
సాక్షి, విజయవాడ : కేఎల్ యూనివర్సిటీ.. ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ హోదాను కోల్పోయిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎల్ఎస్ఎస్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో వస్తోన్న ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రచారంపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. '40 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య అందిస్తున్నాం. విద్యా రంగంలో కేఎల్ యూనివర్సిటీ కనబరుస్తున్న ప్రతిభ వల్ల మా విద్యా సంస్థ డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదాను పొందింది. యూజీసీ, ఎంహెచ్ఆర్డీ నిబంధనలకు అనుగుణంగానే మా యూనివర్సిటీలో ప్రవేశాలు, విద్యా బోధన, పరిశోధనలు జరుగుతాయి' అని వీసీ వెల్లడించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment