
సాక్షి, ఢిల్లీ: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశం ముగిసింది. జడ్జీలతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించేందుకు ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎంఓపిని త్వరగా ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తెలిపారు. అయితే ఇది ప్రజల ముందు పెట్టేంత పెద్ద సమస్య కాదన్నారు. రాహుల్ గాంధీ సహా రాజకీయ పార్టీలకు న్యాయవ్యవస్థపై మాట్లాడే అవకాశం ఇవ్వడం బాధాకరమని అంటూ ఈ అంశాన్ని పార్టీలు రాజకీయం చేయొద్దని సూచించారు. సుప్రీంకోర్టు అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోమన్న ప్రధాని, న్యాయశాఖ మంత్రి వైఖరిని స్వాగతిస్తున్నామన్నారు.