న్యూఢిల్లీ: దేశంలో వరుసగా అయిదో రోజూ పెట్రోల్ ధరలు పెరిగాయి. శనివారం పెట్రోల్ ధర లీటరుకు 30 పైసలు, డీజిల్ ధర 36 పైసలు పెరిగింది. దీంతో ముంబైలో పెట్రోల్ ధర రూ. 94.93కి చేరువకాగా, డీజిల్ ధర రూ. 85.70కి చేరుకుంది. ఢిల్లీలో పెట్రోల్ ధర జీవితకాల గరిష్టానికి రూ. 88.414కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 78.74కు చేరకుంది. ఈ 5 రోజుల్లో పెట్రోల్ ధర రూ. 1.51 పెరగ్గా, డీజిల్ ధర రూ. 1.56 పెరిగింది. మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆయిల్ రేట్లను తగ్గించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని కోరగా, తగ్గించబోయేది లేదని ఆయిల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటు వేదికగా చెప్పిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment