'అంతరిక్షంలో పెళ్లి చేసుకుంటాను'
'అంతరిక్షంలో పెళ్లి చేసుకుంటాను'
Published Tue, Aug 19 2014 1:57 PM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM
లాస్ ఎంజెలెస్: పెళ్లి విషయంలో ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది. అలా జరుపుకోవాలి.. ఇలా జరపుకోవాలి అని కొందరు కలలు కనడంలో ఆశ్చర్యమేమి ఉండదు. వినూత్నంగా వివాహం జరుపుకోవాలని హాలీవుడ్ పాప్ సింగ్ లేడి గాగా ఉబలాటపడుతోంది. చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న తన ప్రియుడు టేలర్ కిన్నేను 2015 లో వివాహం చేసుకొవాలని నిశ్చయించుకుంది. అయితే కిన్నేను అంతరిక్షంలో పెళ్లాడాలని ఉంది అంటూ లేడి గాగా తన మనసులో మాటను బయటపెట్టింది.
వర్జిన్ గాలక్టిక్ ఫ్లైట్ లో కిన్నేను పెళ్లి చేసుకోవాలని ఉందని తెలిపింది. చిరకాలంగా జీవించాలని తీసుకుంటున్న నిర్ణయం ఆకాశంలో అయితే బాగుంటుందని వెల్లడించింది. ఎప్పటికి తన మరచిపోని విధంగా తమ వివాహం ఉండాలని కోరుకుంటున్నానని గాగా అన్నారు. అంతరిక్షంలో ప్రత్యేక ఫ్లైట్ లో జరుపుకునే పెళ్లికి ఒక్కొక్క సీట్ కోసం 250000 డాలర్లు ఖర్చు అవుతుందని.. అయితే ప్రేమ సందేశాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుందంటోంది లేడిగాగా.
Advertisement
Advertisement