Goa chief minister
-
‘పరీకర్ ఆరోగ్యం అస్సలు బాగోలేదు’
పణజి: క్యాన్సర్‌తో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ ఆరోగ్యంపై డిప్యూటీ స్పీకర్, బీజేపీ సీనియర్ లీడర్ మైఖేల్ లోబో సోమవారం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పరీకర్ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఆయన వ్యాధి ఇంకా నయం కాలేదు. దేవుని ఆశిస్సులతోనే ఆయన ఇంకా సీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు.’ అని వ్యాఖ్యానించారు. ఆయన పదవిలో నుంచి దిగిపోయినా లేదా కాలం చేసినా గోవాలో రాజకీయ సంక్షోభం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలనకు దూరంగా ఉన్న పరీకర్ పదవి నుంచి దిగిపోవాలని లోబో గతంలో కూడా డిమాండ్ లేవనెత్తారు. 63 ఏళ్ల పరీకర్ గతేడాది ఫిబ్రవరిలో పాంక్రియాటిక్ క్యాన్సర్ బారినపడ్డారు. తొలుత అమెరికాలో చికిత్స చేయించుకుని ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. (రాహుల్‌కు పరీకర్ ఘాటు లేఖ) కాగా, డిల్లీ ఎయిమ్స్ వైద్యులు సీఎం ఆరోగ్యంపై శనివారం బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. వరల్డ్ క్యాన్సర్ డే (ఫిబ్రవరి 4) సందర్భంగా.. ‘మనిషి బుద్ధి బలం చాలా గొప్పది. ఎటువంటి వ్యాధులనైనా తట్టుకొని నిలబడగలిగేలా నడిపిస్తుంది’ అని పరీకర్ ఒక మెసేజ్‌లో పేర్కొన్నారు. కాగా, అనారోగ్యం కారణంగా బాగా చిక్కిపోయిన పరీకర్ గతవారం అసెంబ్లీకి వచ్చారు. ఇదిలాఉండగా బీజేపీ సీనియర్ నేత సుదీన్ ధవాలికర్‌ను సీఎంగా నియమించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. బీజీపీ సీనియర్ ఎల్కే అద్వానీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఇటీవల పరీకర్‌ను పరామర్శించిన సంగతి తెలిసిందే. జీఎఫ్‌పీ, ఎంజీపీ, మరో ముగ్గురు స్వతంత్ర్య ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. -
ఇలాంటి రాజకీయాలు చేస్తారా?
పణజి: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ దుయ్యబట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తనను పరామర్శించటానికి వచ్చారని ఆరోపించారు. ఈమేరకు బుధవారం రాహుల్ గాంధీకి ఆయన లేఖ రాశారు. రఫేల్ ఒప్పందం గురించి తమ మధ్య ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ప్రాణాంతక అనారోగ్యంతో బాధ పడుతున్న తనతో ఇలాంటి రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. ‘ఐదు నిమిషాల పాటు జరిగిన మన భేటీలో రఫేల్ ఒప్పందం గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు. మన సమావేశంపై ఈ రోజు మీడియాలో వచ్చిన వార్తలు నన్ను తీవ్ర అసంతృప్తికి గురి చేశాయి. మర్యాదపూర్వక భేటీ పేరుతో వచ్చి దిగజారుడు రాజకీయాలు చేయడం సబబు కాదు. మీ పర్యటన లక్ష్యంపై అనుమానాలు కలుగుతున్నాయి. మీ నిజాయితీపై నా మదిలో ఎన్నో ప్రశ్నలు రేగుతున్నాయ’ని రాహుల్‌కు రాసిన లేఖలో పరీకర్ పేర్కొన్నారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఎటువంటి అక్రమాలు జరగలేదని, దేశ భద్రతకే పెద్దపీట వేశామని ఆయన స్పష్టం చేశారు. కాగా, రాహుల్ గాంధీ అబద్దాలకోరు అంటూ బీజేపీ నాయకులు, గోవా మంత్రులు ధ్వజమెత్తారు. వ్యక్తిగత పర్యటనలను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. (గోవా సీఎంతో రాహుల్ గాంధీ భేటీ) -
గోవాకు తిరిగొచ్చిన పరీకర్
పనజి: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ ఆదివారం మధ్యాహ్నం స్వరాష్ట్రానికి తిరిగొచ్చారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఆయన ఆదివారం ఉదయం ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గోవా చేరిన పరీకర్.. అక్కడ నుంచి అంబులెన్స్‌లో డోనా పౌలాలో ఉన్న నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు గోవా మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు. పరీకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనకు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరం అని కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ విలేకరులకు తెలిపారు. గోవా అసెంబ్లీ రద్దు వార్తలను ఆయన ఖండించారు. ఫిబ్రవరిలో అనారోగ్యానికి గురైన పరీకర్ గోవా, ముంబై, అమెరికాలో చికిత్స పొందారు. చివరికి సెప్టెంబర్ 15న ఎయిమ్స్‌లో చేరారు. -
గోవాకు త్వరలో కొత్త సీఎం?
పణజి: ముఖ్యమంత్రి మనోహర్ పారికర్(62) ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను సమీక్షించేందుకు అధికార బీజేపీ కేంద్ర పరిశీలక బృందం ఆదివారం మధ్యాహ్నం గోవా చేరుకుంది. సీఎం పారికర్ తీవ్ర అనారోగ్యంతో శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం కుదుటపడే వరకు సీఎంగా మరొకరిని ఎంపికచేసే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ బృందం రాష్ట్రానికి రావడం గమనార్హం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బీఎస్ సంతోష్, రామ్ లాల్, రాష్ట్ర ఇన్చార్జి విజయ్ పురాణిక్‌లతో కూడిన ఈ బృందం ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పరిస్థితులపై పార్టీ నేతలతోపాటు సంకీర్ణ భాగస్వామ్య పక్షాలైన గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ), మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో పాటు, స్వతం త్ర అభ్యర్థుల మనో గతం తెలుసుకుంటుం దని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ టెండూల్కర్ తెలిపారు. 40 మంది సభ్యుల గోవా అసెంబ్లీలో బీజేపీ 14, సంకీర్ణంలోని జీఎఫ్‌పీ, ఎంజీపీలకు ముగ్గురు సభ్యుల బలం ఉండగా ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు.కాంగ్రెస్‌కు 16, ఎన్సీపీకి ఒక్క సభ్యుడు ఉన్నారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది.‘మా ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారు. అధికార పార్టీలో అంతర్గత కుమ్ము లాట మొదలైంది. అయితే, అధికారం చేపట్టాలనే ఆదుర్దా మాకు లేదు’ అని గోవా కాంగ్రెస్ కార్యదర్శి చెల్లకుమార్ తెలిపారు. -
ఆయన కోలుకుంటున్నారు: కేంద్రమంత్రి ట్వీట్
పనాజి : తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహార్ పారికర్ ప్రస్తుతం కోలుకుంటున్నారని కేంద్రమంత్రి సురేష్ ప్రభు ట్విట్ చేశారు. ప్యాంక్రియాటిక్ సమస్యతో గతకొంత కాలంగా ఇబ్బంది పడుతున్న పారికర్ అమెరికాలో వైద్యం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పారికర్ ఆరోగ్యంపై వాకాబు చేసిన సురేష్ ప్రభు.. ‘ప్రస్తుతం పారికర్ వైద్యానికి స్పందిస్తున్నారు, వేగంగా కోలుకుని, త్వరలోనే రాష్ట్రానికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను’ అని తన ట్వీటర్లో పేర్కొన్నారు. ప్యాంక్రియాటిక్ సమస్యతో పారికర్ ఫిబ్రవరి 14న ముంబాయిలోని లీలావతి హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోజునే ఆయన రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశాలు ముగిసిన అనంతరం సమస్య తీవ్రం కావడంతో పారికర్ పనాజీలోని గోవా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ చేరారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మార్చి మొదటి వారంలో ఆయనను అమెరికా తీసుకెళ్లారు. కాగా సీఎం రాష్ట్రంలో లేని కారణంగా ముగ్గురు మంత్రుల బృందం రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. -
సర్జికల్ స్ట్రైక్స్ పై ‘ఆయన’కు నో ఐడియా
సాక్షి, పనాజీ: యూరీ దాడికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి ముష్కరులను మట్టుపెట్టింది భారత సైన్యం. ఆ సమయంలో రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ నేతృత్వంలోనే ఈ మెరుపు దాడి జరిగిందన్న విషయం విదితమే. అయితే దీనిపై గొప్పలు చెప్పుకున్న పారికర్‌కు, సర్జికల్ స్ట్రైక్స్‌పై కనీస అవగాహన కూడా లేదంటోంది కాంగ్రెస్. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన గోవా ముఖ్యమంత్రిగా తిరిగి పగ్గాలు చేపట్టి, త్వరలో జరగబోయే పనాజీ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీచేయబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు శాంతారామ్ నాయక్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పారికర్‌పై మాటల తూటాలు పేల్చారు. ‘సర్జికల్ దాడుల గురించి పారికర్‌కు ఏం తెలీదు. జాతీయ భద్రతా విభాగం, ప్రధాని కార్యాలయ సిబ్బంది మాత్రమే అందులో పాల్గొన్నారు. తర్వాతే పారికర్‌కు ఆ విషయం తెలిసింది. అయినప్పటికీ ఆ గొప్పతనం అంతా తనది, మోదీది, వాళ్లను తీర్చిదిద్దిన ఆర్ఎస్ఎస్దంటూ పారికర్ చెప్పుకుని తిరిగాడు. ఇక్కడి రాజకీయాలకు భయపడే కేంద్రానికి వెళ్లాడు. అక్కడా రక్షణ మంత్రిగా విఫలం కావటంతో తిరిగి రాష్ట్రానికి పంపించేశారు. కానీ, అసలు ఆయన గమనించాల్సిన విషయం ఏంటంటే రాజకీయాలకే పారికర్ అనర్హుడు’ అని నాయక్ పేర్కొన్నారు. గతంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పారికర్ ఆగస్టు 23న జరగబోయే పనాజీ ఉప ఎన్నిక బరిలో దిగుతున్నారు. ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి గిరీశ్ చోదంకర్, గోవా సురక్ష మోర్చా పార్టీ తరపున ఆనంద్ శిరోద్కర్ పోటీ చేస్తున్నారు. -
దిగ్విజయ్ వల్లే సీఎం అయ్యా: పారికర్
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించినా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా.. తనకు అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌కు గోవా సీఎం, రక్షణ శాఖ మాజీ మంత్రి మనోహర్ పారికర్ కృతజ్ఞతలు తెలిపారు. మార్చి మొదటి వారంలో రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన పారికర్.. శుక్రవారం నాడు జీరో అవర్ సందర్భంగా రాజ్యసభకు వెళ్లారు. అక్కడి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అందరినీ గోవాకు స్వాగతించారు. చైర్మన్, డిప్యూటీ చైర్మన్, సభ్యులు అందరూ తాను రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు తనకు ఎంతగానో సహకరించారని, వాళ్లంతా ఎప్పుడు గోవా రావాలనుకున్నా అందరికీ స్వాగతమని అన్నారు. ఆ తర్వాత.. గోవాలోనే ఉన్నా, ఏమీ చేయకుండా కూర్చున్నందుకు దిగ్విజయ్ సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నానని, ఆయన వల్లే తాను ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగానని వ్యాఖ్యానించారు. దాంతో కాంగ్రెస్ సభ్యులు ఒక్కసారిగా సీట్లలోంచి లేచి పోడియం వద్దకు వచ్చి తీవ్రస్థాయిలో నిరసన, అభ్యంతరం తెలియజేశారు. మార్చి 11వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల్లో గోవాలో ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజారిటీ రాలేదు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 17, బీజేపీకి 13 రాగా.. ఇతర చిన్న పార్టీలు మిగిలిన స్థానాలను పంచుకున్నాయి. కాంగ్రెస్ ముందుగా స్పందించకపోవడంతో బీజేపీ పావులు కదిపి, చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. మనోహర్ పారికర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో కాంగ్రెస్ తరఫున పరిశీలకుడిగా సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ గోవాలోనే మకాం వేశారు. అయినా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోగా.. సీనియర్ నాయకుడు విశ్వజిత్ రాణే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీలో బల నిరూపణకు కొద్ది సేపటి ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం దిగ్విజయ్‌కు షాకిచ్చింది. తర్వాత మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేశారు. దిగ్విజయ్ సింగ్ వల్లే గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాలేదని వాళ్లిద్దరూ వ్యాఖ్యానించారు. -
గోవా సీఎంగా పరీకర్ ప్రమాణం
మరో 9 మంది మంత్రులుగా ప్రమాణం ⇒ రేపు అసెంబ్లీలో బలపరీక్షకు సుప్రీంకోర్టు ఆదేశం పణజి: గోవా పాలనా పగ్గాలు చేపట్టేందుకు రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన మనోహర్ పరీకర్ మంగళవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణంచేశారు. సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించనున్న ఆయనతో రాజ్‌భవన్‌లో గవర్నర్ మృదులా సిన్హా ప్రమాణం చేయించారు. పరీకర్తోపాటు 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో బీజేపీ నుంచి ఇద్దరు, గోవా ఫార్వర్డ్ బ్లాక్(జీఎఫ్‌పీ) నుంచి ముగ్గురు, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ) నుంచి ఇద్దరు, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. బాంబే ఐఐటీలో చదివిన 61 ఏళ్ల పరీకర్ గోవా సీఎం కావడం ఇది నాలుగోసారి. పరీకర్ ప్రమాణంపై స్టే విధించాలన్న కాంగ్రెస్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం కొట్టేసి, గురువారం బలపరీక్షకు ఆదేశించడం, ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలసినా ఫలితం లేకపోవడంతో పరీకర్ సీఎంకావడానికి మార్గం సుగమమైంది. ప్రమాణ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ, వెంకయ్య తదితరలు, ప్రముఖులు హాజరయ్యారు. మెజారిటీ నిరూపించుకుంటా: పరీకర్ బలపరీక్షలో మెజారిటీ నిరూపించుకుంటానని, తమవైపు 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని పరీకర్ తర్వాత విలేకర్లతో చెప్పారు. గోవాతనాన్ని నిలుపుకోవడం నా ప్రాధాన్యం. నెలలోపు ప్రభుత్వ కనీస ఉమ్మడి కార్యక్రమంపై ప్రకటన చేస్తాం’ అని చెప్పారు. కాంగ్రెస్ చివరి యత్నం.. పరీకర్ ప్రమాణానికి ముందు.. అధికారం కోసం చివరిక్షణంలోనూ కాంగ్రెస్ విఫలయత్నం చేసింది. పెద్ద పార్టీ అయిన తమకు ప్రభుత్వ ఏర్పాటు కోసం అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ఎల్పీ నేత కవ్లేకర్ సహా 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. తమకు మెజారిటీ ఉందన్నారు. తన విచక్షణ ప్రకారం నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ చెప్పారని పార్టీ నేత లుయిజిన్హో ఫలేరియో విలేకర్లతో చెప్పారు. మీకు మెజారిటీ ఉందా అని ప్రశ్నించగా.. బలపరీక్షలో తేలుతుందని చెప్పారు. 40 స్థానాల గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా, 13 సీట్లతో బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలవడం తెలిసిందే. మనోహర్ పరీకర్ ప్రస్థానం.. ఉత్తర గోవాలోని మపుసాలో మధ్యతరగతి వర్గానికి చెందిన వ్యాపార కుటుంబంలో పరీకర్ జన్మించారు. పరీకర్ 1994లో తొలిసారి గోవా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయంతోమోదీ ఏరికోరి పరీకర్‌ను మంత్రివర్గంలో చేర్చుకుని రక్షణ మంత్రి పదవిని అప్పగించారు. పరీకర్ ఆధ్వర్యంలోనే గోవా బాగా అభివృద్ధి చెందిందని..రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత ఏర్పడిందని రాష్ట్ర ప్రజలకు నమ్మకం కుదిరింది. బలపరీక్షే పరిష్కారం న్యూఢిల్లీ: పరీకర్ ప్రమాణ స్వీకారంపై స్టే విధించాలని కాంగ్రెస్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. గురువారం అసెంబ్లీలో బలపరీక్ష జరపాలని గవర్నర్‌ను కోరింది. పరీక్షతో కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలన్నింటికి పరిష్కారం లభిస్తుందని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. మంగళవారం హోలీ సెలవు దినమైనా కోర్టు ప్రత్యేకంగా సమావేశమై గోవా కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత చంద్రకాంత్ కవ్లేకర్ వేసిన పిటిషన్‌ను విచారించింది. ఈ విషయంలో కాంగ్రెస్ తీరు సరిగ్గాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్యపై గవర్నర్‌కు చెప్పని కాంగ్రెస్‌దే తప్పు. ప్రాంతీయ పార్టీల, స్వతంత్రుల మద్దతు అఫిడవిట్లను ఆ పార్టీ కోర్టుకు తీసుకురాలేదు.. ఇదంతా 30 సెకన్ల పని. రెండు రోజులుగా ఏం జరుగుతోందో తెలిసినా కాంగ్రెస్ పరీకర్‌ను కేసులో ఇంప్లీడ్ చేయలేదు. అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడమనేది సంఖ్యాబలానికి సంబంధించిన విషయం’ అని పేర్కొంది. పరీకర్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్ నిర్ణయంపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. తమకు 21 మంది సభ్యుల మద్దతుందన్న బీజేపీ వాదనను పరిగణనలోకి తీసుకుంటూ గవర్నర్.. పరీకర్‌కు రాసిన లేఖను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ నెల 16(గురువారం) ఉదయం 11 గంటలకు బలపరీక్ష నిర్వహించేందుకు అసెంబ్లీని సమావేశపరచాలని, సభ్యుల ప్రమాణం తర్వాత బలపరీక్ష జరపాలని గవర్నర్‌ను కోరింది. అత్యంత సీనియర్ సభ్యుణ్ని ప్రొటెమ్ స్పీకర్‌గా నియమించాలని సూచించింది. అంతకుముందు కవ్లేకర్ తరపున సీనియన్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ.. అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌ను కాకుండా పరీకర్‌ను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం అత్యంత వివాదాస్పదం, వాస్తవ విరుద్ధమని ఆక్షేపించారు.ఆమె రాజ్యాంగ సంప్రదాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలన్న కాంగ్రెస్ లేఖకు కనీస మర్యాద ఇవ్వలేదని ఆరోపించారు. -
పరికర్తో పాటు 8 మంది మంత్రులు
దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ గోవా ముఖ్యమంత్రిగా వస్తున్న మనోహర్ పారికర్ మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాన్ని గోవా బీజేపీ అధ్యక్షుడు వినయ్ టెండూల్కర్ మీడియాకు తెలిపారు. ఎనిమిది నుంచి తొమ్మిది మంది వరకు మంత్రులు కేబినెట్లో ఉంటారని, వాళ్లలో గోవా ఫార్వర్డ్ పార్టీ నుంచి ఇద్దరు, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ నుంచి ఇద్దరు, ఇద్దరు స్వతంత్రులు కూడా ఉంటారని ఆయన వివరించారు. బీజేపీ నుంచి ఇద్దరు లేదా ముగ్గురు ప్రమాణస్వీకారం చేస్తారన్నారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజాతో పాటు మరొకరు కూడా ప్రమాణం చేస్తారని, వాళ్ల పేర్లను మంగళవారం ఉదయం ప్రకటిస్తామని వినయ్ టెండూల్కర్ చెప్పారు. ఆ తర్వాత కొంతకాలం ఆగి చేపట్టే మంత్రివర్గ విస్తరణలో మరో ముగ్గురు లేదా నలుగురికి చాన్స్ రావచ్చన్నారు. 21 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకుందని, అందువల్ల ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు మనోహర్ పారికర్ లేఖ రాయడంతో.. గవర్నర్ మృదులా సిన్హా ఆయనను సీఎంగా నియమిస్తూ ఆదివారం రాత్రే ఉత్తర్వులిచ్చారు. గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లేటప్పుడు పారికర్ వెంట జీఎఫ్‌పీ నాయకుడు విజయ్ సర్దేశాయ్, ఎంజీపీ నాయకుడు సుదిన్ ధావలికర్ కూడా ఉన్నారు. రాజ్‌భవన్‌లో మంగళవారం సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు హాజరవుతారు. -
కొత్త రక్షణ మంత్రి ఎవరో తెలుసా?
రక్షణ శాఖ మంత్రిత్వ పదవికి మనోహర్ పారికర్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. రక్షణ శాఖ బాధ్యతలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అప్పగిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు కూడా మోదీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అరుణ్ జైట్లీయే రక్షణ మంత్రిగా ఉండేవారు. ఆ తర్వాత తనకు పనిభారం ఎక్కువైందని, ఏదో ఒక శాఖ తీసేయాలని జైట్లీ కోరడంతో.. పారికర్‌ను గోవా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించి మరీ తీసుకొచ్చారు. గోవాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే ఒక్క మనోహర్ పారికర్‌ను తప్ప వేరెవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టినా వీలుకాని పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ లాంటివి గతంలోనే లక్ష్మీకాంత్ పర్సేకర్‌ను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ పార్టీ కూడా మనోహర్ పారికర్ సీఎంగా వస్తామంటే బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధమని తెలిపింది. దాంతో.. ఏరికోరి రక్షణ శాఖకు తీసుకున్న పారికర్‌ను మళ్లీ సొంత రాష్ట్రానికి ప్రధాని పంపేశారు. చాలాకాలంగా గోవా ఆహారం తినకపోవడంతో తాను సన్నబడ్డానని ఎన్నికల ప్రచారం సమయంలో పారికర్ వ్యాఖ్యానించారు. దానికి అర్థం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చని కూడా ఆయన మీడియాతో అన్నారు. అప్పుడు చెప్పినట్లే ఇప్పుడు మళ్లీ సొంత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెళ్లిపోతున్నారు. కాగా, పారికర్‌ను అసెంబ్లీకి పంపేందుకు వీలుగా ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా రాజీనామా చేశారు. ఆయన ఎన్నికైన మాపుసా స్థానం నుంచే పారికర్ అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. డిసౌజాకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఢిల్లీకి పంపుతారని అంటున్నారు. -
రక్షణశాఖ మంత్రిపదవికి పారికర్ రాజీనామా
న్యూఢిల్లీ : కేంద్ర రక్షణశాఖ మంత్రి పదవికి మనోహర్ పారికర్ సోమవారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పీఎంవోకు పంపించారు. కాగా గోవా ముఖ్యమంత్రిగా పారికర్ మంగళవారం సాయంత్రం అయిదు గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. అయితే ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారన్న ప్రశ్నకు పారికర్ సమాధానం దాటవేశారు. అయితే కేబినెట్ కూర్పు పూర్తయిందని, దీనిపై మీడియాకు తామే సమాచారం ఇస్తామన్నారు. కాగా గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తగిన మెజార్టీ సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ సహా ఆరుగురు మంత్రులు ఓటమి చవిచూడటంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, బీజేపీ 13 సీట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఇతరులు 10 సీట్లు గెల్చుకున్నారు. కాగా ప్రభుత్వ ఏర్పాటుకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా గోవా ఫార్వర్డ్ పార్టీ (ముగ్గురు ఎమ్మెల్యేలు), ఏంజీపీ(ముగ్గురు ఎమ్మెల్యేలు)తో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీకి మద్దతు ప్రకటించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలతో సహా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు పారికర్ సీఎంగా రావాలని కోరడంతో బీజేపీ అధిష్టానం సూచన మేరకు పారికర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన గతంలో గోవా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కోరిక మేరకు గత ఎన్నికల్లో పార్టీని గెలిపించిన పారికర్‌ను 2014 కేంద్ర రక్షణశాఖలోకి తీసుకున్న విషయం తెలిసిందే. -
ఇద్దరు మంత్రులపై వేటు వేసిన సీఎం
గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ తన మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులపై వేటు వేశారు. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ)కి చెందిన ఇద్దరినీ తన ప్రభుత్వం నుంచి పీకేశారు. గోవాలో బీజేపీ-ఎంజీపీ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, రెండు పార్టీల మధ్య సంబంధాలు ఇటీవలి కాలంలో బాగా చెడిపోవడంతో.. వచ్చే సంవత్సరం రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే విషయం అనుమానంగానే ఉంది. మంత్రులను తొలగిస్తున్న విషయాన్ని గోవా గవర్నర్ మృదులా సిన్హాకు సోమవారం అర్ధరాత్రి సమయంలో పర్సేకర్ తెలిపారు. సుదిన్ ధావలికర్ దీపక్ ధావలికర్ అనే ఇద్దరినీ పదవుల నుంచి ఆయన తీసేశారు. దాంతో గోవా మంత్రివర్గంలో మొత్తం మంత్రుల సంఖ్య పదికి తగ్గింది. రాజ్యాంగంలోని 164 (1) అధికరణం కింద వాళ్లిద్దరినీ తొలగించాలని సూచించినట్లు పర్సేకర్ చెప్పారు. వాళ్లిద్దరి వద్ద ఉన్న అన్ని శాఖలను వేరే మంత్రులకు కేటాయించేవరకు ప్రస్తుతానికి తనవద్దే ఉంటాయని తెలిపారు. ఎంజీపీ తరఫున కేబినెట్లో ఇద్దరు మంత్రులే ఉండేవారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో 21 స్థానాలు బీజేపీకి రాగా, ఎంజీపీ మూడుచోట్ల గెలిచింది. ఎన్నికలకు ముందే రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పుడు ఇద్దరు మంత్రులను తొలగించినా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండబోదు. సుదిన్ ధావలికర్ వద్ద రవాణా, ప్రజాపనుల శాఖ ఉండగా, డీపక్ వద్ద గ్రామీణాభివృద్ధి శాఖ ఉండేది. మంత్రులను తొలగించే అధికారం తనకు రాజ్యాంగబద్ధంగా ఉందని, వాళ్లు తనమీద విమర్శలు చేస్తున్నందువల్లే తప్పించానని సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ స్పష్టం చేశారు. ఈ ఖాళీల్లోకి ఎవరిని తీసుకోవాలో ఇంకా నిర్ణయించలేదన్నారు. అయితే, తమను తప్పించిన విషయం ఇంకా తమవరకు రాలేదని ఎంజీపీ మంత్రులు ఇద్దరూ చెప్పారు. -
గోవా సీఎంపై ఢిల్లీ సీఎం విమర్శలు
పనాజి: గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అవినీతి కేసులో పట్టుపడ్డ ఆయన బంధువును తిరిగి ప్రభుత్వ ఉద్యోగంలోకి తీసుకోవడాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా తప్పుపట్టారు. దీనితో ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న సందేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇదే స్థానంలో తన బందువు ఉంటే ఈ పాటికి జైలులో ఉండేవాడని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. గోవాలోని ప్రముఖ పర్యాటక క్షేత్రమైన కోలంగేట్ లోని హోటల్ ప్రతినిథులలో మాట్లాడుతూ ఆయన ఈవ్యాఖ్యలు చేశారు. గోవా సీఎంకు బావ అయిన దిలిప్ మాలవంకర్ ఆ రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో పని చేస్తున్నారు. గతేడాది ఆయన రూ. లక్ష లంచం తీసుకుంటూ తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డ కేసులో సస్పెండ్ అయ్యారు. -
సమర్థ నేతలు కావలెను!!
గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు పరిపాలనపైనే దృష్టి పెట్టిన నరేంద్ర మోదీకి, ప్రధాని అయ్యాక కేంద్రంలో ప్రాధాన్యతలు మారాయి. శాసనాలు, విధానాల రూపకల్పన ఇప్పుడాయన ప్రధాన విధి. దానికి అత్యంత నమ్మకస్తులు, తెలివైన వారు అవసరం. గోవా ముఖ్యమంత్రి పారికర్ వీరిలో ఒకరు. ఆరు నెలల క్రితం భారత కేంద్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రెండు ముఖ్యమైన మంత్రి పదవులను ఒకే వ్యక్తికి అప్పగించారు. బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ రక్షణ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు రెండింటినీ తనవద్దే అట్టిపెట్టుకు న్నారు. కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైనవిగా పరిగణిస్తున్న నాలుగు మంత్రిత్వ శాఖల్లో ఇవి రెండు. (మరో రెండు శాఖలు హోం, విదేశీ వ్యవహా రాలు). పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు జైట్లీ మాట్లాడుతూ కొద్ది వారాల వరకు అంటే మరొకరు దాన్ని స్వీకరించేంతవరకు మాత్రమే రక్షణ శాఖను తన వద్ద ఉంచుకుంటానని చెప్పారు. ఆ మరొకరు మరెవరో కాదు మాజీ జర్నలిస్టు అరుణ్ శౌరీనే అని ఆ సమయంలో ఒక అంచనా ఉండేది. ప్రధానమంత్రి మనస్సులో ఎవరు ఉండేవారో కానీ, ఆ వ్యక్తి ఉనికి బయటకు రాలేదు. ఈ లోగా మే నెల దాటి నవంబర్ కూడా వచ్చేసింది. ఈ కారణం వల్లే భారతీయ జనతా పార్టీలో చక్కటి ఆలోచనాపరుడిగా కనిపిస్తున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలోనికి తీసుకు వస్తు న్నారని పత్రికా వార్తలు సూచిస్తున్నాయి. అత్యంత సమర్థత కనబరుస్తున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన పదవిని వదులు కుని ఢిల్లీకి ఎందుకు రావలసివస్తోందన్నది ప్రశ్న. ప్రత్యేకించి, ప్రధాని మోదీ ఎంపిక చేసుకోవడానికి 300 మందికి పైగా లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు అందుబాటులో ఉండగా, ఢిల్లీకి బయట ఉన్న వ్యక్తిని ఎందుకు తీసుకు వస్తున్నట్లు? ప్రతిభా లేమికి సంబంధించిన ఈ సమస్య ముందుకు రావడానికి రెండు కారణాలు ఉంటున్నాయి. మొదటి సమస్య సాధారణమైంది. ప్రత్యేకించి, వాస్తవమైన లేదా తాము కనుగొన్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఆగ్రహావేశాలను ప్రదర్శించడాన్ని ప్రాతిపదికగా కలిగి ఉన్న హిందుత్వ వంటి బలమైన భావజాలం ఒక రకం వ్యక్తులను సులభంగా ఆకర్షిస్తుంది. గురూజీ గోల్వాల్కర్, వీరసావర్కార్, దీనదయాళ్ ఉపాధ్యాయ్ వంటి వ్యక్తుల రచనలవైపు ఆకర్షితులయ్యే ఇలాంటి వ్యక్తులు వారి ఆలోచనల్లో మాత్రం సూక్ష్మతను, చురుకుదనాన్ని కలిగి ఉంటారని మనం భావించకూడదు. అందుకే ప్రస్తుతం దాదాపు 280 ఎంపీ స్థానాలున్న బీజేపీ కంటే, గతంలో 200 ఎంపీ స్థానాలు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీలోనే సమర్థమైన, చురుకైన నాయకులు ఎక్కువగా ఉండే వారు. కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసుకోవడానికి ముగ్గురు అగ్ర శ్రేణి ఆర్థికమంత్రులు (మన్మోహన్ సింగ్‌తోపాటు చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ) అందుబాటులో ఉండేవారు. కానీ నరేంద్ర మోదీకి మాత్రం రక్షణ శాఖకు కూడా సమయాన్ని వెచ్చించగలి గిన ఒకే ఆర్థిక మంత్రిని మాత్రమే ఉపయోగించుకోవల్సి వస్తోంది.తమ ఆలోచనల్లో నమ్రతను, కార్యదక్షతను ప్రదర్శించే బీజేపీ నేతలు (జైట్లీ, పారికర్) ఉన్నారు కానీ వీరు హిందుత్వ అంశాలపై తక్కువ సైద్ధాంతికతను కలిగి ఉండటమే కాకుండా, కాస్త సరళంగానూ ఉంటున్నారు. రెండో సమస్య మరింత నిర్దిష్టమైనది. ఇది ప్రధాని అభద్రతకు సంబంధించిన విషయం. కేంద్ర మంత్రిమండలిలో కొంతమంది ప్రతిభావంతులు, అనుభవజ్ఞులు ఉన్నారు కానీ వారిని ఆయన ఉపయోగించదల్చుకోలేదు. దీనికి కారణం ఏమంటే వారు మరీ వృద్ధులైపోయారు (ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషీ ఇద్దరూ లోక్‌సభలో ఉన్నారు వారికి పనిలేదు) లేదా వారు మరీ చిన్నవారుగా ఉన్నారు (వరుణ్ గాంధీ, అత్యాశపరుడు, చురుకైనవాడు, మరిన్ని బాధ్యతల కోసం ఎదురుచూస్తుంటారు). వీరిని పక్కన ఉంచడానికి అసలు కారణం ఏమంటే, వీరు మోదీని గదమాయించగలరు. మంత్రిమండలిలోకి వీరిని తీసుకుంటే మోదీ వారితో వ్యవహరించలేరు. గుజరాత్లో కూడా మోదీ ఇలాగే చేశారు. కేశుభాయ్ పటేల్, కాశీరామ్ రాణా వంటి అనుభవజ్ఞులైన నేతలను వారి మద్దతుదారులను కూడా మోదీ అధికార పదవులకు దూరంగా ఉంచారు. అయితే గుజరాత్లో తను చేసి చూపగలిగినదాన్ని ఢిల్లీలో కూడా ప్రతికల్పన చేయాలంటే ఒక అడ్డంకి ఉంది.అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మాదిరే, గుజరాత్‌ను నడపడంలో మోదీ దృష్టి ప్రధానంగా పరిపాలనపైనే ఉండేది. స్పష్టంగా చెప్పాలంటే చాలావరకు కేంద్రం నుంచి వచ్చే విధానాలను అమలు చేయడమే. వాజ్‌పేయీ ప్రభుత్వం విద్యుత్ రంగం విషయంలో ప్రైవేట్ కంపెనీలకు తలుపులు తెరిచినప్పుడు దాన్ని గుజరాత్లో మోదీ అద్భుతంగా అమలు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ మిగులు అధికంగా ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి నుండి వచ్చేది. కేంద్ర విధానాలను గుజరాత్లో అమలు చేయడానికి మోదీ ఉన్నతాధికారుల బృందాన్ని నియమించారు. వీరు మంత్రుల విధులతో వ్యవహరించేవారు. రాజకీయ నేతల జోక్యాన్ని తోసిపుచ్చారు. ఈ మొత్తం పనిపై కేవలం ఇద్దరు మంత్రులకు మాత్రమే వాస్తవంగా బాధ్యత ఉండేది (సౌరభ్ పటేల్, అమిత్ షా). వీరిలో ఏ ఒక్కరికీ కేబినెట్ స్థాయి ఉండేది కాదు. అలా వారు తమ పనిని బ్యూరోక్రాట్ల ద్వారా మోదీ నేరుగా పర్యవేక్షిస్తున్నారన్న అవగాహనతో ఉండేవారు. ఢిల్లీకి తరలి వెళ్లాక, పని స్వభావం మారింది. మోదీ ఇప్పు డు శాసనాల రూపకల్పన, విధానాలపైనే దృష్టిని కేంద్రీకరిం చాల్సి ఉంది కాని వాటి అమలు పట్ల కాదు. ఇది ఆయన పని పద్ధతికి అంతరాయం కలిగించింది. గుజరాత్లో మాదిరే తాను నమ్ముతున్న పీయూష్ గోయెల్, నిర్మలా సీతారామన్ వంటి మంత్రులకు ఎక్కువ పని అప్పగించడం ద్వారా పరిస్థితులను తన అదుపులో ఉంచుకోవాలని మోదీ ప్రయత్నించారు. వీరి ద్దరూ మోదీకి ప్రీతిపాత్రమైన ఇంధనం, వాణిజ్యం, పరి శ్రమలు వంటి పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రధాన విధి ఏదంటే శాసన, విధాన రూపకల్పనే. దీన్ని నిర్వహించడం కోసం మోదీకి అత్యంత తెలివైన వ్యక్తులు అవసరం. కానీ అలాంటి వారు ఆయనకు అందుబాటులో లేరు. అయితే వారి దురదృష్టమో లేక ప్రభుత్వ దురదృష్టమో కానీ, మోదీ కోరుకోని వ్యక్తులే కేంద్ర మంత్రిమండలిలో ఉన్నారు. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) ఆకార్ పటేల్ -
సీఎం పదవికి మనోహర్ రాజీనామా
న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రి పదవికి మనోహర్ పారికర్ శనివారం రాజీనామా చేశారు. ఆదివారం జరగనున్న కేంద్రమంత్రి వర్గ విస్తరణలో మనోహర్ కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. గోవా నూతన ముఖ్యమంత్రి పేరును ఇప్పటికే బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఎంపిక చేసింది. ఈ రోజు సాయంత్రం 4.00 గంటలకు గోవా కొత్త సీఎం పేరును బోర్డు ప్రకటించనుంది. అయితే మనోహర్ పారికర్ రాజ్యసభకు పంపాలని బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ నెలలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఈ నెల 10న మనోహర్‌తో రాజ్యసభకు నామినేషన్ వేయించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసింది. -
గోవా గవర్నర్‌గా మృదుల సిన్హా ప్రమాణ స్వీకారం
పనాజీ: గోవా గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నాయకురాలు, రచయిత్రి మృదుల సిన్హా (71) ఆదివారం పనాజీలోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మెహిత్ షా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరికర్తోపాటు మంత్రివర్గ సహాచరులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గోవా గవర్నర్‌గా పదవి చేపట్టిన మొదటి మహిళగా మృదుల సిన్హా రికార్డు సృష్టించారు. గతంలో గోవా గవర్నర్‌గా ఉన్న బీవీ వాంఛూను చాపర్ల కుంభకోణంలో సీబీఐ ఆయన్ని ప్రశ్నించింది. దాంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో గోవా గవర్నర్ పదవి ఖాళీ అయింది. దాంతో మోడీ ప్రభుత్వం మృదుల సిన్హాను గోవా గవర్నర్‌గా నియమించాలని రాష్ట్రపతికి సిఫార్స్ చేసిన సంగతి తెలిసిందే. -
సారీ చెప్పిన గోవా సీఎం
పనాజి: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ క్షమాపణ చెప్పారు. శాసనసభలో 'నీగ్రో' పదం ప్రయోగించినందుకు ఆయన సారీ చెప్పారు. ఆయన చేసిన పదప్రయోగంపై విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆయన వెనక్కు తగ్గారు. నీగ్రో పదానికి రెండు అర్థాలున్నాయని పారికర్ తెలిపారు. ఒకటి అమెజాన్ ప్రవహించే నది పేరని, అగౌరపరిచే సందర్భంలోనూ దీన్ని వాడతారని చెప్పారు. తాను ప్రయోగించిన పదం కారణంగా ఎవరైనా బాధపడివుంటే క్షమించాలని ఆయన అసెంబ్లీలో అన్నారు. రాష్టంలో అరెస్టైన విదేశీయుల గురించి చెబుతూ పారికర్ 'నీగ్రో' పదం వాడారు. -
నాపై మీడియా కక్షగట్టింది.. ఓ సీఎం ఆరోపణ
మీడియా తనపట్ల పక్షపాతంతో వ్యవహరిస్తోందని, కేవలం ప్రతిపక్షాలు డబ్బులిస్తే వాళ్లు చెప్పిన వార్తలు మాత్రమే కవర్ చేస్తూ.. తనను ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఓ ముఖ్యమంత్రి వాపోతున్నారు. ఆయనెవరో కారు.. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్!! ఐఐటీ చదివి ముఖ్యమంత్రిగా వచ్చిన ఆయన ఇప్పుడు వార్తల కవరేజి గురించి ఆవేదన చెందుతున్నారు. అంతేకాదు, ఏకంగా పాత్రికేయుల చదువు గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ''రిపోర్టర్ జీతం ఎంత? న్యూస్‌రీడర్‌కు ఎంత వస్తుంది? బహుశా 25 వేలు కావచ్చు. కానీ వాళ్లు చాలామంది డిగ్రీ చదివిన వాళ్లే. వాళ్లేమీ పెద్ద మేధావులు, ఆలోచనాపరులు కారు. తమకు అర్థమైనట్లు గానే వార్తలు రాసేస్తారు. గోవాలో పెయిడ్ న్యూస్ సంస్కృతి చాలా ఎక్కువగా ఉంది. కథనం రాయాలంటే డబ్బులు తీసుకుంటారు'' అని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద ఆయన మండిపడ్డారు. ఏ రాజకీయ పార్టీ వార్తా పత్రికలు నడుపుతోందో అందరికీ తెలుసని, ఆ పేపర్ ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతుందో కూడా తెలుసని అన్నారు. ఎవరైనా వ్యక్తి చేసిన వ్యాఖ్యల గురించి రాసేటప్పుడు.. ఆ వ్యక్తి ఎంత శక్తిమంతుడో తెలుసుకోవాలన్నారు. -
'అధికారులను సొంత పనులకు వాడుకోలేదు'
పనాజీ: సొంత పనులకు ప్రభుత్వ అధికారులను వాడుకున్నారని కొంతమంది ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలను గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తోసిపుచ్చారు. గత నెలలో జరిగిన తన కుమారుడి వివాహానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తానెప్పుడూ అధికారులను వ్యక్తిగత పనులకు వినియోగించుకోలేదన్నారు. పెళ్లి శుభలేఖలను కూడా తన సొంతకారులో వెళ్లి పంచిపెట్టినట్టు వెల్లడించారు. విపక్ష నేతలు చేసిన ఆరోపణల్లో పసలేదని కొట్టిపారేశారు. వారు చేసిన ఆరోపణలన్నింటికీ సమాధానం ఇచ్చేందుకు సిద్ధమన్నారు. అధికారులు ప్రభుత్వ వాహనాల్లో పెళ్లి హాజరైనంత మాత్రానా దాన్ని అధికార దుర్వినియోగం అనడం సమంజసం కాదన్నారు. పెళ్లికి హాజరైన రాజ్‌నాథ్, నరేంద్ర మోడీ భద్రత కోసం ప్రోటోకాల్ ప్రకారం అధికార యంత్రంగాన్ని మొహరించామని వివరించారు. పారికర్ కుమారుడు అభిజాత్ వివాహం డిసెంబర్ 26న జరిగింది.