'రేప్ జరిగిన తర్వాత పూర్తిగా మారిపోయా' | I changed myself completely after rape: Lady Gaga | Sakshi
Sakshi News home page

'రేప్ జరిగిన తర్వాత పూర్తిగా మారిపోయా'

Published Mon, Dec 14 2015 9:51 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

'రేప్ జరిగిన తర్వాత పూర్తిగా మారిపోయా' - Sakshi

'రేప్ జరిగిన తర్వాత పూర్తిగా మారిపోయా'

లండన్: 19 ఏళ్ల వయసులో తాను అత్యాచారానికి గురైన తర్వాత, ఆ పీడకల తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని పాప్ స్టార్ లేడీ గాగా చెప్పింది. టీనేజ్లో తనపై అత్యాచారం జరిగిందని గతేడాది ఓ ఇంటర్వ్యూలో చెప్పిన లేడీ గాగా.. అప్పట్లో ఎంతో మానసికక్షోభ అనుభవించానని వెల్లడించింది.

'నాపై అఘాయిత్యం జరిగాక చాలా ఏళ్లపాటు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఈ విషయాన్ని ఎలా మరిచిపోవాలో.. ఎలా జీర్ణం చేసుకోవాలో అప్పట్లో అర్ధంకాలేదు. ఇందులో నా తప్పు ఉందా అన్న విషయం అర్థంకాలేదు. అయితే ఈ ఘటన నన్ను పూర్తిగా మార్చివేసింది. నా ఆలోచన విధానాన్ని మార్చింది. ఈ పీడకలను మర్చిపోయి మనోస్థయిర్యంతో ముందుకుసాగా' అని లేడీ గాగా చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement