పాలిటెక్నిక్ విద్యార్థి అనుమానాస్పద మృతి
-
చైతన్య కళాశాల, టౌన్ రైల్వే స్టేష¯ŒS వద్ద తీవ్ర ఉద్రిక్తత ∙
-
కళాశాల యాజమాన్యం తీరుపై ఆందోళన
కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) :
స్థానిక మాధవపట్నంలోని చైతన్య కళాశాల్లో పాలిటెక్నిక్ విద్యార్థి రైలు పట్టాలపై అనుమానాస్పదంగా మృతి చెందిన సం«ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని కళాశాలకు తీసుకుపోతామని టౌ¯ŒS రైల్వే స్టేష¯ŒS వద్ద మృతుడి బంధువులు, మృతుడి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులతో వారు వాగ్వివాదానికి దిగారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రైలుపట్టాలపై మృతదేహం..
తొండంగి మండలం గొరసపాలేనికి చెందిన యాదాల వెంకటరమణ కుమారుడు యాదాల సతీష్‌కిషోర్ (17) ఈ కళాశాల్లో డిపొ్లమో ఇ¯ŒS మెకానికల్ కోర్సు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాల హాస్టల్‌లో ఉంటున్న ఇతడు బుధవారం రాత్రి 7 గంటల సమయంలో హాస్టల్ నుంచి బయటకెళ్లాడు. గురువారం ఉదయం కళాశాల వెనకాల సర్పవరం రైల్వేస్టేష¯ŒS సమీపాన రైలు పట్టాల పక్కన మృతి చెంది పడి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి ఇంద్రపాలెం పోలీసులు, రైల్వే పోలీసులు చేరుకున్నారు. మృతుడి ఒక కాలు విరిగిపోయి ఉండడంతో అనుమానాస్పద మృతిగా గుర్తించారు. మృతదేహం పక్కన విరిగిన సెల్‌ఫో¯ŒS, సిమ్‌కార్డుని గుర్తించారు. సిమ్‌కార్డుని ఫో¯ŒSలో వేసి, పలు నంబర్లకు ఫో¯ŒS చేస్తే మృతుడు చైతన్య కళాశాల్లో పాలిటెక్నిక్ చదువుతున్నట్టు పోలీసులు నిర్ధారించి కళాశాలకు తెలియజేశారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం అందించారు.
పోలీసులతో వాగ్వివాదం
తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటీనా కళాశాలకు చేరుకుని యాజమాన్యంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కుమారుడి మృతికి యాజమాన్యమే బాధ్యత వహించాలంటూ మృతదేహంతో ఆందోళనకు దిగారు. మృతి చెందిన విద్యార్థి తొండంగి మండలం కావడంతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు.. కళాశాల యాజమాన్యంతో చర్చించారు. ఈ చర్చల్లో ఎటువంటి పురోగతి లేకపోవడంతో మృతదేహాన్ని అంబులె¯Œ్సలో టౌ¯ŒS రైల్వేస్టేష¯ŒSకి తీసుకొచ్చారు. జీజీహెచ్ మార్చురీలోకి తరలించేలోపు సుమారు 300 మందికి పైగా గ్రామస్తులు టౌ¯ŒS రైల్వేస్టేష¯ŒSకి చేరుకుని మృతదేహాన్ని కళాశాలకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో కాకినాడ డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు సబ్‌డివిజ¯ŒSకు చెందిన పోలీస్ అధికారులతో టౌ¯ŒS రైల్వేస్టేష¯ŒSకి చేరుకున్నారు. విద్యార్థి మృతికి కళాశాల బాధ్యత వహించాలని, కళాశాలకు మృతదేహాన్ని తీసుకెళతామని గ్రామస్తులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఒక దశలో వారు పోలీసులు, విలేకరులపై దాడికి యత్నించారు. పరిస్థితి విషమించడంతో మృతదేహాన్ని కళాశాలకు తరలిస్తున్నామని డీఎïస్పీ చెప్పారు. అయితే అంబులె¯Œ్సను జీజీహెచ్‌కు తీసుకువెళుతుంటే.. ప్రతాప్‌నగర్ వంతెన వద్ద ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతె పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేష¯ŒSకి తరలించారు. అనంతరం విద్యార్థి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ కార్యక్రమంలో జీఆర్‌పీ సీఐ బీవీ వెంకటేశ్వరరావు, కాకినాడ సబ్ డివిజ¯ŒSలోని సీఐలు ఉమర్, వి.దుర్గారావు, చైతన్యకృష్ణ, పలువురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
మార్చురీ, కళాశాల వద్ద ప్రత్యేక బలగాలు
ఈ నేపథ్యంలో, డీఎస్పీ వెంకటేశ్వరరావు ముందస్తు జాగ్రత్తగా జీజీహెచ్ మార్చురీ, చైతన్య కళాశాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్ఫు రోడ్డు మీదుగా మార్చురీకి వెళ్లే గేటును మూసివేశారు. ఆస్పత్రి ప్రధాన ప్రవేశ ద్వారం నుంచి మార్చురీకి వెళ్లే రహదారుల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కళాశాలే బాధ్యత వహించాలి
కుమారుడు సతీష్‌కిషోర్ మృతికి చైతన్య కళాశాలే బాధ్యత వహించాలని అతడి తండ్రి వెంకటరమణ, బంధువులు డిమాండ్ చేశారు. రూ.వేలకు వేలు చెల్లించి కళాశాల హాస్టల్లో చదివిస్తున్నామని, బుధవారం రాత్రి బయటకెళ్లిన కుమారుడు గురువారం ఉదయం రైల్వే పట్టాలపై శవమై కనిపించాడని కళాశాల యాజమాన్యం చెప్పడం దారుణమన్నారు. కుమారుడి ఆత్మహత్య చేసుకోవాలి్సన ఆగత్యం లేదని, ఎవరో కావాలనే హత్య చేసి రైల్వే పట్టాలపై పారేశారని ఆరోపించారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి దోషులను, కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.