మైఖేల్ జాక్సన్ మ్యూజియమ్! | Lady Gaga to open a Michael Jackson museum | Sakshi
Sakshi News home page

మైఖేల్ జాక్సన్ మ్యూజియమ్!

Published Sun, Jan 12 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM

మైఖేల్ జాక్సన్ మ్యూజియమ్!

మైఖేల్ జాక్సన్ మ్యూజియమ్!

సంగీత ప్రపంచంలో తిరుగు లేని రారాజుగా ఓ వెలుగు వెలిగిన మైఖేల్ జాక్సన్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయినా ఎప్పటికీ ఆయన చిరంజీవే. ఈ పాప్ కింగ్‌కి ఎంతోమంది వీరాభిమానులున్నారు. వారిలో ‘లేడీ గాగా’ ఒకరు. గాయనిగా, సంగీతదర్శకురాలిగా, బుల్లితెర, వెండితెర నటిగా ఎంతో పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకున్న లేడీ గాగా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. మైఖేల్ జాక్సన్ జ్ఞాపకార్థం ఓ మ్యూజియమ్‌ని ఏర్పాటు చేసే పని మీద ఉన్నారు గాగా. 
 
ఇందులో మైఖేల్‌కి సంబంధించిన విలువైన ఫొటోలు, వస్తువులను పొందుపరచనున్నారామె. గత కొంత కాలంగా ఈ సేకరణ పనిలోనే ఉన్నారు. రెండేళ్ల క్రితం జరిగిన ఓ వేలం పాటలో మైఖేల్‌కి సంబంధించిన 55 విలువైన వస్తువులను భారీ మొత్తానికి కొనుగోలు చేశారామె. ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యే విధంగా, మంచి అనుభూతి పొందే విధంగా ఈ మ్యూజియమ్ ఉండబోతోందని హాలీవుడ్ టాక్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement