
సేంద్రియ పశుపోషణపై స్వల్పకాలిక కోర్సు
దీర్ఘకాలిక వ్యాధులు నానాటికీ విజృంభిస్తుండడానికి సాంద్ర వ్యవసాయంలో, పశుపోషణలో వాడుతున్న రసాయనాలు కొంతమేరకు కారణభూతమవుతున్నాయి. శారీరక ఆరోగ్య సమస్యలతోపాటు, మానసిక ఆరోగ్య సమస్యలకు కూడా ఇవి దారితీస్తున్నాయి. ఫలితంగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఇటీవల ఆసక్తి పెరుగుతోంది.
సేంద్రియ పశుపోషణ - కోళ్ల పెంపకం ప్రమాణాల అమలుకు సంబంధించి 2015 జూన్ 1న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇజ్జత్‌నగర్ (యూపీ)లోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్)కి చెందిన భారతీయ పశువైద్య పరిశోధనా సంస్థ (ఐవీఆర్‌ఐ) ‘సేంద్రియ పద్ధతుల్లో పశుపోషణ- భావన, ప్రమాణాలు, పద్ధతుల’పై 10 రోజుల స్వల్పకాలిక కోర్సును నిర్వహిస్తున్నది. వచ్చే నవంబర్ 28- డిసెంబర్ 7 తేదీల మధ్య శిక్షణ ఉంటుంది. వ్యవసాయ, పశువైద్య పరిశోధన, విద్యా, విస్తరణ సంస్థలు.. డీమ్డ్ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు శిక్షణకు అర్హులు. వివరాలకు కోర్సు డెరైక్టర్ డా. మహేష్ చందర్‌ను సంప్రదించవచ్చు.
+915812302391(O) Fax No. +915812303284
Email: mahesh64@email.com