Gas field development
-
20 బిలియన్ డాలర్ల ‘గ్యాస్’ పెట్టుబడులు!
• 5-7 ఏళ్లలో భారీగా క్షేత్రాల అభివృద్ధి • పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీ: దేశంలోని గ్యాస్ క్షేత్రాల అభివృద్ధి కోసం వచ్చే 5-7 ఏళ్లలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రావొచ్చని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. దీని వల్ల గ్రీన్ ఫ్యూయెల్ వాడకం పెరుగుతుందని, రెట్టింపు ఇంధన వినియోగం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ గ్యాస్ క్షేత్రాల అన్వేషణ, రిలయన్స ఇండస్ట్రీస్-బీపీ జారుుంట్ వెంచర్ తూర్పు తీరం సహజ వాయువు అన్వేషణలో ప్రధానంగా ఈ పెట్టుబడులు ఉంటాయని తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన సీఐఐ గ్లోబల్ ఎనర్జీ కార్యక్రమంలో మాట్లాడారు. కృష్టా గోదావరి బేసిన్ కేజీ-డిడబ్ల్యూఎన్-98/2 బ్లాక్ నుంచి ఒక రోజుకు 16 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువును బయటకు తీయడానికి 5.07 బిలియన్ డాలర్లను వెచ్చించడానికి సిద్ధమౌతోందని చెప్పారు. ఇక ఆర్ఐఎల్-బీపీ కూడా కేజీ-డీ6 బ్లాక్ పక్కన, ఒడిశా తీరంలో గ్యాస్ క్షేత్రాలను కలిగి ఉందన్నారు. 2022 నాటికి ముడిచమురు దిగుమతులను 10 శాతంమేర తగ్గించుకోవడానికి, ద్రవ ఇంధనానికి బదులు సహజ వాయువు వినియోగాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. దేశంలో గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. దేశంలోని మొత్తం సహజ వాయువు వినియోగంలో పశ్చిమ, ఉత్తర ప్రాంతాల వాటా 80 శాతంగా ఉందన్నారు. దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో కూడా సహజ వాయువు వినియోగాన్ని పెంపొందిచడానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇరాన్ నుంచి భారత్కి సహజ వాయువును తీసుకురావడానికి 1,300 కిలోమీటర్ల సముద్రగర్భ పైప్లైన్ సర్వే పూర్తిరుు్యందని తెలిపారు. అలాగే ఇక టీఏపీఐ (టర్క్మెనిస్తాన్-ఆఫ్గనిస్తాన్-పాకిస్తాన్-ఇండియా) పైప్లైన్ కొనసాగుతోందని చెప్పారు. -
వ్యాపార నిబంధనలు సరళం
కంపెనీల చట్టానికి మరోసారి సవరణలు... కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర... న్యూఢిల్లీ : భారత్లో వ్యాపార కార్యకలాపాలను మరింత సులువు చేసేవిధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా కంపెనీల చట్టం-2013లో సవరణ ప్రతిపాదనలకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) బుదవారం ఆమోదం తెలిపింది. దేశంలో కొత్తగా ఏదైనా కంపెనీ లేదా సంస్థ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు లేదా రుణ సమీకరణకు ముందు తప్పనిసరిగా ప్రభుత్వానికి డిక్లరేషన్ను సమర్పించాలన్న నిబంధనను కంపెనీల చట్టం నుంచి తొలగించాలన్నది తాజా సవరణల్లో ప్రధానమైనది. కాగా, మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక కంపెనీల చట్టంలో రెండోసారి సవరణ జరుగుతుండటం గమనార్హం. అదేవిధంగా ఈ చట్టంలోని నిబంధనల నుంచి మినహాయింపులు లేదా మార్పుచేర్పులకు సంబంధించి తుది ఉత్తర్వులను వేగవంతం చేసేందుకు వీలుకల్పించే ప్రతిపాదనలు కూడా కొత్త సవరణల్లో ఉన్నాయి. కేబినెట్ ఆమోదించిన ఈ ప్రతిపాదనలను కంపెనీల చట్టం(సవరణ) బిల్లు-2014లో చేర్చనున్నారు. దీనికి గతేడాది డిసెంబర్లో లోక్సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం వ్యాపారాలకు అత్యంత అనువైన దేశాల్లో భారత్ 142వ స్థానంలో ఉందని.. దీన్ని టాప్-50 లోకి తీసుకురావడమే లక్ష్యంగా అనేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. గ్యాస్ క్షేత్రాల అభివృద్ధికి కొత్త పాలసీ... సహజవాయువు నిక్షేపాల వెలికితీత, క్షేత్రాల అభివృద్ధి విషయంలో కంపెనీలకు వెసులుబాటు కల్పించేందుకు ఉద్దేశించిన కొత్త పాలసీకి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనివల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీలకు చెందిన 12 సమస్యాత్మక గ్యాస్ క్షేత్రాల(కేజీ-డీ6 సహా) అభివృద్ధికి మార్గం సుగమం కానుంది. ఈ క్షేత్రాల్లో నిక్షేపాల విలువ ప్రస్తుత ధరల ప్రకారం దాదాపు రూ. లక్ష కోట్లుగా అంచనా. కంపెనీలు తమ వద్దనున్న క్షేత్రాలను సొంత రిస్కులతో అభివృద్ధి చేసుకోవడానికి కొత్త పాలసీ అనుమతిస్తుంది. అదేవిధంగా నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) నిర్దేశించినట్లుగా క్షేత్రాల అభివృద్ధికి ముందు నిక్షేపాల ధ్రువీకరణ పరీక్షలన్నీ చేసి.. ఆ తర్వాత అందుకయ్యే మొత్తం వ్యయాన్ని ఆదాయాల నుంచి వెనక్కితీసుకోవడానికి వీలయ్యే ఆప్షన్ను కూడా పాలసీ కల్పిస్తుంది. డీజీహెచ్ క్లియరెన్సులు లేక నిలిచిపోయిన 12 గ్యాస్ క్షేత్రాల్లో ఆరు రిలయన్స్వి కాగా, 5 ఓఎన్జీసీకి చెందినవి.