ఇంఫాల్: మణిపూర్‌లో వలసదారుల సమస్యను పరిష్కరించాలంటే 'సర్జికల్ స్ట్రైక్ట్' చేయాల్సిందేనని నేషనల్ పీపుల్ పార్టీ నాయకుడు ఎమ్ రామేశ్వర్ సింగ్ వివాదాస్పదంగా మాట్లాడారు. అక్రమంగా వలసదారులు, ఉగ్రవాదులను అణిచివేయడానికి కఠిన చర్యలు చేపట్టాలని ఈ మేరకు స్పందించారు. ప్రస్తుతం ఎన్‌పీపీ బీజేపీతో కలిసి మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పరించింది.
'మణిపూర్‌కు కొంతమంది కుకీ ఉగ్రవాదులు సరిహద్దు దాటి వస్తున్నారని హోం మంత్రి చెబుతున్నారు. నేను ఎప్పటినుంచే చెబుతున్నా..ఈ అల్లర్లు బయటి నుంచి ప్రేరణకు గురువుతున్నాయని.. ఈ విషయంలో జాతీయ భద్రత కూడా రాజీపడుతోంది. దేశాన్ని రక్షించుకోవాలి ఒక్క మణిపూర్‌నే కాదు. ఒక్కసారి సర్జికల్ స్ట్రైక్ చేస్తే సమస్య పరిష్కారం అవుతోంది.' అని ఆయన అన్నారు.
'కుకీ ప్రజలు క్యాంపుల్లో ఉన్నారు. వారి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని కొన్ని ఏజెన్సీలు చెబుతున్నాయి. మరి ఇదే వాస్తవం అయితే.. ఇప్పుడు ఫైరింగ్ ఎక్కడి నుంచి వస్తోంది. వారికి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.' అని రామేశ్వర్ సింగ్
అన్నారు.
మయన్మార్ నుంచి వలస వచ్చిన కుకీ ప్రజల బయోమెట్రిక్‌లను మణిపూర్ ప్రభుత్వం గత నెలలోనే తీసుకుంది. దాదాపు 700 మంది అక్రమ వలసదారులు రాష్ట్రంలోకి చొరబడ్డారని పుకార్ల రావడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మణిపూర్‌లో మే3 న అల్లర్లు ప్రారంభమయ్యాయి. కుకీ, మైతీ వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి.
ఇదీ చదవండి: నూహ్ అల్లర్లు: ప్రముఖ టీవీ ఛానల్ ఎడిటర్ అరెస్టు..
Comments
Please login to add a commentAdd a comment