
దండేపల్లి(మంచిర్యాల) : ఒక్క ఐడియా అతని బరువు భారాన్ని తగ్గించింది. సాధారణంగా తడుకల్ని అమ్మేవారు నెత్తిన ఎత్తుకుని తిరుగుతుంటారు. కానీ ఓ వృద్దుడు తన నెత్తి భారాన్ని తగ్గించేందుకు ఓ ఆలోచన చేశాడు. తడకల్ని నెత్తిన మోస్తూ ఇబ్బంది పడకుండా సైకిల్‌కు ఒక కర్రను అమర్చాడు. కర్రకు తడకల్ని సపోర్ట్‌గా పెట్టి వెనకా ముందు తాళ్లతో కట్టి మద్యలో నిలబడి సైకిల్‌ను తోసుకుంటూ వెళ్లాడు. దీంతో అతడు నెత్తితో మోయాల్సిన బరువును సైకిల్‌తో మోస్తూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని దండేపల్లి సమీపంలో సాక్షి క్లిక్‌మనిపించింది.