life change
-
కొత్త సంవత్సరం..కొత్త ఆశలు, ఆశయాలు
సాధారణంగా కొత్త సంవత్సరం వస్తోంది అంటే ఎన్నో సంబరాలు. సంవత్సరంతో పాటు తమ జీవితాలలో కూడా మార్పు వస్తుందనే ఆశతో అందరిలోనూ ఉత్సాహం ఉరకలెత్తుతూ ఉంటుంది. ఎవరి పద్ధతులలో వారు వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఇళ్ళని, వీధులని, నగరాలని అలంకరిస్తారు. అలంకారాలు, దీపాలు, టపాకాయలు, కొత్తబట్టలు, మిఠాయిలు (ఎక్కువగా కేకు) పంచుకోవటాలు, విందులు, వినోదాలు, శుభాకాంక్షలు. అంటే రాబోయే కాలం ఆనంద దాయకంగా ఉండాలనే ఆకాంక్ష, ఉంటుందనే విశ్వాసం వ్యక్తం చేయటమే వీటిలోని అసలు అర్థం. మనిషి ఆలోచించటం మొదలుపెట్టినప్పటి నుండి లెక్కించటం కూడా ప్రారంభించాడు. ప్రకృతిలో వస్తున్న మార్పులని పరిశీలించి, తదనుగుణంగా ఉండటం కోసం కాలాన్ని కూడా గణించటం ప్రారంభించాడు. కాలగణనకి ప్రమాణం ప్రకృతిలో జరిగే పరిణామాలే. కొద్దికాలం జరిగిన తరవాత మళ్ళీ ఇంతకుముందు ఉన్నట్టే ప్రకృతి కనపడితే ఈ క్రమం ఏమిటి? అన్నది అర్థం చేసుకునే ప్రయత్నంలోనే మనిషి కాలాన్ని లెక్కపెట్టటం జరిగింది. లెక్కపెట్టటం ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు మొదలుపెట్టాలి. ఒక్కొక్క ప్రాంతం వారు వారికి అనుకూలంగా ఉన్న సమయం నుండి లెక్కపెట్టటం మొదలుపెట్టారు. కాలక్రమంలో దానిలో ఒక హేతుబద్ధతని అవలంబించారు. ప్రకృతి ఆహ్లాదకరంగా ఉండే సమయాన్ని కాలాన్ని లెక్కకట్టటానికి మొదలుగా తీసుకున్నారు. పాశ్చాత్యులకి ఆహ్లాదకరంగా ఉండే వసంతం (స్ప్రింగ్) మార్చ్, ఏప్రిల్ నెలలు. మార్చ్ 23 ని సంవత్సర మానానికి ఆదిగా పరిగణించేవారు. తరువాత నెల మధ్యలో ఎందుకని ఏప్రిల్ 1 ని సంవత్సరాదిగా జరుపుకునే వారు. కొన్ని రాజకీయ కారణాల వల్ల అది జనవరి 1 కి మారింది. మార్చ్ మొదటి నెల కనుక డిసెంబర్ 10 వ నెల, నవంబర్ 9 వ నెల, అక్టోబర్ 8 వ నెల, సెప్టెంబర్ 7 వ నెల అయ్యాయి. ఆ పేర్లే నెలల సంఖ్యని తెలియ చేస్తున్నాయి. ఈ కాలెండర్ ని గ్రెగేరియన్ కాలెండర్ అంటారు. అందరికీ తమ కాలెండర్ ఉన్నా, ఇప్పుడు ప్రపంచం అంతా ఈ కాలెండర్నే అనుసరిస్తోంది. ఈ కాలెండర్ ప్రకారం జనవరి ఒకటో తారీకుతో కొత్త సంవత్సరం మొదలు అవుతుంది. సౌరమానాన్ని అనుసరించి ఒక సంవత్సరంలో 365 1/3 రోజులు ఉంటాయి. అందుకని నాలుగు సంవత్సరాలకి ఒక మారు లీప్ ఇయర్ అని ఒక రోజు అధికంగా వస్తుంది. ఆ రోజు తక్కువ రోజులు ఉండే ఫిబ్రవరికి వెడుతుంది. అయితే ఆనందోత్సాహాలు ఎందుకు? ఇంతకాలం జీవితాన్ని ఆనందంగా గడిపినందుకు. ఆ విధంగా గడిపే అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు. సంవత్సరంలో మొదటి రోజు ఏ విధంగా గడిపితే సంవత్సరం అంతా అదేవిధంగా ఉంటుందని అందరి విశ్వాసం. రెండువేల ఇరవై నాలుగవ సంవత్సరం అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలని ఆనందాన్ని ఇతోధికంగా ఇవ్వాలని, ప్రపంచంలో శాంతి నెలకొనాలని ఒకరికొకరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుందాము. అనుభవజ్ఞులైన పెద్దలు చేసే సూచన ఏమంటే జరిగిపోయిన సంవత్సరంలో ఏం చేశాము అని సమీక్షించుకుని, గెలుపోటములని, మానావమానాలని, బేరీజు వేసుకుని, తమ లక్ష్యాలని, లక్ష్యసాధన మార్గాలని నిర్ధారించుకుని, పనికి రానివాటిని పక్కకి పెట్టి, అవసరమైన వాటిని చేపట్టటానికి నిర్ణయించుకో వలసిన సమయం ఇది అని. తమ ఆయుర్దాయంలో మరొక సంవత్సరం గడిచిపోయింది, చేయవలసిన పనులు త్వరగా చేయాలి అని తమని తాము హెచ్చరించుకోవాలి. అందుకే ఎంతోమంది ఒక చెడు అలవాటుని మానుతామనో, కొత్తపని ఏదైనా మొదలు పెడతామనో అని నూతన సంవత్సర నిర్ణయాలని ప్రకటిస్తూ ఉంటారు. – డా. ఎన్. అనంతలక్ష్మి -
ది గ్రూమింగ్ స్కూల్ కలలు నెరవేర్చే డిజిటల్ బడి
సాధారణ పల్లెల నుంచి పెద్దపట్టణాల వరకు ఎంతోమంది అమ్మాయిలకు ‘మిస్ ఇండియా’ మిస్ దివా’ కావాలనే లక్ష్యం ఉండవచ్చు. పక్కవారి నుంచి వెక్కిరింపులు కూడా ఎదురు కావచ్చు. ‘అది మనలాంటి వాళ్ల కోసం కాదు’ అంటూ అతిశయోక్తుల సమాచారం వెల్లువెత్తవచ్చు. ఈ గందరగోళాన్ని పక్కకు నెట్టి, స్పష్టత ఇవ్వడానికి, విజయం వైపు దారి చూపడానికి వచ్చిందే.. ది గ్రూమింగ్ స్కూల్. ‘అందంగా కనిపించాలనే ఆసక్తి మీలో ఉందా? ఆత్మవిశ్వాసం ఉందా? మీలోని శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేసుకోవాలనే ఉత్సాహం ఉందా?...‘అయితే ఈ లైఫ్ ఛేంజింగ్ స్కూల్ మీకోసమే’ అంటోంది మిస్ ఇండియా ఆర్గనైజేషన్(ముంబై). దశాబ్దాలుగా ఎంటర్ టైన్మెంట్, ఫ్యాషన్ ఇండస్ట్రీలో మంచి పేరున్న మిస్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎంఐవో) ఎంతోమంది యువతులు అందాల కిరీటాన్ని అందుకోవడంలో సహాయపడింది. ‘డూ–ఇట్–యువర్సెల్ఫ్’ అని నినదిస్తున్న ‘ఎంఐవో’ ఔత్సాహిక యువతుల కోసం ‘ది గ్రూమింగ్ స్కూల్’ ద్వారా వివిధ రంగాల నిపుణులతో వీడియో ట్యుటోరియల్స్ నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది. స్కిన్‌కేర్, హెయిర్‌కేర్, స్టైలింగ్, మేకప్, వ్యక్తిత్వ వికాసం, ఫ్యాషన్ స్టైలింగ్, సోషల్ మీడియా... మొదలైన వాటిలో నిపుణులు వీడియో తరగతులు నిర్వహిస్తారు. వారిలో కొందరు... అయేషా సేథ్ (మేకప్ ఆర్టిస్ట్), అలేషియా రౌత్(ర్యాంప్ వాకర్), సంజీవ్‌దత్తా (పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్), భరత్ గుప్తా (ఫ్యాషన్ స్టైలీస్ట్), డా.జార దాదీ (స్కిన్‌కేర్ కోచ్). యువతులను బ్యూటిఫుల్ అండ్ సక్సెస్‌ఫుల్‌గా నిలపడంలో వీరి పాఠాలు ఉపయోగపడతాయి. ఈ జెండర్–న్యూట్రల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకున్నవారికి నేర్చుకున్నంత నైపుణ్యం సొంతం అవుతుంది. ‘కల కనడం ఎంత ముఖ్యమో, ఆ కలను సాకారం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. తమ లక్ష్యాన్ని చేరుకోవాలనుకునేవారి కోసం, నిర్మాణాత్మకమైన పాఠాలతో ఒక బలమైన వేదికను ఏర్పాటు చేశాం’ అంటుంది మిస్ ఇండియా ఆర్గనైజేషన్. కోర్సు పూర్తయిన తరువాత అభ్యర్థులకు సంస్థ నుంచి సర్టిఫికెట్లు అందుతాయి. అంతకంటే ముఖ్యంగా ఆత్మబలం అపారంగా అందుతుంది! -
రూటు మార్చిన రితికాసింగ్
తమిళసినిమా: నటి రితికాసింగ్ రూటు మార్చేసింది. ఈ బ్యూటీ రియల్ లైఫ్‌లో బాక్సర్. అయితే ఆ క్రీడారంగంలో ఆసక్తి ఉన్నవారికి మాత్రమే తెలిసిన రితికాసింగ్‌ను మరింత మందికి పరిచయం చేసింది ఇరుదుచుట్రు చిత్రం. చాలా మందికి తెలియని మరో విషయం ఏమిటంటే బాక్సర్ కంటే ముందే యాక్టర్స్ అయ్యింది. అవును ఈ ముంబయి భామ 2002లోనే బాలనటిగా టార్జాన్ భేటీ అనే చిత్రంతో నటించింది. కథానాయకిగా సుధా కొంగర దర్శకత్వం వహించిన ఇరుదుచుట్రు చిత్రంతో కోలీవుడ్‌లో రంగప్రవేశం చేసింది. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. అదే చిత్రంతో బాలీవుడ్‌కు, ఆ తరువాత రీమేక్ చిత్రం గురుతో తెలుగుకు ఎంట్రీ ఇచ్చేసింది. ఆ చిత్రంలో చాలా సహజంగా చక్కని నటనను ప్రదర్శించిన ఈ బ్యూటీపై దక్షిణాది దృష్టి పడింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఆండవన్ కట్టళై, శివలింగ వంటి చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుంది. ఆ రెండూ సక్సెస్ అయ్యాయి. వాటితోనూ కుటుంబ కథా చిత్రాల నాయకిగా గుర్తింపు పొందింది. అయితే అదే రితికాసింగ్‌కు మైనస్ అయ్యిందేమో. అవకాశాలు కొరవడ్డాయి. దీంతో చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే గ్లామర్‌కు మారక తప్పలేదు. మడి కట్టుకుని కూర్చుంటే ఎవరూ పట్టించుకోరనుకుందో ఏమో. ఇటీవల అందాలను ఆరబోసే విధంగా ఫొటోసెషన్ చేయించుకున్న రితిక వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఆ ప్రయత్నం ఫలించినట్లుంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఒక అవకాశం తలుపు తట్టింది. నటుడు అరుణ్‌విజయ్‌కు జంటగా నటించనుంది. పాత్ర నచ్చితే హీరో, విలన్ అని చూడకుండా నటించడానికి రెడీ అంటున్న అరుణ్‌విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం తడం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం విజయ్‌సేతుపతికి జంటగా అగ్నిసిరగుగళ్ చిత్రంలోనూ,తెలుగులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో చిత్రంలో ముఖ్య పాత్రలోనూ నటిస్తున్న అరుణ్ విజయ్ తాజాగా బాక్సర్ అనే చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో రితికాసింగ్ ఆయనకు జంటగా నటించే అవకాశం దక్కించుకుంది. వివేక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బాక్సింగ్ ఇతి వృత్తంతో తెర కెక్కుతోందట. ఈ చిత్రంతోనైనా రితిక హీరోయిన్గా బిజీ అవుతుందేమో చూడాలి. ఈ అమ్మడు నటించిన వడంగాముడి చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. -
మోదీ ఐడియా.. సెటిలైన కాంగ్రెస్ నేత!
గాంధీనగర్, గుజరాత్ : ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పకోడాలు (పకోడీలు) అమ్ముకోవడం కూడా ఉద్యోగమే’ అన్న సంగతి తెలిసిందే. అయితే మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. కానీ నేడు మోదీ ఇచ్చిన ‘పకోడా ఐడియా’నే ఒక కాంగ్రెస్ కార్యకర్త జీవితాన్ని మార్చేసింది. వడోదరకు చెందిన నారాయణభాయ్ రాజ్‌పుత్ హిందీ లిటరేచర్‌లో పోస్టు గ్రాడ్యూయేట్. కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. ఎన్ఎస్యూఐలో కార్యకర్తగా చేరి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాడు. అయితే పీజీ చేసిన నారాయణభాయ్ నిరుద్యోగి. మోదీ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను అతడు కూడా చూశాడు. మోదీ చెప్పిన ‘పకోడా ఐడియా’ అతనికి బాగా నచ్చింది. పనిపాటా లేకుండా ఖాళీగా ఉండటం కంటే పకోడా బిజినెస్ చేయడం మంచిదని భావించాడు. తొలుత ఒక స్టాల్‌తో ప్రారంభమైన నారాయణభాయ్ పకోడా వ్యాపారం నేడు మొత్తం 35శాఖలుగా, వడోదర నగరమంతా విస్తరించింది. ఈ విషయం గురించి నారాయణభాయ్ ‘ప్రధాని ‘పకోడా బిజినెస్ ఐడియా’ విన్న తర్వాత నేను ఎందుకు ఆ మార్గంలో వెళ్లకూడదు అనుకున్నాను. నిరుద్యోగిగా ఉండటం కంటే పకోడా అమ్మి రోజుకు కనీసం 200 రూపాయలు సంపాదించడం మంచిదే కదా అనిపించింది. అందుకే ఒకసారి ప్రయత్నించి చుద్దామని భావించాను. మొదట 10 కేజీల పదార్థాలతో, 100 గ్రాముల పకోడా ఒక్కొక్కటిగా 10 రూపాయలుగా ఒక స్టాల్‌ను ప్రారంభించాను. నేడు నగరవ్యాప్తంగా నా పకోడా స్టాల్స్ 35 ఉన్నాయి. ప్రతిరోజు 500 - 600 కేజీల పకోడాలు అమ్ముతున్నాను’ అని తెలిపాడు. వ్యాపారం ప్రారంభించిన రెండు నెలల్లోనే నారాయణభాయ్ ‘పకోడా బిజినెస్’కు మంచి పేరు వచ్చింది. నారాయణభాయ్ రోజు ఉదయం 7 - 11 గంటల వరకూ అలానే సాయంత్రం కూడా ఇదే సమయంలో పకోడాను అమ్ముతుంటాడు. -
బరువు భారాన్ని తగ్గించింది... ఐడియా
దండేపల్లి(మంచిర్యాల) : ఒక్క ఐడియా అతని బరువు భారాన్ని తగ్గించింది. సాధారణంగా తడుకల్ని అమ్మేవారు నెత్తిన ఎత్తుకుని తిరుగుతుంటారు. కానీ ఓ వృద్దుడు తన నెత్తి భారాన్ని తగ్గించేందుకు ఓ ఆలోచన చేశాడు. తడకల్ని నెత్తిన మోస్తూ ఇబ్బంది పడకుండా సైకిల్‌కు ఒక కర్రను అమర్చాడు. కర్రకు తడకల్ని సపోర్ట్‌గా పెట్టి వెనకా ముందు తాళ్లతో కట్టి మద్యలో నిలబడి సైకిల్‌ను తోసుకుంటూ వెళ్లాడు. దీంతో అతడు నెత్తితో మోయాల్సిన బరువును సైకిల్‌తో మోస్తూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని దండేపల్లి సమీపంలో సాక్షి క్లిక్‌మనిపించింది. -
అమ్మ చేతిలో బొమ్మలా..
► జీవచ్ఛవాన్ని చేసిన రోడ్డు ప్రమాదం ► నాలుగేళ్లుగా మంచానికేపరిమితం ► అన్ని పనుల్లో అమ్మే సాయం ► భిక్షాటన చేసి కొడుకు కడుపు నింపుతున్న తల్లి ► ఆపన్నహస్తం కోసం ఎదురు చూపు నవమాసాలు మోసి, కని, పెంచి పెద్దచేసిన కొడుకు వృద్ధాప్యంలో తోడుంటాడని భావించిన ఆ తల్లి... జీవచ్ఛవంలా మంచానికే పరిమితమైన కొడుకు పరిస్థితిని చూసి కన్నీ రు మున్నీరవుతోంది. కదలలేని పరిస్థితిలో ఉన్న తన కుమారుడికి అన్నీ తానై సేవలందిస్తోంది. నిరుపేద కుటుంబం కావడంతో భిక్షాటన చేస్తూ కొడుకుకు బుక్కెడు ముద్ద పెడుతోంది. జీవించడానికి కనీసం ఇళ్లు కూడా లేని ఈ తల్లీ కొడుకులపై కథనం.. ఇల్లందకుంట: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన రసూల్‌భీ– షరిఫోద్దీన్ దంపతులది నిరుపేద కుటుంబం. వీరికి అంకుషావళి, రఫీ అనే ఇద్దరు కుమారులన్నారు.అంకుషావళి వివాహం అనంతరం అత్తవారింటివద్ద జీవనం సాగిస్తున్నాడు.ఇంతలోనే రసూల్‌భీ భర్త షరిఫోద్దీన్ మరణించాడు. చిన్న కొడుకు రఫీ హుజూరాబాద్‌లో తమలపాకులు అమ్ముతూ తల్లికి ఆసరాగా ఉండసాగాడు. 2008వ సంవత్సరంలో రఫీకి వివాహమైంది. 5 సంవత్సరాలు సాఫీగా సాగిన రఫీ జీవితాన్ని విధి పగపట్టింది. 2013వ సంవత్సరంలో ఇల్లందకుంట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రఫీ కాళ్లు, చేతులు, వెన్నెముక దెబ్బతిన్నాయి. దీంతో అవి చచ్చుబడి పోయాయి. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు. అయనకు సేవలు చేయాల్సి వస్తుందని భార్య సైతం అతడిని విడిచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తల్లే రఫీ బాగోగులు చూస్తోంది. కొడుకును బతికించుకోవడం కోసం ప్రతి రోజు భిక్షాటన చేస్తోంది. దాతలు సహకరిస్తే తన కుమారుడికి మెరుగైన వైద్యం చేయిస్తానని తల్లి రసూల్‌భీ కన్నీరు మున్నీరుగా విలపించింది.సాయం చేయాలనుకున్న వారు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 31604866407 కానీ 9863132461 సెల్‌కు సంప్రదించి చేయూతనందించాలని కోరుకుంటోంది. -
'రేప్ జరిగిన తర్వాత పూర్తిగా మారిపోయా'
లండన్: 19 ఏళ్ల వయసులో తాను అత్యాచారానికి గురైన తర్వాత, ఆ పీడకల తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని పాప్ స్టార్ లేడీ గాగా చెప్పింది. టీనేజ్‌లో తనపై అత్యాచారం జరిగిందని గతేడాది ఓ ఇంటర్వ్యూలో చెప్పిన లేడీ గాగా.. అప్పట్లో ఎంతో మానసికక్షోభ అనుభవించానని వెల్లడించింది. 'నాపై అఘాయిత్యం జరిగాక చాలా ఏళ్లపాటు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఈ విషయాన్ని ఎలా మరిచిపోవాలో.. ఎలా జీర్ణం చేసుకోవాలో అప్పట్లో అర్ధంకాలేదు. ఇందులో నా తప్పు ఉందా అన్న విషయం అర్థంకాలేదు. అయితే ఈ ఘటన నన్ను పూర్తిగా మార్చివేసింది. నా ఆలోచన విధానాన్ని మార్చింది. ఈ పీడకలను మర్చిపోయి మనోస్థయిర్యంతో ముందుకుసాగా' అని లేడీ గాగా చెప్పింది.