తిండైనా పెట్టేలా చూడండి | father complaints to police over his sons for food in hyderabad | Sakshi
Sakshi News home page

తిండైనా పెట్టేలా చూడండి

Published Thu, Jan 5 2017 3:02 AM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM

తిండైనా పెట్టేలా చూడండి - Sakshi

తిండైనా పెట్టేలా చూడండి

పోలీసులకు ఓ తండ్రి వేడుకోలు.. కొడుకులపై ఫిర్యాదు

హైదరాబాద్‌:
తన కొడుకులు కూడు పెట్టడంలేదని ఓ వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి మూడు పూటలా అన్నం పెట్టేలా చూడాలని వేడుకున్నాడు. హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బోరబండకు చెందిన అంజయ్యగౌడ్‌(75) గతంలో పిండిగిర్నీ పెట్టుకుని జీవనం సాగించేవాడు.

నలుగురు కొడుకులను పెంచి పెళ్లిళ్లు చేయగా.. అందరూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కొంతకాలంగా ఆరోగ్యం సహకరించకపోవటంతో మూడో కుమారుడు మహేశ్‌ వద్ద ఉంటున్నాడు. అతను సరిగ్గా పట్టించుకోక పోవడంతో ఉప్పల్‌లో ఉండే పెద్ద కొడుకు శ్రీనివాస్‌ వద్దకు వెళ్లాడు. అక్కడా అదే పరిస్థితి ఎదురు కావడంతో.. మిగతా ఇద్దరు కొడుకుల వద్దకు వెళ్లాడు. వారు సరిగా పట్టించుకోలేదు. కనీసం భోజనం కూడా పెట్టకపోవడంతో చేసేదేమీలేక స్టేషన్‌కు వచ్చి కొడుకులపై ఫిర్యాదు చేశాడు. నలుగురిని పిలిపించి నచ్చచెప్పి మూడు పూటల భోజనం పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. అంజయ్యగౌడ్‌ ఫిర్యాదు మేరకు నలుగురు కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని, లేని పక్షంలో వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement