చెస్ ఆడే మగవారు అంటే ఇష్టం! | Lady Gaga prefers men who can play chess | Sakshi
Sakshi News home page

చెస్ ఆడే మగవారు అంటే ఇష్టం!

Published Sun, Sep 18 2016 8:54 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

చెస్ ఆడే మగవారు అంటే ఇష్టం!

చెస్ ఆడే మగవారు అంటే ఇష్టం!

64 గడులున్న చెస్ బోర్డులో వ్యూహాత్మక ఎత్తులతో ఆడేవారంటే.. కొంచెం తెలివైనా వారికిందే లెక్క. కాబట్టి అలాంటివారితో డేటింగ్ చేయడం తనకిష్టమని ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగా చెప్పుకొచ్చింది.

ఈ మధ్య తన ప్రియుడు టేలర్ కిన్నీతో బ్రేకప్ చేసుకున్న ఈ అమ్మడు తాజాగా 'ఫీమెల్ ఫస్ట్.కామ్'తో ముచ్చటించింది. 'చెస్ ఆడటం నాకు ఇష్టం. ఇదెంతో సరదాగా ఉంటుంది. కాబట్టి చెస్ తెలిసిన వారితో డేటింగ్ చేసేందుకు నేను ప్రాధాన్యమిస్తాను' అని గాగా చెప్పింది. గాగా కొత్త ఆల్బం 'జోఅన్నె'. 19 ఏళ్ల వయస్సులో మరణించిన తన తండ్రి సోదరి (మేనత్త) సంస్మరణార్థం ఈ ఆల్బంను రూపొందించినట్టు గాగా తెలిపింది. ఇందులో ఎన్నో వ్యక్తిగత అంశాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది.

'నా జీవితంలో వ్యక్తిగతంగా అందరూ వ్యక్తులు నన్ను మోసం చేసినవారే. చాలామంది నన్ను భ్రమల్లో ముంచెత్తినవారే. ఈ ఆల్బంలోని అలాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఈ ఆల్బం సంగీతంలో, పాటల్లో వ్యక్తిగత అంశాలు ఎన్నో ఉన్నాయి' అని గాగా వివరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement