Distance learning courses
-
డీమ్డ్ వర్సిటీలపై ‘సుప్రీం’ కొరడా!
న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ముందస్తు అనుమతి లేనిదే దూర విద్యా కోర్సులు కొనసాగించొద్దని సుప్రీంకోర్టు అన్ని డీమ్డ్ యూనివర్సిటీలను ఆదేశించింది. అలాగే 4 డీమ్డ్ యూనివర్సిటీలకు గడిచిన కాలం నుంచి అమల్లోకి వచ్చేలా అనుమతులివ్వడంపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్రానికి సూచించింది. 2001–05 మధ్య కాలంలో రాజస్తాన్లోని జేఆర్ఎన్ రాజస్తాన్ విద్యాపీఠ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్(ఐఏఎస్ఈ), అలహాబాద్ అగ్రికల్చరల్ ఇనిస్టిట్యూట్(ఏఏఐ), తమిళనాడులోని వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే ఆ నాలుగు డీమ్డ్ యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్ చేసిన విద్యార్థుల పట్టాలను నిలిపివేయాలని సూచించింది. ఈ వర్సిటీలకు యూజీసీ ఇచ్చిన అనుమతులు చెల్లవని స్పష్టం చేసింది. ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఏఐసీటీఈని ఆదేశించింది. -
నాగార్జున వర్సిటీలో దూరవిద్య కోర్సులు
హైదరాబాద్ : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ దూరవిద్యా కేంద్రం ద్వారా బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కో-ఆర్టినేటర్ వై జయపాల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మే 2017లో జరిగే వార్షిక పరీక్షలు రాయదలిచిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంఏ, ఎంబీఏ, బీయస్సీ, బీకామ్, బీఏ, బ్యాచ్లర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరదల్చిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 98491 44925, 99599 74064 నెంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.