
చైనాతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ కారణంగా ఎంతో మంది చనిపోతుంటే రామ్ గోపాల్ వర్మ మాత్రం కరోనా వైరస్‌కే వార్నింగ్ ఇస్తున్నారు. కరోనా.. నువ్వు మమ్మల్ని చంపితే నువ్వూ చస్తావన్న విషయం మర్చిపోకు అంటూ ప్రపంచాన్నే బయపెడుతున్న కరోనా వైరస్‌కి వర్మ తనదైన శైలిలో హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు తన ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు.
'డియర్ వైరస్.. బుద్ధిలేకుండా అందరినీ చంపుకుంటూ పోతే నువ్వు కూడా చచ్చిపోతావు అన్న విషయాన్ని తెలుసుకో.. ఎందుకుంటే నువ్వు కూడా ఒక పారాసైట్ మాత్రమే. నా మాటపై నీకు నమ్మకం లేకపోతే వెంటనే వైరాలజీ క్రాష్ కోర్స్ తీసుకో.. కనుక నేను నీకు చెప్పేదేంటంటే.. నువ్వు బతుకు.. మమ్మల్ని బతకనివ్వు.. నీకు కూడా జ్ఞానం ఉంటే బాగుండు అని ఆశిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు.