20 బిలియన్ డాలర్ల ‘గ్యాస్’ పెట్టుబడులు!
• 5-7 ఏళ్లలో భారీగా క్షేత్రాల అభివృద్ధి
• పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: దేశంలోని గ్యాస్ క్షేత్రాల అభివృద్ధి కోసం వచ్చే 5-7 ఏళ్లలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రావొచ్చని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. దీని వల్ల గ్రీన్ ఫ్యూయెల్ వాడకం పెరుగుతుందని, రెట్టింపు ఇంధన వినియోగం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ గ్యాస్ క్షేత్రాల అన్వేషణ, రిలయన్‌స ఇండస్ట్రీస్-బీపీ జారుుంట్ వెంచర్ తూర్పు తీరం సహజ వాయువు అన్వేషణలో ప్రధానంగా ఈ పెట్టుబడులు ఉంటాయని తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన సీఐఐ గ్లోబల్ ఎనర్జీ కార్యక్రమంలో మాట్లాడారు.
కృష్టా గోదావరి బేసిన్ కేజీ-డిడబ్ల్యూఎన్-98/2 బ్లాక్ నుంచి ఒక రోజుకు 16 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువును బయటకు తీయడానికి 5.07 బిలియన్ డాలర్లను వెచ్చించడానికి సిద్ధమౌతోందని చెప్పారు. ఇక ఆర్‌ఐఎల్-బీపీ కూడా కేజీ-డీ6 బ్లాక్ పక్కన, ఒడిశా తీరంలో గ్యాస్ క్షేత్రాలను కలిగి ఉందన్నారు. 2022 నాటికి ముడిచమురు దిగుమతులను 10 శాతంమేర తగ్గించుకోవడానికి, ద్రవ ఇంధనానికి బదులు సహజ వాయువు వినియోగాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. దేశంలో గ్యాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.
దేశంలోని మొత్తం సహజ వాయువు వినియోగంలో పశ్చిమ, ఉత్తర ప్రాంతాల వాటా 80 శాతంగా ఉందన్నారు. దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో కూడా సహజ వాయువు వినియోగాన్ని పెంపొందిచడానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇరాన్ నుంచి భారత్‌కి సహజ వాయువును తీసుకురావడానికి 1,300 కిలోమీటర్ల సముద్రగర్భ పైప్‌లైన్ సర్వే పూర్తిరుు్యందని తెలిపారు. అలాగే ఇక టీఏపీఐ (టర్క్‌మెనిస్తాన్-ఆఫ్గనిస్తాన్-పాకిస్తాన్-ఇండియా) పైప్‌లైన్ కొనసాగుతోందని చెప్పారు.