లండన్: సాధారణంగా కోవిడ్ మహమ్మారి సోకితే రెండు వారాలు క్వారెంటైన్‌లో ఉండి పౌష్టికాహారం తీసుకోవడంతో వైరస్‌ను మన శరీరంలోంచి పంపగలమని వైద్యులు చెప్తున్నారు. కానీ బ్రిటన్‌లో వైద్యులకు సైతం అంతుచిక్కని ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి పది నెలలుగా కరోనా తోటి సహజీవనం చేస్తున్నాడు. అతనికి వైరస్ సోకినప్పటి నుంచి మధ్య మధ్యలో కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా పాజిటవ్‌గానే ఫలితాలు వచ్చేవి. కాగా ఈ వైరస్ ఇంత కాలం ఓ వ్యక్తి శరీరంలో కొనసాగడం ఇదే మొదటి సారని ఆ దేశ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
పశ్చిమ ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌కు చెందిన రిటైర్డ్ డ్రైవింగ్ టీచర్ డేవ్ స్మిత్ పది నెలల ముందు కరోనా వైరస్ సోకింది. ఇక అప్పటి నుంచి అతనికి చేసిన పరిక్షల్లో 43 సార్లు పాజిటివ్‌గా ఫలితాలు వచ్చాయని, ఏడుసార్లు ఆసుపత్రిలో చేరినట్లు తెలిపాడు. ఒకానొక దశలో అతని మరణిస్తాడేమో అతని కుటుంబసభ్యులు తన అంత్యక్రియలను కూడా సిద్ధం చేసినట్లు చెప్పుకొచ్చాడు. అతని భార్య మాట్లాడుతూ .. స్మిత్‌కు ఎన్ని సార్లు పరిక్షిలు జరిపినా పాజిటివ్ రావడం, మళ్లీ హోం క్వారెంటైన్‌కు వెళ్లడం గత పది నెలలుగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. ఒక్కోసారి స్మిత్ ఆరోగ్యం క్షీణించేది అప్పుడు నాకు చాలా భయమేసింది.
ఒక్క మాటలో చెప్పాలంటే గత సంవత్సరమంతా మాకు నరకంలా గడిచిందని ఆమె తెలిపింది. ఎట్టికేలకు వ్యాక్సిన్ తీసుకున్న 45 రోజుల తరువాత చివరికి స్మిత్‌కు నెగటివ్ రావడం అది కూడా దాదాపు 305 రోజుల తరువాత ఇలా జరగడంతో ఆ దంపతులు షాంపైన్ బాటిల్‌తో ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. స్మిత్ కేసుని అధ్యయనం చేస్తున్న వైద్యుల ప్రకారం.. అతని శరీరంలో వైరస్ ఎక్టివ్‌గా కొనసాగుతోంది. వైరస్ శరీరంలో ఎక్కడ దాక్కుంటుంది? ఇది నిరంతరం సోకుతూ ఎలా ఉంటుంది? అనే దానిపై అధ్యయనం కొనసాగిస్తున్నామని తెలిపారు.
చదవండి: Fact Check: ఫౌచీ ఊస్టింగ్.. వైరస్ గుట్టు వీడిందా?
Comments
Please login to add a commentAdd a comment