Solve problems
-
'మణిపూర్ సమస్యకు సర్జికల్ స్ట్రైక్ ఒక్కటే మార్గం..'
ఇంఫాల్: మణిపూర్‌లో వలసదారుల సమస్యను పరిష్కరించాలంటే 'సర్జికల్ స్ట్రైక్ట్' చేయాల్సిందేనని నేషనల్ పీపుల్ పార్టీ నాయకుడు ఎమ్ రామేశ్వర్ సింగ్ వివాదాస్పదంగా మాట్లాడారు. అక్రమంగా వలసదారులు, ఉగ్రవాదులను అణిచివేయడానికి కఠిన చర్యలు చేపట్టాలని ఈ మేరకు స్పందించారు. ప్రస్తుతం ఎన్పీపీ బీజేపీతో కలిసి మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పరించింది. 'మణిపూర్‌కు కొంతమంది కుకీ ఉగ్రవాదులు సరిహద్దు దాటి వస్తున్నారని హోం మంత్రి చెబుతున్నారు. నేను ఎప్పటినుంచే చెబుతున్నా..ఈ అల్లర్లు బయటి నుంచి ప్రేరణకు గురువుతున్నాయని.. ఈ విషయంలో జాతీయ భద్రత కూడా రాజీపడుతోంది. దేశాన్ని రక్షించుకోవాలి ఒక్క మణిపూర్‌నే కాదు. ఒక్కసారి సర్జికల్ స్ట్రైక్ చేస్తే సమస్య పరిష్కారం అవుతోంది.' అని ఆయన అన్నారు. 'కుకీ ప్రజలు క్యాంపుల్లో ఉన్నారు. వారి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని కొన్ని ఏజెన్సీలు చెబుతున్నాయి. మరి ఇదే వాస్తవం అయితే.. ఇప్పుడు ఫైరింగ్ ఎక్కడి నుంచి వస్తోంది. వారికి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.' అని రామేశ్వర్ సింగ్ అన్నారు. మయన్మార్ నుంచి వలస వచ్చిన కుకీ ప్రజల బయోమెట్రిక్‌లను మణిపూర్ ప్రభుత్వం గత నెలలోనే తీసుకుంది. దాదాపు 700 మంది అక్రమ వలసదారులు రాష్ట్రంలోకి చొరబడ్డారని పుకార్ల రావడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మణిపూర్‌లో మే3 న అల్లర్లు ప్రారంభమయ్యాయి. కుకీ, మైతీ వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. ఇదీ చదవండి: నూహ్ అల్లర్లు: ప్రముఖ టీవీ ఛానల్ ఎడిటర్ అరెస్టు.. -
‘గాంధీ’ ఫైల్స్ గంటల్లో క్లియర్
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): తెలంగాణ వైద్యప్రదాయిని సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి నిరుపేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తానని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. శనివారం గాంధీఆస్పత్రిని సందర్శించిన ఆయన సుమారు రెండు గంటల పాటు కలియతిరిగి దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. వైద్యులు, రోగులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా వీక్షించారు. ►డ్రైనేజీ, ఫైర్‌ఫైటింగ్ సిస్టం, వాటర్ లీకింగ్తోపాటు ప్రధానమైన సమస్యలను సూపరింటెండెంట్ రాజారావు ఆయనకు వివరించారు. ►డ్రైనేజీ పైప్లైన్లు పాడైపోవడంతో మురుగునీరు ఆస్పత్రి సెల్లార్‌ను ముంచెత్తుతుందని, సెల్లార్లో డైట్ క్యాంటిన్, మెడికల్ ఫార్మసీ, దోబీఘా ట్, ఫిజియోథెరపీ తదితర సేవలు అందిస్తున్నామని డాక్టర్ రాజారావు వివరించారు. ►భవన సముదాయం నిర్మించి 18 ఏళ్లు కావడం తో లీకేజీలతో తరుచు విద్యుత్ షార్ట్సర్యూ్కట్ జరిగి విలువైన వైద్యపరికరాలు మరమ్మత్తులకు గురవుతున్నాయని, గోడలు, పైకప్పులు పెచ్చు లు ఊడి పురాతనభవనాన్ని తలపిస్తుందన్నారు. ►ఫైర్‌ఫైటింగ్ సిస్టం కోసం దశాబ్ధకాలంగా ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నామని, సీసీ కెమెరాల నిర్వహణ ఫైల్ పెండింగ్‌లో ఉందని, ఆస్పత్రి ప్రాంగణంలోని సుమారు 10 దుకాణాలు ప్రైవేటువ్యక్తుల చేతుల్లో ఉన్నాయని, కోర్టును ఆశ్రయించి ఇబ్బంది పెడుతున్నారని. సుమారు రూ.3 కోట్లు బకాయిలు ఉన్నాయని, ఆస్పత్రి తరుపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)ని నియమిస్తే కోర్టు వాజ్యాలు పరిష్కారం అవుతాయని కోరారు. ►సుమారు 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, రోజుకు 39 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ వినియోగంతోపాటు 650 వెంటిలేటర్ పడకలు కలిగిన గాంధీ భవన సముదాయంలో శానిటేషన్, సె క్యూరిటీ, పేషెంట్ కేర్ టేకర్ సిబ్బందిని మరిం త పెంచాల్సిన అవసరం ఉందని వివరించారు. సంబంధిత ఫైల్స్ తీసుకుని తన వద్దకు వస్తే తన పరిధిలో ఉన్న సమస్యలను గంటల వ్యవధిలో పరిష్కరిస్తారనని, మరికొన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెల్తానని కలెక్టర్ శర్మన్ అన్నారు. వైద్యసేవలపై ఆరా... పలు విభాగాల్లోని వార్డులను సందర్శించిన కలెక్టర్ శర్మన్ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రి సెల్లార్, డ్రైనేజీ వ్యవస్థ, పంప్‌హౌస్, ఆక్సిజన్ ప్లాంట్స్, డైట్ క్యాంటీన్లను పరిశీలించారు. బ్లాక్ ఫంగస్, కోవిడ్ వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ శర్మన్ కోవిడ్ యాంటిజెన్ ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లతోపాటు సీటీ స్కానింగ్ చేయించుకున్నారు. నిర్ధారణ పరీక్షల్లో కోవిడ్ నెగిటివ్ వచ్చింది. కార్యక్రమంలో డిప్యూటీలు నర్సింహారావునేత, శోభన్‌బాబు, నోడల్ అధికారి ప్రభాకర్‌రెడ్డి, ఆర్ఎంఓ–1 నరేందర్‌కుమార్, ఆఫీస్, నర్సింగ్ సూపరింటెండెంట్లు విజయ్‌భాస్కర్, మంగమ్మలతోపాటు వైద్యులు, సిబ్బంది, టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు పాల్గొన్నారు. -
బరువు భారాన్ని తగ్గించింది... ఐడియా
దండేపల్లి(మంచిర్యాల) : ఒక్క ఐడియా అతని బరువు భారాన్ని తగ్గించింది. సాధారణంగా తడుకల్ని అమ్మేవారు నెత్తిన ఎత్తుకుని తిరుగుతుంటారు. కానీ ఓ వృద్దుడు తన నెత్తి భారాన్ని తగ్గించేందుకు ఓ ఆలోచన చేశాడు. తడకల్ని నెత్తిన మోస్తూ ఇబ్బంది పడకుండా సైకిల్‌కు ఒక కర్రను అమర్చాడు. కర్రకు తడకల్ని సపోర్ట్‌గా పెట్టి వెనకా ముందు తాళ్లతో కట్టి మద్యలో నిలబడి సైకిల్‌ను తోసుకుంటూ వెళ్లాడు. దీంతో అతడు నెత్తితో మోయాల్సిన బరువును సైకిల్‌తో మోస్తూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని దండేపల్లి సమీపంలో సాక్షి క్లిక్‌మనిపించింది. -
రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
భైంసారూరల్: రైతు సమస్యలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి వాటిని పరిష్కరించేందుకు కృషిచేస్తామని టీజేఏసీ నిర్మల్ జిల్లా చైర్మన్ ఆరెపల్లి విజయ్‌కుమార్ అన్నారు. గురువారం టీజేఏసీ జిల్లా కన్వీనర్ డా.ముష్కం రామకృష్ణాగౌడ్తో కలిసి తిమ్మాపూర్ గ్రామంలో రైతుల వద్దకు వెళ్లారు. రైతులు పడుతున్న ఇబ్బందులు, బాధలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సాధించాక కూడా రైతుల సమస్యలు తీరడం లేదన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం చేసేందుకు క్షేత్రస్థాయిలో వెళ్లి వారితో కలిసి సాదక బాధకాలు అడిగి తెలుసుకుంటున్నామన్నారు. ఈనెల 21న రైతు సదస్సు ఏర్పాటు చేస్తున్నామని, సదస్సులో నియోజకవర్గ రైతులంతా పాల్గొని సమస్యలపై చర్చించాలన్నారు. ప్రధాన సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీవీవీ జిల్లా కార్యదర్శి చాకెటి లస్మన్న, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరాజు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జే.రాజు, జేఏసీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
సమస్య పరిష్కారానికి ఏడుగురు సభ్యుల కమిటీ
సాక్షి, ఢిల్లీ: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశం ముగిసింది. జడ్జీలతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించేందుకు ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎంఓపిని త్వరగా ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తెలిపారు. అయితే ఇది ప్రజల ముందు పెట్టేంత పెద్ద సమస్య కాదన్నారు. రాహుల్ గాంధీ సహా రాజకీయ పార్టీలకు న్యాయవ్యవస్థపై మాట్లాడే అవకాశం ఇవ్వడం బాధాకరమని అంటూ ఈ అంశాన్ని పార్టీలు రాజకీయం చేయొద్దని సూచించారు. సుప్రీంకోర్టు అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోమన్న ప్రధాని, న్యాయశాఖ మంత్రి వైఖరిని స్వాగతిస్తున్నామన్నారు. -
రైతు సమస్యలపై ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేయాలి
– కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి వెల్దండ: టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వెల్దండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను, రైతుకూలీలను, వ్యవసాయ అనుబంధ సంస్థలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే వారి సమస్యలపై చర్చించడానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హమీలను తుంగలో తొక్కిందన్నారు. రైతుల రుణాలు రెండు విడతలో మాఫీ చేసి చేతులు దులిపేసుకుందన్నారు. కాంగ్రెస్ రైతులకు అండగా ఉండి పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు కడారి కష్ణయ్య, మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షుడు నారాయణ, కిసాన్‌సెల్ మండల అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి, తిర్పతిరెడ్డి, మోతిలాల్, సర్పంచ్ ముత్యాలు, యూత్‌కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌యాదవ్, శేఖర్, నాయకులు యాదగిరి, పుల్లయ్య, జంగయ్య, రాజు తదితరులు ఉన్నారు. -
1న విద్యాసంస్థల బంద్
ఏలూరు సిటీ : విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో వచ్చేనెల 1న విద్యాసంస్థల బంద్ చేపట్టనున్నట్టు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంపన రవికుమార్ తెలిపారు. స్థానిక ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో బుధవారం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.క్రాంతిబాబు, వి.మహేష్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లను మూసివేయాలనే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలలు, వసతి గృహాలను మూసివేయడం అన్యాయమన్నారు. ప్రై వేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం నియంత్రించలేకపోతుందన్నారు. విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ విద్య వ్యాపారులకు వత్తాసు పలుకుతుందని ధ్వజమెత్తారు. ఇంజినీరింగ్ ఫీజులను మాత్రం భారీగా పెంచిన ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచేందుకు ఆసక్తి చూపకపోవటం దారుణమన్నారు. బంద్‌లో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌వో సంఘాలు సంయుక్తంగా ఐక్యకార్యాచరణకు పిలుపునిచ్చాయన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ బంద్‌కు ప్రై వేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలు సహకరించాలని కోరారు. జిల్లావ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా నాయకులు పిల్లి తులసి, కె.అనిల్, పి.సాయికృష్ణ, మోకా శివరాజు తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుడి కష్టాలు ఆర్టీఐ తీర్చేనా?
సమాచార హక్కు చట్టం ఫైల్ పోయిందన్న కారణంగా సమాచారం ఇవ్వకుండా ఉండవచ్చని ఎక్కడా చెప్పలేదు. అలాగే.. కంపెనీని మరో రాష్ట్రానికి మార్చినంత మాత్రాన కంపెనీ యజమాని కార్మికుడికి బాకీ చెల్లించే బాధ్యతను తప్పించుకోలేడు. తనకు రావలసిన జీతం, భత్యం, పింఛను బకాయిల కోసం కార్మికుడు.. కార్మిక న్యాయస్థానంలో ఏళ్లతరబడి తన హక్కును నిరూపించు కోవాలి. యాజమాన్యం చెల్లించి తీరాలని అవార్డు సాధించిన తరువాత కూడా కార్మికుడి కష్టాలు ముగియ వు. లేబర్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు ప్రకారం యాజ మాన్యం నుంచి డబ్బు వసూలు చేసే అధికారం రెవె న్యూ శాఖకు ఉంది. అవినీతి లంచగొండితనం వల్ల యాజమాన్యాలు బకాయిలు ఇవ్వకుండా మాయ చేస్తున్నాయి. ఏళ్ల తరబడి అవార్డులు పెండింగ్‌లో ఉం టున్నాయి. ఒక కార్మికుడి బకాయిలు వసూలు చేసే విషయంలో అధికారుల పైన కార్మిక సంఘాలు ఒత్తిడి తేవడం అరుదైన సంఘటన. కార్మిక హక్కులు నీరు గారిపోతున్న ఈ రోజుల్లో తమ అధికారాన్ని విని యోగించి పేద కార్మికుడి బాకీ వసూలు చేసే అధికా రులు ఉన్నారా? ఢిల్లీలో కార్మికులు ఎందరో తమ అవార్డులను ఎందుకు అమలు చేయడంలేదని, యాజ మాన్యాల నుంచి ఎప్పుడు డబ్బు వసూలు చేసి ఇస్తా రని ఆర్టీఐ కింద నిలదీసి అడుగుతున్నారు. సమాచా రం ఇవ్వడం కోసం రెవెన్యూ అధికారులు కొంత పని చేయక తప్పడం లేదు. సమాచార హక్కు లభించిన తొలి దశాబ్దిలో ఇదొక ముందడుగు. ఒక ఫ్యాక్టరీ కార్మికుడు మహిందర్ పాల్ సింగ్ 2013 ఏప్రిల్ 16న కల్కాజీ రెవెన్యూ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ముందు, తనకు మైక్రోనిక్స్ ఇండియా అనే కంపెనీ 58 వేల 153 రూపాయలు ఇవ్వాలని కార్మిక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ఆర్టీఐ కింద అడిగాడు. అవార్డు అమ లుపై పూర్తి సమాచారం కోరాడు. ప్రజాసమాచార అధి కారి జవాబు ఇచ్చాడే గాని సమాచారం ఇవ్వలేదు. ఈ కార్మికుడికి మరో కంపెనీ (కాంపారి ఎక్స్ పోర్ట్స్ తుగ్లకాబాద్, ఢిల్లీ) కూడా 50 వేల రూపాయల వరకు బాకీ ఉంది. దానిపైన కేసు వేసి అవార్డు సాధిం చాడు. కాని దాని అమలు పరిస్థితి కూడా అదే పెం డింగ్ దశలో ఉంది. అధికారి ఇచ్చిన సమాచారం పూర్తిగా లేకపోవ డం వల్ల సీనియర్ అధికారి ముందు మొదటి అప్పీలు దాఖలు చేయక తప్పలేదు. అక్కడా సమాచారం రాక పోవడంతో సమాచార కమిషన్ ముందు రెండు కేసు ల్లోనూ రెండో అప్పీలు చేసుకున్నాడు. కార్మికుడికి ఇవ్వ వలసిన 58,153 రూపాయలు ఇవ్వకుండా ఉండేం దుకు ఢిల్లీ హైకోర్ట్టులో యాజమాన్యం వేసిన రిట్ పిటిషన్‌ను 2010లో కొట్టివేసినా ఇంతవరకూ వారి నుంచి డబ్బు వసూలు చేసి అధికారులు కార్మికుడికి ఇప్పించలేకపోయారు. లేబర్ కోర్టు తీర్పు ఇచ్చి, రిట్ పిటిషన్ కొట్టివేసి అయిదేళ్లు గడిచినా కార్మికుడు ఇంకా తన జీతం బకాయిల కోసం ఎదురుచూస్తూనే ఉన్నా డు. రిట్ పిటిషన్ కొట్టి వేసిన తరవాత కంపెనీ యజ మాని ఢిల్లీలో దుకాణం మూసేసి హరియాణాలోని ఫరీదాబాద్‌కు మారిపోయాడు. ఈ దశలో సమాచార అధికారి కొత్త సాకు ముం దుకు తెచ్చాడు. అది అందరూ వాడే సాకు.. ఫైల్ పో యింది. కాగితాలు దొరకడం లేదు. సమాచార హక్కు చట్టం ఫైల్ పోయిందన్న కారణంగా సమాచారం ఇవ్వ కుండా ఉండవచ్చని ఎక్కడా చెప్పలేదు. ఊరికే దస్తా వేజు లేదనీ, కాగితాలు కనబడడం లేదనీ అంటే సరి పోదు. అవి ఇదివరకు ఎవరి దగ్గర ఉన్న రికార్డులు? వాటిని ఎవరికైనా అప్పగించాడా? చివరగా ఆ రికార్డు ఎక్కడ కనిపించింది? వాటిని వెతకడానికి ఏవైనా ప్రయత్నాలు చేశారా? ఆ ప్రయత్నాలు ఏమిటి? వాటి పత్రాలు ఇచ్చారా? నిర్లక్ష్యంగా పోగొట్ట్టుకుంటే అం దుకు బాధ్యులని ఎవరినైనా గుర్తించారా? ఇవన్నీ వివ రించకుండా ఫైల్ పోయిందంటే అంగీకరించే ప్రసక్తే లేదు. ఈ వివరాలన్నింటితో ప్రమాణ పత్రం దాఖలు చేయవలసి ఉంటుంది. నిజంగానే ఫైల్ దొరకకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారు? ఆ కాగితాల ప్రతు లు ఇంకా ఏ ఫైళ్లలోనైనా ఉంటే వాటిని సేకరించి తిరిగి ఫైల్‌ను రూపొందిస్తారా లేదా? ఆ పని ఎందుకు చేయ లేదు అని నిలదీసే అధికారం సమాచార కమిషనర్‌కు ఉంది. సమాచార అధికారి జవాబు ఇవ్వాల్సి ఉంటుం ది. కంపెనీని మరో రాష్ట్రానికి మార్చినంత మాత్రాన కంపెనీ యజమాని కార్మికుడికి బాకీ చెల్లించే బాధ్య తను తప్పించుకోలేడు. హరియాణాలో రెవెన్యూ అధి కారికి డబ్బు వసూలు చేసే బాధ్యతను అప్పగించక పోవడం అన్యాయం. ఈ కేసులో రికవరీ నోటీసు ఇవ్వడానికి వెళ్లిన బెయిలిఫ్ (కోర్టు అమీనా)కు లంచం ఇచ్చారని కార్మికుడి అనుమానం. బెయిలిఫ్ నోటీసు ఇవ్వడానికి వెళ్లినా తుగ్లకాబాద్‌లో కంపెనీ వారి కార్యాలయం కని పించలేదని అతనొక నివేదిక ఇచ్చినట్టు రికార్డ్డులో చేర్చారు. ఈ కంపెనీ కార్యాలయం తెలుసుకుందామ ని తాము అక్కడి పోలీస్ స్టేషన్‌కు వెళ్లామని, కాని అక్కడా ఏ సమాచారమూ దొరకలేదని మరొక కాగి తం ఫైల్లో చేర్చారు. దాంతో రికవరీ నిలిచిపోయింది. కార్మికుడికి డబ్బు ఎగవేసిన కంపెనీ వారి మరొక ఫ్యాక్టరీ అదే తుగ్లకాబాద్‌లో మరొక చోట పని చేస్త్తు న్నా బెయిలిఫ్ అక్కడికి వెళ్లడం లేదని, కంపెనీతో కుమ్మక్కయి బెయిలిఫ్ తప్పుడు నివేదిక ఇస్త్తున్నాడని కార్మికుడి ఆరోపణ. కార్మికుడు బెయిలిఫ్ పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు. కార్మికుడి బాకీ వసూలు కోసం ఏం చేశారో ప్రమాణ పత్రంలో వివ రించాలని సమాచార కమిషనర్‌గా నేను ప్రభుత్వ అధి కారికి ఆదేశాలు జారీ చేశాను. ఇటువంటి కేసులు ఇం కా ఎన్నో ఉన్నాయి. అవార్డులున్నా బాకీ వసూలు కాని కార్మికులు ఇంకెందరో? (మహిందర్ పాల్ సింగ్ వర్సెస్ ఎస్డీఎం కల్కా జీ ఢిల్లీ ప్రభుత్వం నంబర్ ఇఐఇ//2013/002184, 2186 అ కేసులో తీర్పు ఆధారంగా) (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) -
108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
హైదరాబాద్: 108 ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా జీవీకే యాజమాన్యం వారిపై దారుణంగా వ్యవహరిస్తుందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. గురువారం ఇందిరా పార్కు వద్ద 108 ఉద్యోగుల ధర్నాలో కోదండరాం మాట్లాడుతూ వీరి సమ్మెకు తెలంగాణ జేఏసీ మద్దతు ఇస్తుందన్నారు. ప్రభుత్వం స్పందించి జీవీకే యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. 108 ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎన్జీఓ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, 108 ఉద్యోగుల వేల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
ఆస్పత్రి సమస్యలు పరిష్కరించండి
మెయిన్‌రోడ్ (కాకినాడ), న్యూస్‌లైన్ :కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో శనివారం ఆస్పత్రి అభివృద్ధి సంఘ సమావేశం ఆస్పత్రి పీడియాట్రిక్ సమావేశపు హాల్లో కలెక్టర్ నీతూ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ వరకు జరిగిన పద్దులు, ఖర్చుల కు సంబంధించిన సొసైటీ ఆదాయ వివరాలను, వివిధ అభివృద్ధి పనులను ఆస్పత్రి సూపరింటెండెంట్ పి.వెంకటబుద్ద సభ్యులకు వివరించారు. రూ. 35,78,961 హెచ్‌డీఎస్ రాబడులు కాగా, రూ. 35,10,541 మేరకు జరిగిన ఖర్చులను వివరించారు.కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, పిఠాపురం ఎమ్మెల్యే వంగా గీత మాట్లాడుతూ ఆస్పత్రిలో ఉన్న 42 పేమెంట్ రూములను వినియోగంలోకి తేవాలని, కొత్తగా మంజూరైన మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్ కోసం స్థలం గుర్తించి వెంటనే నిర్మాణం పనులు చేపట్టాలని కోరారు. ఈ బ్లాక్‌ను విడిగా ప్రత్యేక స్థలంలో నిర్మించాలని కోరారు. ఇవీ సమస్యలు.. ఆస్పత్రికి చెందిన పలువురు ఉద్యోగులు ఆస్పత్రిలో ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. జిల్లా సమాచార చట్టం సలహా కమిటీ సభ్యులు గేదెల శ్రీనివాస్ మాట్లాడుతూ ఊపిరి తిత్తుల వార్డులు పాతబడటంతో ఆయా వార్డుల్లో మోకాలిలోతు వర్షపు నీరు నిలుస్తుందన్నారు. గతేడాది జరిగిన హెచ్‌డీఎస్ సమావేశంలో జి+8 బిల్డింగ్ నిర్మించడానికి అప్రూవల్ అయినా నేటికీ భవన నిర్మాణానికి సంబంధించిన నిధులు విడుదల కాలేదన్నా రు. అత్యవసర విభాగం వద్ద గతంలో నిర్వహించిన రక్త పరీక్షల గది మూసివేయడంతో వెంటనే రోగులకు రక్త పరీ క్షలు నిర్వహించడానికి వీలుకావడం లేదన్నారు. జీవో 3 అమలు చేయండి అనంతరం ఏపీ మెడికల్ వైద్య ఉద్యోగ సంఘం కార్యదర్శి, జిల్లా జేఎసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం, సొసైటీ సభ్యులు బొడ్డు వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కరించాలని, జీవో నంబర్ 3 విడుదలై మూడేళ్లు గడచినా నేటికీ అమలు చేయడం లేదన్నారు. ఖాళీగా ఉన్న ఎంఎన్‌వో, ఎఫ్ఎన్వో, రేడియో థెరపీ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, థియేటర్ అటెండెంట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. ఆస్పత్రికి చెందిన వివిధ విభాగాల హెచ్ఓడీలు, ఆర్ఎంసీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.మహాలక్ష్మి, రోటరీ ప్రతినిధి డాక్టర్ మూర్తి హాజరయ్యారు.