Goa governor
-
గోవా సీఎం ప్రమోద్ సావంత్ రాజీనామా
-
మేఘాలయగా గవర్నర్‌గా సత్యపాల్
సాక్షి, న్యూఢిల్లీ : గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను మేఘాలయ గవర్నర్‌గా నియమిస్తూ మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ గోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. మహారాష్ట్ర గవర్నరు భగత్ సింగ్ కోశ్యారికి గోవా బాధ్యతలను అదనంగా అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా గోవా గవర్నర్‌గా కూడా కోష్యారీ అదనపు బాధ్యతలు నిర్వర్తించాలని రాష్ట్రపతి భవన్ ఆదేశించింది. మేఘాలయ గవర్నర్‌గా ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకున్న తథాగతరాయ్ స్థానంలో సత్యపాల్ మాలిక్ ను రాష్ట్రపతి బదిలీ చేశారు. సత్యపాల్ మాలిక్ గతంలో జమ్ముకశ్మీర్, బిహార్ గవర్నర్ గా పని చేశారు. 2018 ఆగస్టులో మాలిక్ జమ్మూకశ్మీర్ గవర్నర్ గా విధులు నిర్వర్తించారు. అయితే జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదాను ఇచ్చే ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తరువాత 2019 అక్టోబర్ లో సత్యపాల్ మాలిక్ ను గోవాకు బదిలీ చేస్తూ,ఆయన స్థానంలో గిరిష్ చంద్రముర్మును నియమించారు. కాగా, గతంలో మాలిక్ గవర్నర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. గవర్నర్లకు పెద్ద పని ఏదీ ఉండదని, గవర్నర్ గా పని చేసే వారు వైన్ తాగి, గోల్ఫ్ ఆడుతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశంలో గవర్నర్ వ్యవస్థపై చర్చ కూడా జరిగింది. -
నేను పుట్టకముందే అమ్మ చంపేద్దామనుకుంది
తాను ఇంకా పుట్టకముందే తన తల్లి తనను చంపేద్దామనుకున్నారని గోవా గవర్నర్ మృదులా సిన్హా తెలిపారు. తన తల్లి 40 ఏళ్ల వయసులో గర్భం దాల్చడంతో.. జనం ఏమనుకుంటారోనని ఆమె అలా చేశారని గవర్నర్ చెప్పారు. పణజిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతున్న సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఆడ శిశువులను రక్షించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపు ఇస్తున్నప్పుడు తనకీ సంఘటన గుర్తుకొచ్చిందని, తన తండ్రే తన ప్రాణాలు కాపాడారని ఆమె చెప్పారు. అబార్షన్ కోసం తన తల్లి అప్పట్లో ఏవో మాత్రలు మింగారని, అయితే తన తండ్రి సమాజం గురించి భయపడకుండా ఆమెను వెంటనే సమీపంలోని నగరంలో గల ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి.. తనను బతికించారని గవర్నర్ వెల్లడించారు. అంతకుముందున్న సంప్రదాయ బంధనాలను తన తండ్రి ఛేదించి.. తన కాళ్ల మీద తాను నిలబడేలా మంచి చదువు చెప్పించారని అన్నారు. ఇప్పుడున్న 'బేటీ బచావో, బేటీ పఢావో' అన్న నినాదానికి అదనంగా 'పరివార్ బచావో' అనే నినాదం కూడా ఇవ్వాల్సి ఉందని మృదులా సిన్హా చెప్పారు. ఒకప్పుడు అమ్మాయిలను కూడా అబ్బాయిల్లా పెంచాలని చెప్పేవారని.. ఇప్పుడు అలా చెప్పాల్సిన అవసరం ఇక లేదని, పల్లెటూళ్లలో కూడా చాలామంది తండ్రులు తమ పిల్లలను బాగా చదివిస్తున్నారని ఆమె ప్రశంసించారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలను పాటించాలని అందరికీ సూచించారు. -
'స్వచ్ఛ భారత్ కోసం ఒకరోజు కేటాయించండి'
పణజి: స్వచ్ఛ భారత్ కోసం ఒకరోజు కేటాయించాలని హాస్పిటాలిటి పరిశ్రమ వర్గాలను గోవా గవర్నర్ మృదులా సిన్హా కోరారు. ప్రతినెల చివరి శనివారం 'క్లీన్ డే'గా పాటించాలని సూచించారు. కనీసం గంట సమయం పరిసరాల పరిశుభ్రత కోసం కేటాయించాలన్నారు. గోవా పర్యాటక రాష్ట్రం అయినందున స్వచ్ఛభారత్ కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హాస్పిటాలిటి స్టేక్ హోల్డర్ల సమావేశంలో శుక్రవారం గవర్నర్ పాల్గొన్నారు. -
గోవా గవర్నర్‌గా మృదుల సిన్హా ప్రమాణ స్వీకారం
పనాజీ: గోవా గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నాయకురాలు, రచయిత్రి మృదుల సిన్హా (71) ఆదివారం పనాజీలోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మెహిత్ షా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరికర్తోపాటు మంత్రివర్గ సహాచరులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గోవా గవర్నర్‌గా పదవి చేపట్టిన మొదటి మహిళగా మృదుల సిన్హా రికార్డు సృష్టించారు. గతంలో గోవా గవర్నర్‌గా ఉన్న బీవీ వాంఛూను చాపర్ల కుంభకోణంలో సీబీఐ ఆయన్ని ప్రశ్నించింది. దాంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో గోవా గవర్నర్ పదవి ఖాళీ అయింది. దాంతో మోడీ ప్రభుత్వం మృదుల సిన్హాను గోవా గవర్నర్‌గా నియమించాలని రాష్ట్రపతికి సిఫార్స్ చేసిన సంగతి తెలిసిందే. -
మహారాష్ట్ర గవర్నర్‌గా సీహెచ్ విద్యాసాగరరావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగరరావు మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే గోవా గవర్నర్‌గా మృదుల సిన్హా, కర్ణాటక గవర్నర్‌గా వీఆర్ వాలా, రాజస్థాన్ గవర్నర్‌గా కళ్యాణ్ సింగ్ నియమితులయ్యారు. నాలుగు రాష్ట్రాల గవర్నర్ల నియమానికి సంబంధించిన ఫైల్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు ఆమోద ముద్ర వేశారు. అయితే బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఓ సారి కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పటి వరకు మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న కె.శంకర నారాయణన్ మిజోరాం రాష్ట్ర గవర్నర్ గా బదిలీ చేస్తూ రాష్ట్రపతి భవన్ శనివారం అర్థరాత్రి ఆదేశాలు జారీ చేసింది. మిజోరాం గవర్నర్ గా వెళ్లేందుకు శంకర నారాయణన్ విముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్ పదవికి ఆదివారం రాజీనామా చేశారు. దాంతో మహారాష్ట్ర గవర్నర్ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే. శంకర్ నారాయణన్ రాజీనామా చేసిన రెండు రోజులకు కొత్త గవర్నర్ ను నియమిస్తు రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. -
అగస్టా కుంభకోణం దర్యాప్తులో పురోగతి
-
అగస్టా దెబ్బకు మరో వికెట్ పడింది!!
అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్లు కొనాలని ఏ ముహూర్తంలో నిర్ణయించారో గానీ.. ఆ ఒప్పందం వరుసపెట్టి గవర్నర్లను బలిగొంటూనే ఉంది. నిన్న కాక మొన్న సీబీఐ ప్రశ్నించడంతో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ రాజీనామా చేయగా.. తాజాగా గోవా గవర్నర్ బీవీ వాంఛూ కూడా తన పదవిని వదులుకున్నారు. వీవీఐపీల కోసం 12 అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్లను కొనుగోలు చేసే ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో.. ఆ కేసును సీబీఐ విచారణకు చేపట్టింది. ఈ కేసులో వాంఛూను సాక్షిగా సీబీఐ విచారించింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన వాంఛూ కాంగ్రెస్ అగ్రనేతల కుటుంబానికి సన్నిహితునిగా పేరొందారు. అప్పట్లో ఆయన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)కి అధినేతగా ఉండేవారు.ఇది ప్రధాని, మాజీ ప్రధానులు, వారి కుటుంబాలకు భద్రత కల్పిస్తుంది. ఈ హోదాలో వాంఛూ కూడా హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో భాగం పంచుకున్నారు. -
గోవా గవర్నర్ రాజీనామా
పనాజీ: యూపీఏ హయాంలో నియమితులైన మరో గవర్నర్ రాజీనామా చేశారు. గోవా గవర్నర్ బీవీ మాంచూ శుక్రవారం వైదొలిగారు. యూపీఏ ప్రభుత్వం నియమించిన గవర్నర్లు వైదొలగాలని ఎన్డీయే ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్ గవర్నర్ నారాయణన్ కూడా ఇటీవల రాజీనామా చేశారు. ఇదిలావుండగా, శుక్రవారం ఉదయం అగస్టా వెస్ట్‌లాండ్ ఒప్పందం కేసులో బీవీ వాంచూను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. పనాజీలో రాజ్‌భవన్‌కు వెళ్లి మూడున్నర గంటల పాటు వాంచూను విచారించారు. ఇదే కేసులో ఎంకే నారాయణన్‌ను కూడీ సీబీఐ విచారించింది. అగస్టా ఒప్పందం సమయంలో నారాయణన్ జాతీయ భద్రత సలహాదారుగా ఉండగా, వాంచూ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చీఫ్‌గా ఉన్నారు. -
గోవా గవర్నర్‌ను ప్రశ్నించిన సీబీఐ
పనాజీ: అగస్టా వెస్ట్‌లాండ్ ఒప్పందం కేసులో గోవా గవర్నర్ బీవీ వాంచూను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీబీఐ అధికారులు శుక్రవారం ఉదయం పనాజీలో రాజ్‌భవన్‌కు వెళ్లి మూడున్నర గంటల పాటు వాంచూను విచారించారు. వీవీఐపీల కోసం 3.726 కోట్ల రూపాయిలకు హెలీకాప్టర్ల కొనుగోలు ఒప్పందం కేసులో అవినీతి ఆరోపణలు రావడంతో సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇటీవల రాజీనామా చేసిన పశ్చిమబెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్‌ను కూడీ సీబీఐ విచారించింది. ఒప్పందం కుదిరినపుడు నారాయణన్ జాతీయ భద్రత సలహాదారుగా ఉండగా, వాంచూ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చీఫ్‌గా ఉన్నారు.