దలైలామా..లేడీగాగా..చైనా వార్నింగ్
బీజింగ్: ప్రముఖ ఆధ్యాత్మిక బౌద్ధ గురువు దలైలామాను చైనా మరోసారి హెచ్చరించింది. దలైలామా అమెరికాతో మైత్రిని కొనసాగించడంపై చైనా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న దలైలామా ఆదివారం ఇండియానా పోలీస్ లో అమెరికా మేయర్ల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా చైనా విదేశాంగ ప్రతినిధి హాంగ్ లీ స్పందిస్తూ..దలైలామా టిబెట్ పై అంతర్జాతీయంగా మద్దతును సాధించడానికే విదేశాలలో పర్యటిస్తున్నారని ఆరోపించారు. కాగా అంతకు ముందు తనను కలిసిన పాప్ సింగర్ లేడీగాగాకు ప్రేమ, కరుణ, ఆధ్యాత్మిక విషయాలను ఆయన వివరించారు. ఇక రెండు వారాల క్రితం ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయిన విషయం తెలిసిందే.