న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ముందస్తు అనుమతి లేనిదే దూర విద్యా కోర్సులు కొనసాగించొద్దని సుప్రీంకోర్టు అన్ని డీమ్డ్ యూనివర్సిటీలను ఆదేశించింది. అలాగే 4 డీమ్డ్ యూనివర్సిటీలకు గడిచిన కాలం నుంచి అమల్లోకి వచ్చేలా అనుమతులివ్వడంపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్రానికి సూచించింది.
2001–05 మధ్య కాలంలో రాజస్తాన్‌లోని జేఆర్‌ఎన్ రాజస్తాన్ విద్యాపీఠ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్(ఐఏఎస్‌ఈ), అలహాబాద్ అగ్రికల్చరల్ ఇనిస్టిట్యూట్(ఏఏఐ), తమిళనాడులోని వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే ఆ నాలుగు డీమ్డ్ యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్ చేసిన విద్యార్థుల పట్టాలను నిలిపివేయాలని సూచించింది. ఈ వర్సిటీలకు యూజీసీ ఇచ్చిన అనుమతులు చెల్లవని స్పష్టం చేసింది. ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఏఐసీటీఈని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment