old man problem
-
ఖాకీ మంచి మనసు.. రోడ్డుపై దిక్కుతెలియక తిరుగుతున్న..
సాక్షి, శ్రీకాకుళం: ఇంటి అడ్రస్ మర్చిపోయి ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధుడిని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చి జేఆర్ పురం పోలీసులు ప్రజలు మనసు గెలుచుకున్నారు. పోలీసులు తెలిపిన వివరా ల మేరకు.. మహంతి తాత అనే వృద్ధుడు విశాఖపట్నంలోని తన కూతురు ఇంటికి వెళ్లేందుకు ఐదు రోజుల కిందట బయల్దేరారు. అయితే అడ్రస్ మర్చిపోవడంతో గత నాలుగు రోజులుగా విశాఖపట్నంలోని సింహాచలం దేవస్థానంలోనే ఉండిపోయారు. సామాజిక మాధ్యమంలో ఆయన గురించి ఓ వీడియో పోస్టయ్యింది. అందులో వృద్ధుడు తనది రణస్థలం మండలమని తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న జేఆర్ పురం ఎస్ఐ జి.రాజేష్ తన కానిస్టేబుల్‌ను సింహాచలం పంపించి వృద్ధుడిని జేఆర్ పురం పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే పూర్తి వివరాలు సేకరిస్తే.. వృద్ధుడిది రణస్థలం కాదని విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని పర్ల గ్రామమని తెలిసింది. దీంతో అక్కడి వ్యక్తు లతో మాట్లాడి వృద్ధుడిని పోలీసు వాహనంలో స్వగ్రామానికి పంపించారు. అక్కడి సర్పంచ్‌కు వృద్ధుడిని అప్పగించారు. జేఆర్ పురం పోలీసులు చూపిన చొరవపై అంతా ప్రశంసించారు. చదవండి: జన్మించి నెల కూడా కాలేదు.. ఏడుస్తోందన్న కోపంతో కన్న తల్లే.. -
బాబోయ్, ఈ వ్యక్తికి పది నెలలుగా పాజిటివ్.. చివరికి
లండన్: సాధారణంగా కోవిడ్ మహమ్మారి సోకితే రెండు వారాలు క్వారెంటైన్లో ఉండి పౌష్టికాహారం తీసుకోవడంతో వైరస్‌ను మన శరీరంలోంచి పంపగలమని వైద్యులు చెప్తున్నారు. కానీ బ్రిటన్‌లో వైద్యులకు సైతం అంతుచిక్కని ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి పది నెలలుగా కరోనా తోటి సహజీవనం చేస్తున్నాడు. అతనికి వైరస్ సోకినప్పటి నుంచి మధ్య మధ్యలో కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా పాజిటవ్‌గానే ఫలితాలు వచ్చేవి. కాగా ఈ వైరస్ ఇంత కాలం ఓ వ్యక్తి శరీరంలో కొనసాగడం ఇదే మొదటి సారని ఆ దేశ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పశ్చిమ ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌కు చెందిన రిటైర్డ్ డ్రైవింగ్ టీచర్ డేవ్ స్మిత్ పది నెలల ముందు కరోనా వైరస్ సోకింది. ఇక అప్పటి నుంచి అతనికి చేసిన పరిక్షల్లో 43 సార్లు పాజిటివ్‌గా ఫలితాలు వచ్చాయని, ఏడుసార్లు ఆసుపత్రిలో చేరినట్లు తెలిపాడు. ఒకానొక దశలో అతని మరణిస్తాడేమో అతని కుటుంబసభ్యులు తన అంత్యక్రియలను కూడా సిద్ధం చేసినట్లు చెప్పుకొచ్చాడు. అతని భార్య మాట్లాడుతూ .. స్మిత్‌కు ఎన్ని సార్లు పరిక్షిలు జరిపినా పాజిటివ్ రావడం, మళ్లీ హోం క్వారెంటైన్‌కు వెళ్లడం గత పది నెలలుగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. ఒక్కోసారి స్మిత్ ఆరోగ్యం క్షీణించేది అప్పుడు నాకు చాలా భయమేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే గత సంవత్సరమంతా మాకు నరకంలా గడిచిందని ఆమె తెలిపింది. ఎట్టికేలకు వ్యాక్సిన్ తీసుకున్న 45 రోజుల తరువాత చివరికి స్మిత్‌కు నెగటివ్ రావడం అది కూడా దాదాపు 305 రోజుల తరువాత ఇలా జరగడంతో ఆ దంపతులు షాంపైన్ బాటిల్‌తో ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. స్మిత్ కేసుని అధ్యయనం చేస్తున్న వైద్యుల ప్రకారం.. అతని శరీరంలో వైరస్ ఎక్టివ్‌గా కొనసాగుతోంది. వైరస్ శరీరంలో ఎక్కడ దాక్కుంటుంది? ఇది నిరంతరం సోకుతూ ఎలా ఉంటుంది? అనే దానిపై అధ్యయనం కొనసాగిస్తున్నామని తెలిపారు. చదవండి: Fact Check: ఫౌచీ ఊస్టింగ్.. వైరస్ గుట్టు వీడిందా? -
ఆసరాకు.. అడ్డంకులు!
అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పింఛన్ పెంచడంతోపాటు లబ్ధిదారుల వయస్సును 57 సంవత్సరాలకు తగ్గించారు. దీంతో ఓటరుజాబితాలో వయస్సును బట్టి అధికారులు పలువురిని లబ్ధిదారులుగా గుర్తించినా వారిలో ఒకే ఇంట్లో రెండు పింఛన్లు, వారి పిల్లల ఉద్యోగస్తులుగా ఉండడం తదితర కారణాల రీత్యా ఆ జాబితాను వడబోశారు. కానీ వరుస ఎన్నికలు రావడం..కోడ్ అమలులో ఉండడం వంటి ఆటంకాలతో అర్హులు పింఛన్ డబ్బుల కోసం ఎదురుచూడక తప్పడం లేదు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కొత్తగా ఆసరా పెన్షన్లు పొందేందుకు అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం.. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తే పెన్షన్ వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు కుదిస్తామని ఎన్నికల్లో ప్రకటించారు. అనుకున్నట్లుగానే తిరిగి రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఆసరా పెన్షన్ల కోసం బడ్జెట్లో నిధులను కూడా కేటాయించింది. కానీ కొత్తగా అర్హులైన పెన్షన్ దారులు ఆసరా పెన్షన్లు పొందేందుకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు, ఆ వెంటనే లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. తెలంగాణలో ఎన్నికలు పూర్తయినా దేశవ్యాప్తంగా ఇంకా ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల కోడ్ మే 23 వరకు అమలులోనే ఉంటుంది. దీనికి తోడు జిల్లా పరిషత్ ఎన్నికల కోడ్ కూడా అమలులోకి రావడంతో ఈనెలలో కొత్త పెన్షన్‌దారులకు ఆసరా అందడం అసాధ్యంగానే కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1,89,589 మంది వివిధ రకాల ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. వాటిలో వృద్ధాప్య పెన్షన్లు 65,472 మంది పొందుతుండగా, దివ్యాంగులు 30,315 మంది, వింతంతు పెన్షన్లు 76,029 మంది, చేనేత కార్మికులు 2,928 మంది, గీత కార్మికులు 7,597 మంది లబ్ధిదారులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం వంటరి మహిళలకు కూడా పెన్షన్ కల్పించడంతో జిల్లాలో 7248 మంది పెన్షన్ పొందుతున్నారు. ప్రతినెలా రూ.20.47 కోట్లు ఖర్చు ప్రతినెలా ప్రభుత్వం జిల్లాలోని వివిధ రకాల పెన్షన్ దారులకు రూ.20,47,46,500 జిల్లాలో ఖర్చు చేస్తుంది. ఇందులో వృద్ధాప్య, వితంతు, చేనేత, గీత కార్మికులకు ప్రతి నెలా రూ.వెయ్యి పెన్షన్ అందిస్తుండగా, వికలాంగులకు మాత్రం రూ.1500 అందజేస్తుంది. కొత్త లబ్ధిదారుల ఎంపిక తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండోసారి అధికారం చేపట్టగానే ఆసరా పెన్షన్ల కోసం 65 నుంచి 57 సంవత్సరాల వయస్సు ఉన్న అర్హులను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాను అనుసరించి డీఆర్డీఏ అధికారులు 57 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారందరినీ గుర్తించారు. అందులో 84,515 మంది 57 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారిగా గుర్తించారు. గుర్తించిన వారిలో అర్హులను తేల్చిన ఎంపీడీఓలు ఓటర్ల జాబితా ఆధారంగా 84,515 మందిని గుర్తించగా, ఆయా మండలాల ఎంపీడీఓలు వాటన్నింటినీ పరిశీలించారు. అందులో ఇప్పటికే ఆ కుటుంబంలో ఒకరు పెన్షన్ పొందుతుండడం వల్ల కొందరిని తొలగించగా, మరికొందరిని ఇతర కారణాలతో అనర్హులుగా తేల్చారు. చివరికి 35863 మందిని అర్హులుగా గుర్తించారు. క్షేత్ర స్థాయిలో సర్వే చేస్తే పెరగొచ్చు... ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉన్న అధికా రులు 57 సంవత్సరాల వరకు ఉన్నవారి ని గుర్తించగా ఎంపీడీఓలు వారి జాబితా లను పరిశీలించి అర్హులుగా గుర్తించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అసవరం ఉంది. ప్రస్తుతం ఎన్నికల విధుల్లో అధికారులంతా బిజీగా ఉండడం, దానికితోడు కోడ్ కూడా ఉండడంతో ఇటు క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించకపోవడం, అటు ప్రభుత్వం కూడా కోడ్ కారణంగా కొత్త పెన్షన్‌ను అమలు చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. జూన్ వరకు కొత్త పెన్షన్‌దారులకు ఎదురుచూపులు తప్పవు ఇటు ఎన్నికల కోడ్, మరోపక్క అధికా రుల ఎన్నికల విధులతో బిజీగా ఉండడం వల్ల కొత్త పెన్షన్ దారులు అర్హత సాధించినా ప్రభుత్వం ఇస్తానన్న సమయం నుంచి పెన్షన్లు పొందలేని పరిస్థితి. మే మాసంలో కూడా అందే అవకాశాలు కన్పించడం లేదు. ఎన్నికలు పూర్తయితేనే అటు ఎన్నికల కోడ్‌తోపాటు అధికారులు కూడా ఫ్రీ అవుతారు. జూన్మాసంలో కొత్తవారికి పెన్ష న్ అమలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటివరకు కొత్త పెన్షన్‌దారులు ఎదురుచూడక తప్పని పరిస్థితి. -
బరువు భారాన్ని తగ్గించింది... ఐడియా
దండేపల్లి(మంచిర్యాల) : ఒక్క ఐడియా అతని బరువు భారాన్ని తగ్గించింది. సాధారణంగా తడుకల్ని అమ్మేవారు నెత్తిన ఎత్తుకుని తిరుగుతుంటారు. కానీ ఓ వృద్దుడు తన నెత్తి భారాన్ని తగ్గించేందుకు ఓ ఆలోచన చేశాడు. తడకల్ని నెత్తిన మోస్తూ ఇబ్బంది పడకుండా సైకిల్‌కు ఒక కర్రను అమర్చాడు. కర్రకు తడకల్ని సపోర్ట్‌గా పెట్టి వెనకా ముందు తాళ్లతో కట్టి మద్యలో నిలబడి సైకిల్‌ను తోసుకుంటూ వెళ్లాడు. దీంతో అతడు నెత్తితో మోయాల్సిన బరువును సైకిల్‌తో మోస్తూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని దండేపల్లి సమీపంలో సాక్షి క్లిక్‌మనిపించింది. -
తిండైనా పెట్టేలా చూడండి
పోలీసులకు ఓ తండ్రి వేడుకోలు.. కొడుకులపై ఫిర్యాదు హైదరాబాద్: తన కొడుకులు కూడు పెట్టడంలేదని ఓ వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి మూడు పూటలా అన్నం పెట్టేలా చూడాలని వేడుకున్నాడు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బోరబండకు చెందిన అంజయ్యగౌడ్(75) గతంలో పిండిగిర్నీ పెట్టుకుని జీవనం సాగించేవాడు. నలుగురు కొడుకులను పెంచి పెళ్లిళ్లు చేయగా.. అందరూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కొంతకాలంగా ఆరోగ్యం సహకరించకపోవటంతో మూడో కుమారుడు మహేశ్ వద్ద ఉంటున్నాడు. అతను సరిగ్గా పట్టించుకోక పోవడంతో ఉప్పల్‌లో ఉండే పెద్ద కొడుకు శ్రీనివాస్ వద్దకు వెళ్లాడు. అక్కడా అదే పరిస్థితి ఎదురు కావడంతో.. మిగతా ఇద్దరు కొడుకుల వద్దకు వెళ్లాడు. వారు సరిగా పట్టించుకోలేదు. కనీసం భోజనం కూడా పెట్టకపోవడంతో చేసేదేమీలేక స్టేషన్‌కు వచ్చి కొడుకులపై ఫిర్యాదు చేశాడు. నలుగురిని పిలిపించి నచ్చచెప్పి మూడు పూటల భోజనం పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. అంజయ్యగౌడ్ ఫిర్యాదు మేరకు నలుగురు కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, లేని పక్షంలో వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.