాత్రం నిందితుడిని నిర్దోషిగా విడుదల చెయ్యాలని 31 పేజీల తీర్పులో తెలిపింది.   

పోక్సో చట్టం ఉద్దేశ్యమేంటీ?

మైనర్లను లైంగిక వేధింపుల నుండి రక్షించేందుకే POCSO చట్టం రూపొందించబడింది. నిజంగా బాలిక ఇష్టానికి వ్యతిరేకంగా శృంగారానికి పాల్పడితే ఆ వ్యక్తి ని ఈ చట్టం కింద విచారించడం తప్పులేదు. అలాంటివి కాని కేసుల్లో నియంత్రణ అవసరమని తెలిపింది న్యాయస్థానం. ఈ అంశాన్ని పార్లమెంటు కూడా సీరియస్‌గా పరిగణించాలని సూచించింది. 

చట్టం దుర్వినియోగం అవుతోందా?

కౌమార దశలో ఉన్నవారిపై ఈ తరహా చట్టాలు అమలు చేయడం ద్వారా వారి లైంగిక స్వేచ్ఛను దెబ్బతీసినట్టవుతుంది. అత్యధిక కేసుల్లో బాలికలు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొని తర్వాత ప్లేటు ఫిరాయించడంతో మగవారే ఎక్కువగా శిక్షించబడుతున్నారని పేర్కొంది. పరస్పర అంగీకారంతో శృంగారం చేస్తే అది రేప్ కింద కూడా పరిగణించకూడదని తెలిపింది. 

మగవాళ్లకే చిక్కులా?

చట్టం దృష్టిలో మైనర్ బాలికలు శృంగారానికి అంగీకరించినా అది లెక్కలోకి రాదు. అదే సమయంలో యువకులకు మాత్రమే ఇది చిక్కుల్ని కొనితెచ్చిపెడుతోంది. ఇటీవల 17.5 ఏళ్ల వయసున్న ఓ బాలిక విషయంలో ఇలాగే పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేయాలని చూసిన ఘటనలో జస్టిస్ భారతి డాంగ్రే నేతృత్వంలో బాంబే హైకోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది.  

ఇది కూడా చదవండి: పిల్లలకు పని చెప్పి హాయిగా కునుకు తీసిన హెడ్ మాస్టర్.. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement