సీఎం పదవికి మనోహర్ రాజీనామా | Manohar Parrikar resigns as Goa chief minister | Sakshi
Sakshi News home page

సీఎం పదవికి మనోహర్ రాజీనామా

Published Sat, Nov 8 2014 12:30 PM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

సీఎం పదవికి మనోహర్ రాజీనామా

సీఎం పదవికి మనోహర్ రాజీనామా

న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రి పదవికి మనోహర్ పారికర్ శనివారం రాజీనామా చేశారు. ఆదివారం జరగనున్న కేంద్రమంత్రి వర్గ విస్తరణలో మనోహర్ కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. గోవా నూతన ముఖ్యమంత్రి పేరును ఇప్పటికే బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఎంపిక చేసింది.

ఈ రోజు సాయంత్రం 4.00 గంటలకు గోవా కొత్త సీఎం పేరును బోర్డు ప్రకటించనుంది. అయితే మనోహర్ పారికర్ రాజ్యసభకు పంపాలని బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ నెలలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఈ నెల 10న మనోహర్తో రాజ్యసభకు నామినేషన్ వేయించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement