మథుర ఘర్షణలపై సీబీఐ విచారణకు సుప్రీం నో | Supreme court refuses to order CBI probe into Mathura violence | Sakshi
Sakshi News home page

మథుర ఘర్షణలపై సీబీఐ విచారణకు సుప్రీం నో

Published Tue, Jun 7 2016 12:58 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

Supreme court refuses to order CBI probe into Mathura violence

న్యూఢిల్లీ : మథురలో జరిగిన ఘర్షణలపై సీబీఐతో విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఉత్తరప్రదేశ్ మథురలోని జవహర్‌బాగ్ లో గురువారం అక్రమ కట్టడాల కూల్చివేత సందర్భంగా జరిగిన హింసాకాండలో 29మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 3000 మంది ఆక్రమణదారులపై 45 కేసులు నమోదు చేశారు.

మథురలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టు నేతృత్వంలో విచారణ జరిపించాలని కోరుతూ  పిటిషన్ దాఖలైంది. అశ్విని ఉపాధ్యాయ అనే న్యాయవాది ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు ... యూపీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. మరోవైపు విపక్షాలు కూడా ఈ హింసాత్మక ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement