lady gaga
-
మళ్లీ రానున్న 'జోకర్'.. అతనికి ప్రేయసిగా పాపులర్ సింగర్!
Lady Gaga As Harley Quinn In Joaquin Phoenix Joker 2: జోకర్.. 2008లో వచ్చిన సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ 'బ్యాట్‌మేన్: ది డార్క్ నైట్' సినిమాతో ఎంతో పాపులర్ అయ్యాడు. అందులో విలన్‌గా అలరించిన జోకర్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ పాత్రకున్న క్రేజ్ చూసిన దర్శకనిర్మాతలు 2019లో 'జోకర్' సినిమా తెరకెక్కించారు. జోక్విన్ ఫీనిక్స్ ప్రధాన పాత్రలో అలరించిన ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా 1.07 బిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. అంతేకాకుండా అనేక ఇంటర్నేషన్ల్ అవార్డులను కూడా అందుకుంది. ఈ మూవీలో జోకర్‌గా నటించిన జోక్విన్ ఫీనిక్స్కు ఉత్తమ నటుడిగా ఆస్కార్ రావడం విశేషం. అయితే ఈ జోకర్ మళ్లీ రానున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా 'జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్' తెరకెక్కుతోంది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన టాడ్ ఫిలిప్స్ ఈ సీక్వెల్‌ను డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాను 2024 అక్టోబర్ 4 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. అయితే 'జోకర్'కు పూర్తి భిన్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సీక్వెల్లో హార్లే క్విన్ అనే కీలక పాత్రలో అమెరికన్ పాపులర్ సింగర్ లేడీ గాగా అలరించనుంది. Joker: Folie à Deux 10.04.24 pic.twitter.com/obp7T9lBFL — Lady Gaga (@ladygaga) August 4, 2022 కాగా 2016లో వచ్చిన డిస్నీ సినిమాటిక్ ఎక్స్టెండ్ యూనివర్స్ (డీసీఈయూ) మూవీ 'సూసైడ్ స్క్వాడ్'లో హార్లే క్విన్‌గా మార్గోట్ రోబీ పరిచయమైంది. ఇందులో జోకర్‌కు ప్రేయసిగా హార్లే క్వీన్ పాత్ర ఉంటుంది. తర్వాత వచ్చిన డీసీ సిరీస్‌లోని బర్డ్స్ ఆఫ్ ప్రే, ది సూసైడ్ స్క్వాడ్ చిత్రాల్లో హార్లే క్వీన్‌గా మార్గోట్ రోబీ అదరగొట్టింది. మరీ ఇప్పుడు వస్తున్న సీక్వెల్ మూవీ 'జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్'లో లేడీ గాగాను జోకర్‌కు ప్రేయసిగా చూపిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
అత్యాచారం చేశాడు.. పిచ్చిదాన్నైపోయా!
లేడీ గాగా.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న సింగర్. హుషారుగా ఆడిపాడే ముప్ఫై ఐదేళ్ల ఈ అమెరికన్ సింగర్ ఒక డాక్యుమెంటరీ ఇంటర్వ్యూలో.. తన గతానికి సంబంధించి కొన్ని చేదు విషయాల్ని బయటపెట్టి కంటతడి పెట్టుకుంది. పంతొమ్మిదేళ్ల వయసులో తనను ఒక ప్రొడ్యూసర్ బలవంతం చేశాడని, ఆ వయసుకే తాను గర్భవతి అయ్యాయని ఆమె ఆ డాక్యుమెంటరీ ఇంటర్వ్యూలో పేర్కొంది. తన మ్యూజిక్ కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించి ఆ ప్రొడ్యూసర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. ఆ భయానక అనుభవాన్ని పంచుకుంటూ లేడీ గాగా ఏడ్చేసింది. అయితే గర్భవతి అయ్యానని తెలిశాక ఆ ప్రొడ్యూసర్ తనని వదిలేశాడని చెప్పింది. ఆ ఘటన తర్వాత తనను ఓ స్టూడియోలో బంధించారని, ఆ సమయంలో మానసికంగా ఎంతో కుంగిపోయానని లేడీ గాగా పేర్కొంది. తిరిగి మామూలు మనిషి కావడానికి రెండున్నరేళ్లు పట్టిందని ఆమె భావోద్వేగంతో మాట్లాడింది. ఆ చేదు అనుభవం నుంచి కోలుకోవడానికి తాను ఎంతో మధనపడ్డానని చెప్పిన లేడీ గాగా.. తన జీవితంలో వాటిని చీకటి రోజులుగా అభివర్ణించింది. అయితే ఆ ప్రొడ్యూసర్ పేరు చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు. మళ్లీ అతన్ని ఎదుర్కొవడం తనకు ఇష్టం లేదని ఆమె స్పష్టం చేసింది. యాపిట్ టీవీ ఫ్లస్ ఫ్లాట్ ఫామ్ వారి ‘ది మీ యూ కాంట్ సీ’ డాక్యుమెంటరీలో లేడీ గాగా ఈ సంచలన విషయాల్ని బయటపెట్టింది. శుక్రవారం ఆ డాక్యుమెంటరీ వీడియో రిలీజ్ అయ్యింది. కాగా, గాగా అసలు పేరు స్టెఫానీ గెర్మానొట్టా. -
లేడీ గాగా..జెన్నిఫర్ లోపెజ్..!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా ఈనెల 20వ తేదీన జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో జెన్నిఫర్ లోపెజ్, లేడీ గాగా వంటి పలువురు ప్రముఖ పాప్ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అమెరికాలో కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో ఉన్న నేపథ్యంలో అధ్యక్షుడిగా జో బైడెన్(78), ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్(56) వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనం వెస్ట్‌ఫ్రంట్‌లో జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చాలా కొద్ది మాత్రమే హాజరుకానున్నారు. పలు కార్యక్రమాలు వర్చువల్‌గానే ఉంటాయి. క్యాపిటల్ హిల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో 10వేల మంది నేషనల్ గార్డులను వాషింగ్టన్లో పహారాకు నియమించారు. ప్రమాణ స్వీకారం అనంతరం జరిగే పరేడ్ కూడా వర్చువల్‌గానే ఉంటుందని ప్రమాణ స్వీకార కమిటీ ప్రకటించింది. -
ఆన్లైన్లో కచేరి
సాధారణంగా కాన్సర్ట్ అంటే వేల మంది జనం, భారీ మ్యూజిక్, పెద్ద గ్రౌండ్లో ఏర్పాటు చేస్తారు. కానీ ఇవేమీ లేకుండా డిజిటల్ కాన్సర్ట్ (ఆన్ లైన్ లోనే కాన్సర్ట్)ను ప్లాన్ చేశారు హాలీవుడ్ సింగర్ లేడీ గాగా. ప్రస్తుతం కరోనా వైరస్‌తో ప్రపంచమంతా పోరాడుతోంది. ఈ పోరాటానికి స్ఫూర్తి నింపేందుకే ‘వన్ వరల్డ్: టుగెదర్ ఎట్ హోమ్’ పేరుతో ఈ డిజిటల్ కాన్సర్ట్ ఏర్పాటు చేశారు. ఎవరింట్లో వారు ఉండి ఆన్ లైన్లోనే ఈ సంగీత కచేరీని వీక్షించవచ్చు. ఏప్రిల్ 18న జరిగే ఈ కాన్సర్ట్ కరోనాపై పోరాటానికి ఫండ్ రైజింగ్ ఈవెంట్. ఈ ప్రోగ్రామ్‌లో హాలీవుడ్ టాప్ సింగర్స్ జెన్నీఫర్ లోపెజ్, ఆడమ్ లాంబెర్ట్, ఓప్రా విన్ ఫ్రె, టేలర్ స్విఫ్ట్ వంటి ప్రఖ్యాత సింగర్స్ పాల్గొననున్నారు. మన దేశం నుంచి షారుక్ ఖాన్, ప్రియాంకా చోప్రా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. లేడీ గాగా యాంకర్‌గా వ్యవహరించనున్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో మన కోసం ముందు వరుసలో పోరాడుతున్న ఆరోగ్య శాఖ వారికి గౌరవంగా ఈ కాన్సర్ట్‌లో నేను కూడా భాగం అవుతున్నాను’’ అని పేర్కొన్నారు షారుక్ ఖాన్. -
గాగాతో రాగాలు
బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీ లహరి మ్యూజిక్ డైరెక్టర్‌గా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ 50 ఏళ్లలో సుమారు 600 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. సుమారు 9000 పాటలను స్వరపరిచారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ పాప్‌స్టార్ లేడీ గాగాతో కలసి ఓ ఆల్బమ్ కోసం వర్క్ చేశారు బప్పీ లహరి. ఇందులోని రెండు పాటలను లేడీ గాగాతో కలసి ఆలపించారట బప్పీ లహరి. గాగా తన స్టయిల్లో ఇంగ్లీష్‌లో పాడితే, బప్పీ హిందీలో పాడారట. ఈ ఏడాది చివర్లో ఈ పాటలు విడుదల కానున్నాయని సమాచారం. ప్రస్తుతం ఈ పాటలను రికార్డ్ చేయడానికి లాస్ ఏంజెల్స్‌లో ఉన్నారు బప్పీలహరి. లేడీ గాగాతోనే కాకుండా ఇంటర్నేషనల్ సింగర్ ఆకాన్తో కూడా బప్పీ వర్క్ చేయనున్నారని సమాచారం. -
భారతీయ కట్టు.. భలే ఆకట్టు
హాలీవుడ్లో అవార్డ్స్ సీజన్ మొదలైంది. ఈ సీజన్‌కు శ్రీకారం చుట్టేది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. ప్రతి ఏడాది జనవరిలో ఈ వేడుక జరుగుతుంది. 76వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ సోమవారం ఉదయం (భారతకాలమాన ప్రకారం) జరిగింది. ఎన్నో విశేషాలతో పాటు పలు ఆశ్చర్యాలు కూడా ఈ వేడుకలో చోటు చేసుకున్నాయి. అన్ని అవార్డ్స్ చేజిక్కించుకుంటాయనుకున్న సినిమాలు ఉత్త చేతులతో వెళ్లడం, అంచనాలు లేకుండా వచ్చినవి ఉత్తమ చిత్రాలుగా మిగలడం, నటుడిగా క్రిస్టిన్ బేల్ తొలి అవార్డు దక్కించుకోవడం, ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంటుందనుకున్న ‘స్టార్ ఈజ్ బోర్న్’ చిత్రం కేవలం ఒక్క అవార్డ్‌తో సరిపెట్టుకోవడం, అంచనాలు లేని ‘గ్రీన్ బుక్’ సినిమా అనూహ్యంగా ఎక్కువ అవార్డ్స్ సంపాదించడం, సూపర్ హీరో (బ్లాక్ పాంథర్) సినిమా గ్లోబ్ అవార్డ్స్‌కు నామినేట్ అవ్వడం ఇదే తొలిసారి. పొడుగు గౌన్లతో రెడ్ కార్పెట్ మీద వయ్యారంగా కొందరు తారలు వాక్ చేస్తే, ఎర్ర తివాచీపై చీరగాలి కూడా తగలడం మరో విశేషం. ఆస్కార్‌కు ముందుగా జరిగే ఈ అవార్డ్ ఫంక్షన్ కేవలం సినిమాలకే కాదు టెలివిజన్‌కు కూడా అవార్డ్స్ అందిస్తుంది. మొత్తం 25 విభాగాల్లో అవార్డ్స్ అందించే ఈ షోలో 14 విభాగాలు సినిమాకు, 11 విభాగాలు టెలివిజన్‌కు అందిస్తారు.. ‘గోల్డెన్ గ్లోబ్ విన్నర్’ అనే ట్యాగ్ ఆస్కార్ అవార్డ్ ఓటింగ్‌లో ఎంతో కొంత ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. మొదటి గ్లోబ్ అవార్డ్ పాత్రలా మారడానికి శరీరాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకుంటుంటారు నటుడు క్రిస్టిన్ బేల్. ఇప్పటికే మూడుసార్లు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో నామినేషన్ సంపాదించినప్పటికీ నిరాశతోనే వెనుదిరిగారు. కానీ ‘వైస్’లో చేసిన అమెరికన్ వైజ్ ప్రెసిడెంట్ ఆడమ్ మెక్కే పాత్రకు ఆయన తొలి గ్లోబ్ అవార్డుని అందుకున్నారు. ఈ పాత్ర కోసం సుమారు నలభై పౌండ్ల (20 కిలోల) బరువు పెరగడంతోపాటు కనుబొమలను బ్లీచ్ చేయించుకున్నారు. 2011లో సహాయ నటుడి (ది ఫైటర్)గా ఈ అవార్డ్ అందుకున్నప్పటికీ బెస్ట్ యాక్టర్‌గా తొలి అవార్డ్ ఇది. కార్పెట్‌పై చీరగాలి రెడ్ కార్పెట్‌పై ఎక్కువగా పొడుగు గౌన్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ తొలిసారి ఈ కార్పెట్‌కు చీరగాలిని తగిలించారు బాలీవుడ్ భామ మనస్వీ మంగై. ఈ అవార్డ్స్ ఫంక్షన్స్‌కు ప్రియాంకా చోప్రా హైలైట్‌గా నిలుస్తారని ఊహించారంతా కానీ ఆమె హాజరు కాలేదు. అప్పటివరకూ వస్తున్న గౌన్ల ట్రెండ్‌ని పక్కన పెట్టి, మనస్వీ మంగై చీరలో ప్రత్యక్షం కావడం వీక్షకులను ఆశ్చర్యపరిచింది. ‘టాక్ ఆఫ్ ది ఈవినింగ్’ అయ్యారామె. ‘‘హాలీవుడ్‌కు ఇది ఫస్ట్ అవార్డ్ సీజన్, అలాగే నాకు కూడా. అందుకే ఈ ఫంక్షన్‌కు కొత్తగా మన భారతీయ స్టైల్లో డ్రెస్ చేసుకుందాం అనుకున్నాను. అందుకే చీర కట్టుకుని హాజరయ్యాను. ఇక్కడి ప్రెస్, హాలీవుడ్ నటీనటులు చాలా మంది నేనెవర్ని, ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి? అని కనుక్కున్నారు’’ అంటూ తన ఫస్ట్ అవార్డ్ ఫంక్షన్ ఆనందాన్ని పంచుకున్నారు మనస్వి. అవార్డ్స్ లిస్ట్ : బెస్ట్ డైరెక్టర్: అల్ఫోన్సో కువారన్ (రోమా) ఉత్తమ చిత్రం: గ్రీన్ బుక్ ఉత్తమ నటుడు (డ్రామా): రామి మలెక్ (బోమియన్ రాప్సొడీ) ఉత్తమ నటుడు (కామెడీ, మ్యూజికల్): క్రిస్టిన్ బేల్ (వైస్) విదేశీ చిత్రం: రోమా ఒరిజినల్ సాంగ్: షాలో (స్టార్ ఈజ్ బోర్న్) ఒరిజినల్ స్కోర్: జస్టిన్ హర్విట్జ్ (ఫస్ట్ మ్యాన్) యానిమేషన్ మూవీ: స్పైడర్ మేన్–ఇన్ టు ది స్పైడర్ వెర్స్ స్క్రీన్ ప్లే: నిక్ వెల్లెలోంగ, బ్రియన్ క్యూరీ, పీటర్ ఫరేల్లీ (గ్రీన్‌బుక్) సహాయ నటుడు: మహేర్షలా అలీ (గ్రీన్ బుక్) సహాయ నటి: రెగీనా కింగ్ (ఈఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్) మనస్వీ మంగై, దీపికా పదుకోన్ -
లేడీ గగాతో ఫొటో దిగడం ఇక ఈజీ
న్యూఢిల్లీ: అమెరికా ప్రముఖ పాప్ సింగర్ లేడీ గగా భుజం మీద చేతులేసి నిలబడి, ఆమె పక్కన నడుం పట్టుకొని ఫొటోలు దిగేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఆమె అభిమానులంతా పోటీ పడ్డారు. మరో పక్క బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో ఫొటోలు దిగేందుకు కూడా ఆయన అభిమానులు అలాగే పోటీ పడ్డారు. మీడియా కెమేరామేన్లు కూడా ఇద్దరు సెలబ్రిటీలను తమ ఫ్లాష్ లైట్లతో వివిధ భంగిమల్లో ఫొటోలు తీస్తూ సందడి చేశారు. అయినా వారిద్దరు తమ భంగిమలను మార్చుకోకుండా, కదలకుండా మెదలకుండా, కళ్లు కూడా ఆర్పకుండా తమ అభిమానులను అలరించారు. నిజంగా లేడీ గగా, అమితాబ్ బచ్చన్లు ఇక్కడికి రాలేదు. వారి మైనపు బొమ్మలు మాత్రమే వచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన 'మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం' అనుబంధ శాఖను ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లో ఏర్పాటు చేసేందుకు వాటిని ఇక్కడికి తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రఖ్యాతి చెందిన సెలబ్రిటీల మైనపు బొమ్మలతోపాటు భారత సెలబ్రిటీలందరి మైనపు బొమ్మలను ఈ మ్యూజియంలో ఏర్పాటు చేస్తామని లండన్‌లోని టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు తెలిపారు. ఈ విషయంలో భారతీయులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అందరి మైనపు బొమ్మలను ప్రధాన వర్క్ షాపున్న లండన్ మ్యూజియంలోనే తయారు చేసి ఇక్కడికి తీసుకొస్తామని తెలిపారు. అయితే లండన్ మ్యూజియంలోలాగా 'చేంబర్ ఆఫ్ హార్రర్స్' మాత్రం ఇక్కడుండదని చెప్పారు. 'చేంబర్ ఆఫ్ హార్రర్స్' వెనక ఎంతో ఆసక్తికరమైన చరిత్రే ఉంది. దాదాపు 200 సంవత్సరాల క్రితం అన్నే మేరీ టుస్సాడ్స్ నేతృత్వంలో లండన్ టుస్సాడ్స్ మ్యూజియం ఏర్పాటయింది. ఓ ఫిలిప్పీ కళాకారుడి ఇంట్లో పనిచేస్తూ మైనం లేదా ప్లాస్టర్‌తో బొమ్మలను తయారు చేయడం నేర్చుకున్న అన్నే మేరీ, ఫ్రాన్స్‌లో ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా చనిపోయిన వారి ముఖాల మాస్కులను తయారు చేసేవారు. ఆమె చెక్కిన మైనపు శిల్పాలను చూసి అబ్బురపడిన ఫ్రెంచ్ రాజు 16వ లూయీ తన సోదరికి ఆ కళను నేర్పించేందుకు అన్నేను ట్యూటర్‌గా నియమించారు. దాదాపు 9 ఏళ్లపాటు ఆమె రాజప్రాసాదంలోనే నివసించారు. 1790 దశకంలో ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా ఆ రాజవంశాన్ని హతమార్చిన ఫ్రెంచ్ విప్లవకారులు ఆమెను జైల్లో నిర్బంధించారు. అప్పుడు ఆమెను ఉరితీసేందుకు ఆమెకు గుండు కూడా గీసి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే తాను రాజకుటుంబానికి చెందిన వ్యక్తిని కాదని, కేవలం ట్యూటర్నని, తనను వదిలిపెట్టాలని ఆమె విప్లవకారులను వేడుకున్నారు. తమ విప్లవానికి ఏదోరకంగా ఉపయోగపడితేనే తర్వాత వదిలేస్తామని వారు షరతు విధించారు. ఆమె తనకు వచ్చిన కళ గురించి చెప్పగానే, అయితే తాము విప్లవంలో చంపుతున్న వారి ముఖాల మాస్కులను తయారు చేసి ఇవ్వాలని సూచించగా అలాగే చేశారు. అందుకోసం ఆమె విప్లవకారుల వెంట వెళ్లాల్సి వచ్చేది. భయానకంగా ఉన్న శవాల ముఖాలను క్షుణ్నంగా పరిశీలించి ముఖ కవలికలు దెబ్బతినకుండా మాస్కులను తయారు చేయాల్సి వచ్చేది. అందులో భాగంగా ఆమె ఫ్రెంచ్ రాజు 16వ లూయీ, విప్లవకారుల చేతుల్లో మరణించిన ఆఖరి రాణి మేరీ అంటాయినెట్టీ మాస్క్‌లను కూడా తయారు చేసి ఇచ్చారు. ఆ నాడు తాను కళ్లతో చూసిన భయానక దృశ్యాల జ్ఞాపకంగా ఆమె లండన్ టుస్సాడ్ మ్యూజియంలో 'చేంబర్ ఆఫ్ హార్రర్స్' ఏర్పాటుచేసి అందులో 16 లూయీతోపాటు వారి బంధువులు, ఇతరుల మైనపు బొమ్మలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వాటికి ఆమె కరుడు గట్టిన నేరస్థులు, హంతకుల మైనపు బొమ్మలను కూడా చేర్చారు. ఫ్రాన్స్ నుంచి ఇంగ్లండ్ బయల్దేరి వచ్చిన అన్నే మేరీ అక్కడ దేశమంతా తిరుగుతూ లండన్‌లో స్థిరపడ్డారు. లండన్‌లోని బేకర్ స్ట్రీట్‌లో తొలి మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఆమె పేరు మీదగానే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంగా దానికి పేరొచ్చింది. ఆ తర్వాత కాలంలో ప్రపంచంలోని పలు నగరాల్లో దానికి అనుబంధ శాఖలుగా టుస్సాడ్ మ్యూజియంలు ఏర్పాటవుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఢిల్లీలోని కన్నాట్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో కర్దాషియన్ లాంటి అంతర్జాతీయ సింగర్లతోపాటు ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనే లాంటి బాలీవుడ్ అందాల తారలు, సచిన్ టెండూల్కర్, ధోని లాంటి క్రికెట్ దిగ్గజాల మైనపు బొమ్మలను త్వరలోనే ఏర్పాటు చేస్తారట. అప్పుడు అభిమానులు తమ సెలబ్రిటీలతో అచ్చంగా ఫొటోలు దిగవచ్చు. -
చెస్ ఆడే మగవారు అంటే ఇష్టం!
64 గడులున్న చెస్ బోర్డులో వ్యూహాత్మక ఎత్తులతో ఆడేవారంటే.. కొంచెం తెలివైనా వారికిందే లెక్క. కాబట్టి అలాంటివారితో డేటింగ్ చేయడం తనకిష్టమని ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగా చెప్పుకొచ్చింది. ఈ మధ్య తన ప్రియుడు టేలర్ కిన్నీతో బ్రేకప్ చేసుకున్న ఈ అమ్మడు తాజాగా 'ఫీమెల్ ఫస్ట్.కామ్'తో ముచ్చటించింది. 'చెస్ ఆడటం నాకు ఇష్టం. ఇదెంతో సరదాగా ఉంటుంది. కాబట్టి చెస్ తెలిసిన వారితో డేటింగ్ చేసేందుకు నేను ప్రాధాన్యమిస్తాను' అని గాగా చెప్పింది. గాగా కొత్త ఆల్బం 'జోఅన్నె'. 19 ఏళ్ల వయస్సులో మరణించిన తన తండ్రి సోదరి (మేనత్త) సంస్మరణార్థం ఈ ఆల్బంను రూపొందించినట్టు గాగా తెలిపింది. ఇందులో ఎన్నో వ్యక్తిగత అంశాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. 'నా జీవితంలో వ్యక్తిగతంగా అందరూ వ్యక్తులు నన్ను మోసం చేసినవారే. చాలామంది నన్ను భ్రమల్లో ముంచెత్తినవారే. ఈ ఆల్బంలోని అలాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఈ ఆల్బం సంగీతంలో, పాటల్లో వ్యక్తిగత అంశాలు ఎన్నో ఉన్నాయి' అని గాగా వివరించింది. -
అనాథలు అడగగానే గొంతువిప్పింది
-
అతన్ని కలిసి ఆమె తప్పు చేసింది!
'స్టెఫని జానే ఏంజెలీనా గెర్మనొట్టా' అనే అసలు పేరు కంటే 'లేడీగాగా'గా ప్రపంచఖ్యాతి పొందిన పాప్ సింగర్ మరో వివాదాన్ని ఎదుర్కొంటోంది. గాయని, రచయిత్రి, నటిగానే కాక సామాజిక సేవలోనూ ముందున్న ఈ న్యూయార్క్ సంచలనం ఇటీవల ఓ అంతర్జాత సదస్సులో పాలుపంచుకుంది. 'దయాగుణం వల్ల కలిగే మేలులు' అనే అంశంపై జరిగిన ఆ సదస్సుకు టిబెట్ మతగురువు దలైలామా కూడా హాజరయ్యారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అవకాశం కావడంతో లేడీగాగా.. దలైలామాతో ప్రత్యేకంగా భేటీ అయి, పలు అంశాలపై మాట్లాడింది. భేటీ అనంతరం లామాతో కలిసి దిగిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతే చైనా నెటిజన్లు ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడ్డారు. 'మీ ఇద్దరిదీ బ్యాడ్ రొమాన్స్..' అని ఒకరంటే, 'నేను గాగాను ఆరాధించేవాణ్ని.. ఇకపై ఆమె అభిమానిగా ఉండదల్చుకోవట్లేదు' అని ఇంకొకరు.. 'అతన్ని కలిసి ఆమె తప్పుచేసింది' అని మరొకరు.. ఇలా లెక్కకు మిక్కిలి అసహన వ్యాఖ్యలు చేశారు. తాము భద్ధశత్రువుగా భావించే దలైలామాను లేడీగాగా కలుసుకోవడంపై అటు చైనా ప్రభుత్వం కూడా గుర్రుగా ఉన్నట్లు, గాయనిపై నిషేధం విధించే యోచనలో ఉన్నట్లు స్థానిక మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. అమెరికా తర్వాత లేడీగాగాకు ఎక్కువమంది అభిమానులున్న దేశం చైనానే. కాగా, నిషేధం వార్తల్లో నిజం లేదని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి హాంగ్ లీ పేర్కొన్నారు. వీడియోల్లో అసభ్యకరమైన నృత్యాలు చేస్తోందంటూ లేడీగాగాపై చైనా గతంలో మూడేళ్ల నిషేధం విధించింది. 2014లో ఆ నిషేధాన్ని ఎత్తేసిన తర్వాత మళ్లీ అలాంటి వార్తలు రావడం ఇదే తొలిసారి. ఈ సంఘటనలపై ఆమె ఇంకా స్పందించలేదు. -
దలైలామా..లేడీగాగా..చైనా వార్నింగ్
బీజింగ్: ప్రముఖ ఆధ్యాత్మిక బౌద్ధ గురువు దలైలామాను చైనా మరోసారి హెచ్చరించింది. దలైలామా అమెరికాతో మైత్రిని కొనసాగించడంపై చైనా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న దలైలామా ఆదివారం ఇండియానా పోలీస్ లో అమెరికా మేయర్ల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చైనా విదేశాంగ ప్రతినిధి హాంగ్ లీ స్పందిస్తూ..దలైలామా టిబెట్ పై అంతర్జాతీయంగా మద్దతును సాధించడానికే విదేశాలలో పర్యటిస్తున్నారని ఆరోపించారు. కాగా అంతకు ముందు తనను కలిసిన పాప్ సింగర్ లేడీగాగాకు ప్రేమ, కరుణ, ఆధ్యాత్మిక విషయాలను ఆయన వివరించారు. ఇక రెండు వారాల క్రితం ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయిన విషయం తెలిసిందే. -
కన్నీళ్లు.. కరతాళ ధ్వనుల మధ్య లేడీ గగా!
ఆస్కార్ వేడుకల్లో ఎమోషనల్ మూమెంట్స్ అనదగ్గవాటిలో లేడీ గగా పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కాలేజీ క్యాంపస్‌లలో జరిగే లైంగిక వేధింపుల నేపథ్యంలో రూపొందించిన ‘ది హంటింగ్ గ్రౌండ్’ అనే లఘు చిత్రంలోని ‘టిల్ ఇట్ హ్యాపెన్స్ టు యు’ అనే పాటను ఆమె పాడారు. డాయనె వారెన్ అనే రచయితతో కలిసి లేడీ గగా ఈ పాట రాసి, పాడి, నటించారు. ఈ పాట ‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్’ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. పాట పాడుతూ చివర్లో కన్నీటి పర్యంతమైన గగాకి, చెమర్చిన కళ్లతో, కరతాళ ధ్వనులతో వీక్షకులు అభినందనలు తెలియజేశారు. గగా ఈ పాట పాడే ముందు యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జో బిడెన్ మాట్లాడుతూ- ‘‘ఆడవాళ్లపై మాత్రమే కాదు.. మగవాళ్లపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. వీటిపై ప్రతి విద్యార్థీ పోరాడాలి. మనందరం ఈ దాడులను అంతం చేయడానికి నడుం బిగిస్తే, బాధితులే ఉండరు’’ అని ఉద్వేగంగా మాట్లాడారు. అంతకుముందు రెడ్ కార్పెట్‌పై గగా మాట్లాడతూ - ‘‘ఐదుగురు అమ్మాయిల్లో ఒక్క అమ్మాయి, 20మంది అబ్బాయిల్లో ఒక్క అబ్బాయి చదువు పూర్తి చేసేలోపే లైంగిక వేధింపులకు గురవుతాడు’’ అని పేర్కొన్నారు. 19 ఏళ్ల వయసులో తనపై జరిగిన అత్యాచారాన్ని గుర్తు చేసుకుంటూ గగా ఈ మాటలు మాట్లాడినట్లుగా అనిపించింది. ఆ చేదు సంఘటన తాలూకు బాధ ఆమె కళ్లల్లో స్పష్టంగా కనిపించింది. -
ఈ ఏడాదైనా గాగా కాక పుట్టించేనా!?
స్టీఫనీ జోనే ఏంజలీనా జెర్మనాట్టో.. అదేనండీ సొంతపేరు కంటే లేడీ గాగాగా పాపులరైన ఈ పాప్ సంచలనం ఇటీవల వార్తల్లోనే కాక చాట్ బస్టర్ లోనూ స్థానం కోల్పోయింది. గడిచిన మూడేళ్లుగా హిట్ కు దూరంగా ఉన్న అమెరికన్ కలువ.. మళ్లీ మునుపటి ఫామ్ అందుకునేందుకు తెగ కష్టపడుతోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 15న జరగనున్న గ్రామీ అవార్డు ప్రదానోత్సవం ఆమె కెరీర్ ను మలుపు తిప్పుతుందని ఆశిస్తోంది. క్యాన్సర్ తో బాధపడుతూ ఇటీవలే తనువు చాలించిన మ్యూజిక్ మెస్ట్రో డేవిడ్ బోవీ జ్ఞాపకార్థం గ్రామీ వేదికపై లేడీగాగా ప్రదర్శన ఇవ్వనుంది. వ్యక్తిగతంగానూ డేవిడ్ తనకెంతో ఇష్టమని, ప్రదర్శన ద్వారా ఆయన జ్ఞాపకాలను గుర్తుచేయడం గర్వకారణమని గాగా అంటోంది. గ్రామీ- 2016లో గాగా ప్రదర్శనే హైలెట్ గా నిలుస్తుందని నిర్వాహకుల అభిప్రాయం. ఆ మేరకు తాను కూడా తీవ్ర సాధన చేస్తున్నట్లు వెల్లడించింది గాగా. ఒక వేళ 'డేవిడ్ కు నివాళి'కిగాను అవార్డు లభిస్తే అది గాగా ఖాతాలోచేరే 7వ గ్రామీ అవుతుంది. మొదటిసారిగా 2008లో 'ది ఫేమ్' ఆల్బంతో దూసుకొచ్చిన లేడీగాగా ఆ తర్వాత జస్ట్ డ్యాన్స్, పోకర్ ఫేస్, 2009లో ది ఫేమ్ మూన్ స్టర్, బ్యాడ్ రొమాన్స్, టెలిఫోన్, అలెజాండ్రో వంటి సింగిల్స్ తో అదరగొట్టేసింది. 2011లో విడిదలైన 'బార్న్ దిస్ వే' ఆల్బంతో గాగాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పాడ్డారు. అయితే 2013లో విడుదలైన ఆర్ట్ ఆఫ్ మ్యూజిక్ తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ విజయాలేవీలేవు. 2016 ప్రారంభంలోనే వరంలా వచ్చిన గ్రామీ వేడుకలతోనైనా గాగా మళ్లీ కాక పుట్టిస్తుందేమో చూడాలి. -
ఆమెకు అవార్డుతో బిత్తరపోయిన హాలీవుడ్ స్టార్!
గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు ఆన్లైన్లో హాట్ టాపిగ్గా మారింది. 'అమెరికన్ హర్రర్ స్టోరీ: 'హోటల్'లో నటనకుగాను టీవీ మూవీ కేటగిరీలో ఉత్తమ నటి అవార్డును పాప్ సింగర్ లేడి గాగాకు ప్రకటించారు. స్టేజ్‌కి దూరంగా కూచున్న గాగా ఆదరాబాదరాగా నడుచుకుంటూ.. తన చుట్టూ కూచున్న నటుల మధ్య నుంచి వెళ్లింది. ఈ క్రమంలో కూర్చిపై కూర్చొని ఉన్న లియోనార్డో డీకాప్రియో మోచేతిని గాగా బలంగా తోసుకుంటూ పోయింది. అతని మోచేయి తనకు తాకిందన్న విషయాన్ని కూడా ఆమె పట్టించుకోలేదు. కానీ లియోనార్డో మాత్రం బిత్తరపోయి ఆమె వంక చూశాడు. ఆ చూపు కెమెరాకు చిక్కి.. అభిమానులకు హాట్ టాపిక్ గా మారింది. అసలు 'రెవెనంట్' సినిమాలో నటించినందుకు కాదు అలా బిత్తరపోయి చిత్రంగా గాగా వంక చూసినందుకు లియోనార్డోకు 'గోల్డెన్ గ్లోబ్' అవార్డు ఇవ్వాలంటూ ఆన్లైన్లో జోకులు పేలుతున్నాయి. హర్రర్ టీవీ షోలో రక్తాన్ని పీల్చే గబ్బిలంలా గాగా నటనకు 'గోల్డెన్ గ్లోబ్' రావడంపై బెస్ట్ రియాక్షన్ అవార్డు లియోకే ఇవ్వాలంటూ నెటిజన్లు వ్యంగ్య పోస్టులతో హోరెత్తిస్తున్నారు. scuse u https://t.co/dNlwVvHkCN — LW (@lindseyweber) January 11, 2016 -
రెడ్ కార్పెట్‌పై లేడి గాగా ఘాటు ముద్దు!
ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా పాప్ సింగర్ లేడీ గాగా, ఆమె ఫియాన్సీ టైలర్ కిన్నీ సందడి చేశారు. ఇటీవల 'వీ' మ్యాగజైన్ కోసం పూర్తి నగ్నంగా పోజిచ్చి.. సంచలనం సృష్టించిన ఈ జంట గోల్డెన్ గ్లోబ్ రెడ్ కార్పెట్‌పై కలిసి నడిచింది. ఈ సందర్భంగా ఇరువురు పెదవులు కలుపుతూ ఓ ముద్దు పెట్టుకొని తమ మధ్య అనుబంధాన్ని చాటుకున్నారు. తన సహజ ధోరణికి కాస్త భిన్నంగా నలుపు రంగు దుస్తుల్లో చూడచక్కగా ముస్తాబై లేడీ గాగా ఈ కార్యక్రమానికి హాజరైంది. అన్నట్టు గోల్డెన్ గ్లోబ్ ప్రదానోత్సవంలో లేడీ గాగాను కూడా ఓ పురస్కారం వరించింది. అమెరికన్ హర్రర్ స్టోరీ 'హోటల్'లో నటించినందుకు టీవీ మూవీ కేటగిరీలో ఉత్తమ నటి అవార్డు ఆమెకు దక్కింది. KISS ME DAMN IT @TaylorKinney111 @ladygaga #GoldenGlobes pic.twitter.com/oZSuOEPro5 — Scoopla (@Scoopla) January 11, 2016 -
'రేప్ జరిగిన తర్వాత పూర్తిగా మారిపోయా'
లండన్: 19 ఏళ్ల వయసులో తాను అత్యాచారానికి గురైన తర్వాత, ఆ పీడకల తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని పాప్ స్టార్ లేడీ గాగా చెప్పింది. టీనేజ్‌లో తనపై అత్యాచారం జరిగిందని గతేడాది ఓ ఇంటర్వ్యూలో చెప్పిన లేడీ గాగా.. అప్పట్లో ఎంతో మానసికక్షోభ అనుభవించానని వెల్లడించింది. 'నాపై అఘాయిత్యం జరిగాక చాలా ఏళ్లపాటు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఈ విషయాన్ని ఎలా మరిచిపోవాలో.. ఎలా జీర్ణం చేసుకోవాలో అప్పట్లో అర్ధంకాలేదు. ఇందులో నా తప్పు ఉందా అన్న విషయం అర్థంకాలేదు. అయితే ఈ ఘటన నన్ను పూర్తిగా మార్చివేసింది. నా ఆలోచన విధానాన్ని మార్చింది. ఈ పీడకలను మర్చిపోయి మనోస్థయిర్యంతో ముందుకుసాగా' అని లేడీ గాగా చెప్పింది. -
‘లేడీ’.. గప్‌చుప్..!
స్టెఫాని జయోని ఏంజిలినా జర్మనోట్టా... పేరు మార్చుకుని ‘లేడీ గగా’గా ప్రపంచాన్ని ఊపేస్తున్న పాప్ సింగర్ నాటి తన చేదు అనుభవాలను బహిర్గతం చేసి అందరికీ షాకిచ్చింది. తాను పందొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఒకరు బలాత్కారం చేశాడంటూ బోరుమంది. ఓ రేడియో కార్యక్రమంలో మాట్లాడిన గగా... ‘ఏడెనిమిదేళ్ల కిందటి సంఘటన. కానీ అతడిని ఏమీ చేయలేకపోయాను. ఈ భయంకర పరిస్థితి నుంచి బయట పడటానికి ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ థెరపీలెన్నో తీసుకున్నా. ముఖ్యంగా సంగీతం అన్నింటినీ అధిగమించేలా చేసింది’ అని చెప్పింది. -
‘బ్యాక్’సైడ్ టాటూస్!
అక్కడా ఇక్కడా ఎందుకనుకుందో... ఫ్రంట్ కంటే అదే బెటరనుకుందో... పాప్ స్టార్ లేడీ గాగా వీపుపై టాటూలు వేయించుకుంది. వాటిని వేయించుకుంటున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసి కుర్రకారుకు కిర్రెక్కిస్తోంది. తన ‘ఆర్ట్పాప్’ టూర్లో భాగంగా యూరప్‌ను చుట్టేస్తున్న ఈ ‘లిటిల్ మాన్స్టర్’... జర్మనీలో టాటూలు దిద్దించుకుందని ఓ ఆంగ్ల పత్రిక కథనం. ఎలాంటి ఆచ్ఛాదన లేని ఆమె వెనుక భాగంపై మాన్స్టర్ బొమ్మలు చిత్రించాడట ప్రముఖ ఆర్టిస్ట్ గేల్ గొంజాల్స్. -
స్టన్నింగ్ హాట్!
లేడీ గాగా ఎక్కడున్నా సెన్సేషనే. ఆమె డ్రెస్సింగ్ ఎప్పుడూ స్టన్నింగ్ హాటే. రీసెంట్గా ఏథెన్స్ ఎయిర్ పోర్టులో ఫ్యాన్స్‌కు ప్రత్యక్షంగా కిక్కెక్కించిందీ పాప్ స్టార్. ప్రైవేట్ ఫ్లయిట్ నుంచి బయటకు వచ్చిన గాగా... కేవలం షెల్ టాప్... ఓ చిన్న లోయర్‌తో కనిపించి అక్కడున్నవారందరిలో కరెంట్ పాస్ చేసేసింది. అంతటితో ఆగిందా..! తాను బస చేసిన స్టార్ హోటల్ రాయల్ సూట్ బాత్రూముల్లో దాదాపు నగ్నంగా ఫొటోలు దిగి వాటిని సామాజిక సైట్లో పెట్టి, బాడీలో ‘ఉష్ణోగ్రతలు’ పెంచేసింది. -
'అంతరిక్షంలో పెళ్లి చేసుకుంటాను'
లాస్ ఎంజెలెస్: పెళ్లి విషయంలో ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది. అలా జరుపుకోవాలి.. ఇలా జరపుకోవాలి అని కొందరు కలలు కనడంలో ఆశ్చర్యమేమి ఉండదు. వినూత్నంగా వివాహం జరుపుకోవాలని హాలీవుడ్ పాప్ సింగ్ లేడి గాగా ఉబలాటపడుతోంది. చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న తన ప్రియుడు టేలర్ కిన్నేను 2015 లో వివాహం చేసుకొవాలని నిశ్చయించుకుంది. అయితే కిన్నేను అంతరిక్షంలో పెళ్లాడాలని ఉంది అంటూ లేడి గాగా తన మనసులో మాటను బయటపెట్టింది. వర్జిన్ గాలక్టిక్ ఫ్లైట్ లో కిన్నేను పెళ్లి చేసుకోవాలని ఉందని తెలిపింది. చిరకాలంగా జీవించాలని తీసుకుంటున్న నిర్ణయం ఆకాశంలో అయితే బాగుంటుందని వెల్లడించింది. ఎప్పటికి తన మరచిపోని విధంగా తమ వివాహం ఉండాలని కోరుకుంటున్నానని గాగా అన్నారు. అంతరిక్షంలో ప్రత్యేక ఫ్లైట్ లో జరుపుకునే పెళ్లికి ఒక్కొక్క సీట్ కోసం 250000 డాలర్లు ఖర్చు అవుతుందని.. అయితే ప్రేమ సందేశాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుందంటోంది లేడిగాగా. -
మైఖేల్ జాక్సన్ మ్యూజియమ్!
సంగీత ప్రపంచంలో తిరుగు లేని రారాజుగా ఓ వెలుగు వెలిగిన మైఖేల్ జాక్సన్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయినా ఎప్పటికీ ఆయన చిరంజీవే. ఈ పాప్ కింగ్‌కి ఎంతోమంది వీరాభిమానులున్నారు. వారిలో ‘లేడీ గాగా’ ఒకరు. గాయనిగా, సంగీతదర్శకురాలిగా, బుల్లితెర, వెండితెర నటిగా ఎంతో పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకున్న లేడీ గాగా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. మైఖేల్ జాక్సన్ జ్ఞాపకార్థం ఓ మ్యూజియమ్‌ని ఏర్పాటు చేసే పని మీద ఉన్నారు గాగా. ఇందులో మైఖేల్‌కి సంబంధించిన విలువైన ఫొటోలు, వస్తువులను పొందుపరచనున్నారామె. గత కొంత కాలంగా ఈ సేకరణ పనిలోనే ఉన్నారు. రెండేళ్ల క్రితం జరిగిన ఓ వేలం పాటలో మైఖేల్‌కి సంబంధించిన 55 విలువైన వస్తువులను భారీ మొత్తానికి కొనుగోలు చేశారామె. ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యే విధంగా, మంచి అనుభూతి పొందే విధంగా ఈ మ్యూజియమ్ ఉండబోతోందని హాలీవుడ్ టాక్. -
గాగా.. యువతను చేసెనొక గమ్మత్తు..!
లేడీగాగా ఓ అయస్కాంతం. అయస్కాంతానికి ఇనుప ముక్కలు అతుక్కొంటాయి.. ఆమె వాయిస్‌కు గ్రామీ అవార్డులు అతుక్కొంటాయి. అంతే తేడా! ఈ కుర్ర అయస్కాంతానికి అతుక్కొనేవి అవార్డులే కాదు... పాప్‌ను పిచ్చిగా అభిమానించే యువ హృదయాలు కూడా. తాజాగా గాగా ట్విటర్ ఫాలోవర్ల విషయంలో కొత్త రికార్డును నెలకొల్పింది. నాలుగు కోట్ల మంది ట్విటర్ ఫాలోవర్లతో ప్రపంచంలోనే అత్యధికమంది ఫాలోవర్లను కలిగి ఉన్న ట్విటిజన్గా నిలిచింది. గాగా... సింగర్, సాంగ్ రైటర్, యాక్టివిస్ట్, రికార్డ్ ప్రొడ్యూసర్, బిజినెస్ ఉమన్, ఫ్యాషన్ డిజైనర్, నటి, వేదాంతి. పాతికేళ్ల వయసుకే సంపాదించిన గుర్తింపులు ఇవి. పాశ్చాత్య యువతరానికి రోల్ మోడల్‌గా, భారతీయ యువతకు పరిచయస్తురాలిగా ఉన్న గాగా విషయాలు, విశేషాలు ఇవి... గాగా అసలు పేరు స్టెఫానీ జోన్నే ఏంజెలీనా జెర్మనొట్టా. ‘రేడియో గాగా’ అనే పాట స్ఫూర్తితో ఆమె తన స్టేజ్నేమ్ను ‘లేడీగాగా’ గా మార్చుకొంది. గాగా వాడే పెర్ఫ్యూమ్, లిప్‌స్టిక్, మేకప్కిట్స్ అన్నీ ఫేమస్సే. గాగా వల్లనే ఆ బ్రాండ్స్‌కు మంచి ప్రచారం వస్తోంది. వ్యక్తిగతంగా కూడా గాగా మేకప్ లేనిదే పర్సనల్ రూమ్ నుంచి బయటకు అడుగుపెట్టదట. ఆమె వినసొంపు వాయిస్ మాత్రమే కాదు.. మేని ఒంపులు కూడా ఫేమస్సే. ఫ్యాషన్‌లో ట్రెండ్‌ను ఫాలో కాకుండా ట్రెండ్‌ను సృష్టిస్తుంటుంది. తను వేసే ఔట్‌ఫిట్స్‌తో (దుస్తులతో) ఔరా అనిపిస్తుంటుంది. ప్రపంచ పాప్ సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణిగా ఉన్న ఈ యువతి ఇప్పుడు ఏం చేసినా సంచలనమే. గాగా ఎక్కడికి వెళ్లినా తనతో పాటు ఒక టీ కప్, సాసర్ను తీసుకెళ్తుంది. ఎందుకంటే.. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఆ కప్‌లో టీ తాగడం వల్ల ఇంటిదగ్గర ఉన్న ఫీలింగ్ కలుగుతుందని చెబుతుంది. తన స్టేజ్ షోలో ఆమె వేసుకుని వచ్చే డ్రస్ ప్రధాన ఆకర్షణ. ఆమె ఎలాంటి ఔట్‌ఫిట్స్‌తో వస్తుందనే విషయం గురించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అలా ఒకసారి డిఫరెంట్ డ్రస్సింగ్‌తో షికాగోలోని పబ్లిక్ ప్లేస్‌లోకి వచ్చిన గాగాను అశ్లీల వస్త్రధారణతో ఉందని అక్కడ నుంచి తరలించారు పోలీసులు! ట్విటర్ ఫాలోవర్ల విషయంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటుంది లేడీగాగా. ఈ పాప్ సింగర్‌ను ఈ విషయంలో బీట్ చేసే వారెవరూ కనుచూపు మేరలో లేరు. గాగాకు నాలుగు కోట్ల మంది ట్విటర్ ఫాలోవర్లున్నారు. ఫేస్బుక్ విషయంలో అమెరికాలోనే టాప్ స్థానంలో ఉంది గాగా. అమెరికా అధ్యక్షుడు ఒబామా అఫిషియల్ ఫేస్బుక్ పేజ్ కన్నా గాగా ఫేస్బుక్ పేజ్కే ఎక్కువమంది సబ్స్క్రైబర్లుండటం గమనార్హం. గాగాకు దాదాపు రెండు కోట్ల మంది ఫేస్బుక్ ఫాలోవర్లుండగా, ఒబామాకు ఒకటిన్నర కోటి మంది మాత్రమే ఉన్నారు. పాప్ సింగర్‌గా సంపాదన విషయంలో గాగా టాప్ ఆఫ్ ది చార్ట్‌గా నిలుస్తోంది. ప్రతియేటా అత్యధిక వసూళ్లను సాధించిన పాప్ఆల్బమ్స్ల జాబితాలో గాగా ఆల్బమ్‌లే ముందు వరసలో ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రభావాత్మకమైన సంగీతకారిణి హోదాలో ఉంది. చారిటీ విషయంలో కూడా గాగాకు మంచి గుర్తింపు ఉంది. తమ సంపాదనలో దానధర్మాలకు ప్రాధాన్యత ఇస్తున్న పాప్సింగర్ల జాబితాలో కూడా గాగా ప్రతియేటా తొలిస్థానంలోనే నిలుస్తోంది. గాగా పేరు ఒక మార్కెటింగ్ సూత్రం. పాశ్చాత్య యువతలో ఆమెపై ఉన్న వెర్రి అభిమానాన్ని అనేక వాణిజ్య సంస్థలు బాగా సొమ్ము చేసుకొంటున్నాయి. గాగా పేరుతో టూత్ బ్రష్‌లు కూడా వచ్చాయంటే పరిస్థితి ఎంత వరకూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. గాగా మైనపు బొమ్మను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.