ఈ ఏడాదైనా గాగా కాక పుట్టించేనా!? | Will 2016 See The Return Of Lady | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదైనా గాగా కాక పుట్టించేనా!?

Published Fri, Feb 5 2016 1:45 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM

ఈ ఏడాదైనా గాగా కాక పుట్టించేనా!?

ఈ ఏడాదైనా గాగా కాక పుట్టించేనా!?

స్టీఫనీ జోనే ఏంజలీనా జెర్మనాట్టో.. అదేనండీ సొంతపేరు కంటే లేడీ గాగాగా పాపులరైన ఈ పాప్ సంచలనం ఇటీవల వార్తల్లోనే కాక చాట్ బస్టర్ లోనూ స్థానం కోల్పోయింది. గడిచిన మూడేళ్లుగా హిట్ కు దూరంగా ఉన్న అమెరికన్ కలువ.. మళ్లీ మునుపటి ఫామ్ అందుకునేందుకు తెగ కష్టపడుతోంది. ఈ క్రమంలో  ఫిబ్రవరి 15న జరగనున్న గ్రామీ అవార్డు ప్రదానోత్సవం ఆమె కెరీర్ ను మలుపు తిప్పుతుందని ఆశిస్తోంది.

క్యాన్సర్ తో బాధపడుతూ ఇటీవలే తనువు చాలించిన మ్యూజిక్ మెస్ట్రో డేవిడ్ బోవీ జ్ఞాపకార్థం గ్రామీ వేదికపై లేడీగాగా ప్రదర్శన ఇవ్వనుంది. వ్యక్తిగతంగానూ డేవిడ్ తనకెంతో ఇష్టమని, ప్రదర్శన ద్వారా ఆయన జ్ఞాపకాలను గుర్తుచేయడం గర్వకారణమని గాగా అంటోంది. గ్రామీ- 2016లో గాగా ప్రదర్శనే  హైలెట్ గా నిలుస్తుందని నిర్వాహకుల అభిప్రాయం. ఆ మేరకు తాను కూడా తీవ్ర సాధన చేస్తున్నట్లు వెల్లడించింది గాగా. ఒక వేళ 'డేవిడ్ కు నివాళి'కిగాను అవార్డు లభిస్తే అది గాగా ఖాతాలోచేరే 7వ గ్రామీ అవుతుంది.

మొదటిసారిగా 2008లో 'ది ఫేమ్' ఆల్బంతో దూసుకొచ్చిన లేడీగాగా ఆ తర్వాత జస్ట్ డ్యాన్స్, పోకర్ ఫేస్, 2009లో ది ఫేమ్ మూన్ స్టర్, బ్యాడ్ రొమాన్స్, టెలిఫోన్, అలెజాండ్రో వంటి సింగిల్స్ తో అదరగొట్టేసింది. 2011లో విడిదలైన 'బార్న్ దిస్ వే' ఆల్బంతో గాగాతో ప్రపంచవ్యాప్తంగా  అభిమానులు ఏర్పాడ్డారు. అయితే 2013లో విడుదలైన ఆర్ట్ ఆఫ్ మ్యూజిక్ తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ విజయాలేవీలేవు. 2016 ప్రారంభంలోనే వరంలా వచ్చిన గ్రామీ వేడుకలతోనైనా గాగా మళ్లీ కాక పుట్టిస్తుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement