ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య
Published Tue, Nov 29 2016 11:33 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
కాకినాడ క్రైం :
ఇంజనీరింగ్ విద్యలో ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి ఉప్పుటేరులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం నాటి ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే కాకినాడ గ్రామీణం కొత్త గైగోలుపాడుకి చెందిన గంటా రామకృష్ణ జేఎ¯ŒSటీయూకే ఉద్యోగి. తన కుమారుడు గంటా పవ¯ŒSకుమార్ (22)ని భీమవరంలోని ఎస్‌కేఆర్ కళాశాల్లో త్రిపుల్ ఈలో ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు. ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతున్న పవన్ బ్యాక్‌లాగ్స్‌తో బాధపడేవాడు. సబ్జెక్టులు పాసవ్వలేకపోతే తన తల్లిదండ్రులు పరువు పోతుందనే ఉద్దేశంతో మనోవేదన చెందేవాడు. ఈ దశలో మంగళవారం సాయంత్రం కాకినాడ జగన్నాథపురం వచ్చి తండ్రి రామకృష్ణకు ఫోన్ చేశాడు. జీవితంపై విరక్తి చెందాను. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను. మీరు బాధపడొద్దు అంటూ ఫోన్లో చెప్పడంతో అటువంటి పిచ్చిపనులు చేయవద్దు, మేము వస్తున్నాం అని తల్లిదండ్రులు నచ్చచెప్పారు. హుటాహుటిన జగన్నాథపురం పాతవంతెన వద్దకు వచ్చేసరికి అందరూ చూస్తూండగానే ఉప్పుటేరులోకి దూకేశాడు. విషయం తెలిసిన ఒకటో పట్టణ పోలీసులు వేటగాళ్లను పెట్టి గాలించినా Sఫలితం లేకపోయింది. చెట్టంత కొడుకు ఇలా కళ్లెదుటే ఉప్పుటేరులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడడంతో తండ్రి రామకృష్ణ కుప్పకూలిపోయాడు. కుమారుడి కోసం కన్నీటి పర్యంతమైన తండ్రిని చూసి స్థానికులు కంట తడిపెట్టారు. ఉప్పుటేరులో గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు సీఐ ఏవీ రావు తెలిపారు.
Advertisement