Bombay High Court Chief Justice
-
పోక్సో చట్టం దుర్వినియోగం.. బాంబే హైకోర్టు కీలక తీర్పు
ముంబై: పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొని తర్వాత మనస్పర్థలు చోటుచేసుకున్నాయని పోక్సో చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయడం పెద్ద తలనొప్పిగా మారిందని తెలిపింది బాంబే హైకోర్టు. ఇదే క్రమంలో 17 ఏళ్ల బాలికతో శృంగారంలో పాల్గొన్న కేసులో నుండి ఓ యువకుడికి విముక్తి కలిగించింది. హైకోర్టు ఏం చెప్పింది? ప్రస్తుత ఐపీసీ చట్టం ప్రకారం 20 ఏళ్ల వ్యక్తి ఒకరు, 17 ఏళ్ల 364 రోజుల వయసున్న బాలికతో ఆమె ఇష్టంతో శృంగారంలో పాల్గొంటే నేరంగా పరిగణించి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. దీనివలన చట్టాలను దుర్వినియోగం చేసేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోందని వ్యాఖ్యానించింది బాంబే హైకోర్టు. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం శృంగార సంబంధాన్ని ఇష్టపూర్వకంగా కొనసాగించిన తర్వాత కేసులు నమోదు చేయడం క్రిమినల్ న్యాయ వ్యవస్థకు భారంగా మారింది. చట్టం, న్యాయవ్యవస్థ ఇటువంటి కేసుల్లో బాధితుడికి మద్దతుగా నిలవలేకపోతున్నాయి. యువతి సమ్మతంతోనే శృంగారం జరిగితే మాత్రం నిందితుడిని నిర్దోషిగా విడుదల చెయ్యాలని 31 పేజీల తీర్పులో తెలిపింది. పోక్సో చట్టం ఉద్దేశ్యమేంటీ? మైనర్లను లైంగిక వేధింపుల నుండి రక్షించేందుకే POCSO చట్టం రూపొందించబడింది. నిజంగా బాలిక ఇష్టానికి వ్యతిరేకంగా శృంగారానికి పాల్పడితే ఆ వ్యక్తి ని ఈ చట్టం కింద విచారించడం తప్పులేదు. అలాంటివి కాని కేసుల్లో నియంత్రణ అవసరమని తెలిపింది న్యాయస్థానం. ఈ అంశాన్ని పార్లమెంటు కూడా సీరియస్‌గా పరిగణించాలని సూచించింది. చట్టం దుర్వినియోగం అవుతోందా? కౌమార దశలో ఉన్నవారిపై ఈ తరహా చట్టాలు అమలు చేయడం ద్వారా వారి లైంగిక స్వేచ్ఛను దెబ్బతీసినట్టవుతుంది. అత్యధిక కేసుల్లో బాలికలు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొని తర్వాత ప్లేటు ఫిరాయించడంతో మగవారే ఎక్కువగా శిక్షించబడుతున్నారని పేర్కొంది. పరస్పర అంగీకారంతో శృంగారం చేస్తే అది రేప్ కింద కూడా పరిగణించకూడదని తెలిపింది. మగవాళ్లకే చిక్కులా? చట్టం దృష్టిలో మైనర్ బాలికలు శృంగారానికి అంగీకరించినా అది లెక్కలోకి రాదు. అదే సమయంలో యువకులకు మాత్రమే ఇది చిక్కుల్ని కొనితెచ్చిపెడుతోంది. ఇటీవల 17.5 ఏళ్ల వయసున్న ఓ బాలిక విషయంలో ఇలాగే పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేయాలని చూసిన ఘటనలో జస్టిస్ భారతి డాంగ్రే నేతృత్వంలో బాంబే హైకోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది. ఇది కూడా చదవండి: పిల్లలకు పని చెప్పి హాయిగా కునుకు తీసిన హెడ్ మాస్టర్.. -
సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ దీపాంకర్ దత్తా
సాక్షి, న్యూఢిల్లీ: బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని కొలీజియం సోమవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం సీజేఐ సహా 29 మంది న్యాయమూర్తులున్నారు. గరిష్ట సంఖ్య 34. కోల్‌కతాకు చెందిన జస్టిస్ దత్తా 1965లో జన్మించారు. 1989లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ పూర్తిచేశారు. పలు హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా చేశారు. రాజ్యాంగపరమైన, సివిల్ కేసులు వాదించడంలో దిట్టగాపేరొందారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫు న్యాయవాదిగా పనిచేశారు. 2006లో కలకత్తా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2020 ఏప్రిల్ 28న బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తండ్రి జస్టిస్ సలీల్ కుమార్ దత్తా కూడా కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. -
వార్తల్లో వనిత
భారత మహిళలు కిరణ్ బేడీ: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా 2016, మే 29న బాధ్యతలు స్వీకరించారు. నీతా అంబానీ: 2016, ఆగస్టులో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యురాలిగా ఎంపికయ్యారు. దీంతో ఈ గుర్తింపు పొందిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. నజ్మా హెప్తుల్లా: కేంద్ర మంత్రిగా పనిచేసి 2016, ఆగస్టులో మణిపూర్ గవర్నర్‌గా నియమితులయ్యారు. జస్టిస్ మంజులా చెల్లూర్: 2016, ఆగస్టులో బాంబే హైకోర్ట్ చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. శుభా ముద్గల్: ప్రముఖ గాయని శుభా ముద్గల్‌కు 2016కుగానూ రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావనా అవార్డు లభించింది. అనురాధా రాయ్: ‘స్లీపింగ్ ఆన్ జూపిటర్’ అనే పుస్తకానికి గానూ అనురాధారాయ్కి డీఎస్సీ ప్రైజ్ ఫర్ సౌత్ ఏషియన్ లిటరేచర్–2016 దక్కింది. ఆమె రచించిన ఇతర నవలలు.. ‘యాన్ అట్లాస్ ఆ‹ఫ్ ఇంపాజిబుల్ లాంగింగ్’, ‘ది ఫోల్డెడ్ ఎర్త్’. అర్చనా రామసుందరం: తమిళనాడు కేడర్ ఐపీఎస్ అధికారిణి అర్చనా రామసుందరం 2016, ఫిబ్రవరి 1న సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఒక పారామిలటరీ బలగానికి చీఫ్‌గా నియమితులైన తొలి మహిళగా గుర్తింపు పొందారు. మెహబూబా ముఫ్తీ: జమ్మూకశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా 2016 ఏప్రిల్ 4న బాధ్యతలు స్వీకరించారు. ఈమె పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు. ఠి ప్రియదర్శిని ఛటర్జీ: గువహటికి చెందిన ఈమె మిస్ ఇండియా–2016గా ఎంపికైంది. మహాశ్వేతాదేవి: ప్రముఖ బెంగాలీ రచయిత్రి, సామాజిక కార్యకర్త మహాశ్వేతాదేవి 2016, జూలై 28న 91 ఏళ్ల వయసులో మరణించారు. ఆమెకు 1996లో జ్ఞాన్‌పీఠ్, 1997లో రామన్ మెగసెసే అవార్డు, 2006లో పద్మవిభూషణ్ లభించాయి. ప్రియాంక చోప్రా: యునిసెఫ్ గ్లోబల్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నియమితురాలైంది. అసోం రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రచారకర్తగా ప్రియాంక చోప్రాను నియమించింది. మాధురీ దీక్షిత్: తల్లిపాల విశిష్టతను తెలిపే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ‘మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్ (మా) ప్రచారకర్తగా బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ నియమితులయ్యారు. ఠి పి.వి.సింధు: 2016, ఆగస్టులో బ్రెజిల్లో రియో డి జనీరో నగరంలో జరిగిన వేసవి ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో రజత పతకం సాధించింది. దీంతో ఒలింపిక్ రజతం సాధించిన తొలి భారతీయ మహిళగా పి.వి.సింధు గుర్తింపు పొందింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య 2016, డిసెంబర్లో ‘మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును పి.వి.సింధుకు ప్రదానం చేసింది. వైజాగ్ స్టీల్, బ్యాంక్ ఆఫ్ బరోడాలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ఠి సాక్షి మాలిక్: హరియాణాకు చెందిన సాక్షి మాలిక్ రియో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో 58 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. ఈమెకు 2017లో పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఈమెను హరియాణా ప్రభుత్వం ‘బేటీ బచావ్, బేటీ పడావ్’ కార్యక్రమ ప్రచారకర్తగా, రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ రెజ్లింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఠి దీపా కర్మాకర్: త్రిపురకు చెందిన దీపా కర్మాకర్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి భారతీయ మహిళా జిమ్మాస్ట్‌గా చరిత్ర సృష్టించింది. మహిళల వాల్ట్ జిమ్నాస్టిక్స్‌లో రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. 2017లో పద్మశ్రీ అవార్డు లభించింది. దీపా మాలిక్: పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ దీపా మాలిక్. 2016, సెప్టెంబర్‌లో రియో పారాలింపిక్స్‌లో షాట్‌పుట్‌లో రజత పతకం సాధించింది. ఈమెకు 2017లో పద్మశ్రీ పురస్కారం దక్కింది. స్మృతి మంధన మహారాష్ట్రకు చెందిన మహిళా క్రికెటర్. 2016 ఐసీసీ ఉమెన్స్ టీం ఆఫ్ ది ఇయర్లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ క్రికెటర్. -
గోవా గవర్నర్‌గా మృదుల సిన్హా ప్రమాణ స్వీకారం
పనాజీ: గోవా గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నాయకురాలు, రచయిత్రి మృదుల సిన్హా (71) ఆదివారం పనాజీలోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మెహిత్ షా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరికర్తోపాటు మంత్రివర్గ సహాచరులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గోవా గవర్నర్‌గా పదవి చేపట్టిన మొదటి మహిళగా మృదుల సిన్హా రికార్డు సృష్టించారు. గతంలో గోవా గవర్నర్‌గా ఉన్న బీవీ వాంఛూను చాపర్ల కుంభకోణంలో సీబీఐ ఆయన్ని ప్రశ్నించింది. దాంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో గోవా గవర్నర్ పదవి ఖాళీ అయింది. దాంతో మోడీ ప్రభుత్వం మృదుల సిన్హాను గోవా గవర్నర్‌గా నియమించాలని రాష్ట్రపతికి సిఫార్స్ చేసిన సంగతి తెలిసిందే.