గస్టా వెస్ట్లాండ్ ఒప్పందం కేసులో గోవా గవర్నర్ బీవీ వాంచూను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
పనాజీ: అగస్టా వెస్ట్లాండ్ ఒప్పందం కేసులో గోవా గవర్నర్ బీవీ వాంచూను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీబీఐ అధికారులు శుక్రవారం ఉదయం పనాజీలో రాజ్భవన్కు వెళ్లి మూడున్నర గంటల పాటు వాంచూను విచారించారు.
వీవీఐపీల కోసం 3.726 కోట్ల రూపాయిలకు హెలీకాప్టర్ల కొనుగోలు ఒప్పందం కేసులో అవినీతి ఆరోపణలు రావడంతో సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇటీవల రాజీనామా చేసిన పశ్చిమబెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ను కూడీ సీబీఐ విచారించింది. ఒప్పందం కుదిరినపుడు నారాయణన్ జాతీయ భద్రత సలహాదారుగా ఉండగా, వాంచూ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చీఫ్గా ఉన్నారు.