సాక్షి, శ్రీకాకుళం: ఇంటి అడ్రస్ మర్చిపోయి ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధుడిని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చి జేఆర్ పురం పోలీసులు ప్రజలు మనసు గెలుచుకున్నారు. పోలీసులు తెలిపిన వివరా ల మేరకు.. మహంతి తాత అనే వృద్ధుడు విశాఖపట్నంలోని తన కూతురు ఇంటికి వెళ్లేందుకు ఐదు రోజుల కిందట బయల్దేరారు. అయితే అడ్రస్ మర్చిపోవడంతో గత నాలుగు రోజులుగా విశాఖపట్నంలోని సింహాచలం దేవస్థానంలోనే ఉండిపోయారు.
సామాజిక మాధ్యమంలో ఆయన గురించి ఓ వీడియో పోస్టయ్యింది. అందులో వృద్ధుడు తనది రణస్థలం మండలమని తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న జేఆర్ పురం ఎస్‌ఐ జి.రాజేష్ తన కానిస్టేబుల్‌ను సింహాచలం పంపించి వృద్ధుడిని జేఆర్ పురం పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే పూర్తి వివరాలు సేకరిస్తే.. వృద్ధుడిది రణస్థలం కాదని విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని పర్ల గ్రామమని తెలిసింది. దీంతో అక్కడి వ్యక్తు లతో మాట్లాడి వృద్ధుడిని పోలీసు వాహనంలో స్వగ్రామానికి పంపించారు. అక్కడి సర్పంచ్‌కు వృద్ధుడిని అప్పగించారు. జేఆర్ పురం పోలీసులు చూపిన చొరవపై అంతా ప్రశంసించారు.
చదవండి: జన్మించి నెల కూడా కాలేదు.. ఏడుస్తోందన్న కోపంతో కన్న తల్లే..
Comments
Please login to add a commentAdd a comment