పనాజీ: గోవా గవర్నర్గా బీజేపీ సీనియర్ నాయకురాలు, రచయిత్రి మృదుల సిన్హా (71) ఆదివారం పనాజీలోని రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మెహిత్ షా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరికర్తోపాటు మంత్రివర్గ సహాచరులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
గోవా గవర్నర్గా పదవి చేపట్టిన మొదటి మహిళగా మృదుల సిన్హా రికార్డు సృష్టించారు. గతంలో గోవా గవర్నర్గా ఉన్న బీవీ వాంఛూను చాపర్ల కుంభకోణంలో సీబీఐ ఆయన్ని ప్రశ్నించింది. దాంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో గోవా గవర్నర్ పదవి ఖాళీ అయింది. దాంతో మోడీ ప్రభుత్వం మృదుల సిన్హాను గోవా గవర్నర్గా నియమించాలని రాష్ట్రపతికి సిఫార్స్ చేసిన సంగతి తెలిసిందే.