అనంతపురం:పుటపర్తి సత్యసాయిబాబా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సత్యసాయి ట్రస్ట్ వార్షిక నివేదికను కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా విడుదల చేయగా, రూ.80 కోట్లతో చేపట్టిన సత్యసాయి తాగునీటి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చినరాజప్ప ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 128 గ్రామాలకు మంచి నీరు సరఫరా కానుంది. శనివారం సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 33వ స్నాతకోత్సవాన్నిపుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కన్నుల పండువగా నిర్వహించారు.
సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, భక్తులు శ్వేత వస్త్రధారులై.. వేడుకల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ ముఖ్యఅతిథిగా హాజరై.. విద్యార్థులనుద్దేశించి ఉపన్యసించారు.