కార్మికుడి కష్టాలు ఆర్టీఐ తీర్చేనా? | is rti solve problems of labourer | Sakshi
Sakshi News home page

కార్మికుడి కష్టాలు ఆర్టీఐ తీర్చేనా?

Published Fri, Jul 3 2015 12:24 AM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM

కార్మికుడి కష్టాలు ఆర్టీఐ తీర్చేనా?

కార్మికుడి కష్టాలు ఆర్టీఐ తీర్చేనా?

సమాచార హక్కు చట్టం ఫైల్ పోయిందన్న కారణంగా సమాచారం ఇవ్వకుండా ఉండవచ్చని ఎక్కడా చెప్పలేదు. అలాగే.. కంపెనీని మరో రాష్ట్రానికి మార్చినంత మాత్రాన కంపెనీ యజమాని కార్మికుడికి బాకీ చెల్లించే బాధ్యతను తప్పించుకోలేడు.
 తనకు రావలసిన జీతం, భత్యం, పింఛను బకాయిల కోసం కార్మికుడు.. కార్మిక న్యాయస్థానంలో ఏళ్లతరబడి తన హక్కును నిరూపించు కోవాలి. యాజమాన్యం చెల్లించి తీరాలని అవార్డు సాధించిన తరువాత కూడా కార్మికుడి కష్టాలు ముగియ వు. లేబర్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు ప్రకారం యాజ మాన్యం నుంచి డబ్బు వసూలు చేసే అధికారం రెవె న్యూ శాఖకు ఉంది. అవినీతి లంచగొండితనం వల్ల యాజమాన్యాలు బకాయిలు ఇవ్వకుండా మాయ చేస్తున్నాయి.

ఏళ్ల తరబడి అవార్డులు పెండింగ్‌లో ఉం టున్నాయి. ఒక కార్మికుడి బకాయిలు వసూలు చేసే విషయంలో అధికారుల పైన కార్మిక సంఘాలు ఒత్తిడి తేవడం అరుదైన సంఘటన. కార్మిక హక్కులు నీరు గారిపోతున్న ఈ రోజుల్లో తమ అధికారాన్ని విని యోగించి పేద కార్మికుడి బాకీ వసూలు చేసే అధికా రులు ఉన్నారా? ఢిల్లీలో కార్మికులు ఎందరో తమ అవార్డులను ఎందుకు అమలు చేయడంలేదని, యాజ మాన్యాల నుంచి ఎప్పుడు డబ్బు వసూలు చేసి ఇస్తా రని ఆర్టీఐ కింద నిలదీసి అడుగుతున్నారు. సమాచా రం ఇవ్వడం కోసం రెవెన్యూ అధికారులు కొంత పని చేయక తప్పడం లేదు. సమాచార హక్కు లభించిన తొలి దశాబ్దిలో ఇదొక ముందడుగు.
 ఒక ఫ్యాక్టరీ కార్మికుడు మహిందర్ పాల్ సింగ్ 2013 ఏప్రిల్ 16న కల్కాజీ రెవెన్యూ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ముందు, తనకు మైక్రోనిక్స్ ఇండియా అనే కంపెనీ 58 వేల 153 రూపాయలు ఇవ్వాలని కార్మిక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ఆర్టీఐ కింద అడిగాడు. అవార్డు అమ లుపై పూర్తి సమాచారం కోరాడు. ప్రజాసమాచార అధి కారి జవాబు ఇచ్చాడే గాని సమాచారం ఇవ్వలేదు.
 ఈ కార్మికుడికి మరో కంపెనీ (కాంపారి ఎక్స్ పోర్ట్స్ తుగ్లకాబాద్, ఢిల్లీ) కూడా 50 వేల రూపాయల వరకు బాకీ ఉంది. దానిపైన కేసు వేసి అవార్డు సాధిం చాడు. కాని దాని అమలు పరిస్థితి కూడా అదే పెం డింగ్ దశలో ఉంది.
 అధికారి ఇచ్చిన సమాచారం పూర్తిగా లేకపోవ డం వల్ల సీనియర్ అధికారి ముందు మొదటి అప్పీలు దాఖలు చేయక తప్పలేదు. అక్కడా సమాచారం రాక పోవడంతో సమాచార కమిషన్ ముందు రెండు కేసు ల్లోనూ రెండో అప్పీలు చేసుకున్నాడు. కార్మికుడికి ఇవ్వ వలసిన 58,153 రూపాయలు ఇవ్వకుండా ఉండేం దుకు ఢిల్లీ హైకోర్ట్టులో యాజమాన్యం వేసిన రిట్ పిటిషన్‌ను 2010లో కొట్టివేసినా ఇంతవరకూ వారి నుంచి డబ్బు వసూలు చేసి అధికారులు కార్మికుడికి ఇప్పించలేకపోయారు. లేబర్ కోర్టు తీర్పు ఇచ్చి, రిట్ పిటిషన్ కొట్టివేసి అయిదేళ్లు గడిచినా కార్మికుడు ఇంకా తన జీతం బకాయిల కోసం ఎదురుచూస్తూనే ఉన్నా డు. రిట్ పిటిషన్ కొట్టి వేసిన తరవాత కంపెనీ యజ మాని ఢిల్లీలో దుకాణం మూసేసి హరియాణాలోని ఫరీదాబాద్‌కు మారిపోయాడు.

 ఈ దశలో సమాచార అధికారి కొత్త సాకు ముం దుకు తెచ్చాడు. అది అందరూ వాడే సాకు.. ఫైల్ పో యింది. కాగితాలు దొరకడం లేదు. సమాచార హక్కు చట్టం ఫైల్ పోయిందన్న కారణంగా సమాచారం ఇవ్వ కుండా ఉండవచ్చని ఎక్కడా చెప్పలేదు. ఊరికే దస్తా వేజు లేదనీ, కాగితాలు కనబడడం లేదనీ అంటే సరి పోదు. అవి ఇదివరకు ఎవరి దగ్గర ఉన్న రికార్డులు? వాటిని ఎవరికైనా అప్పగించాడా? చివరగా ఆ రికార్డు ఎక్కడ కనిపించింది? వాటిని వెతకడానికి ఏవైనా ప్రయత్నాలు చేశారా? ఆ ప్రయత్నాలు ఏమిటి? వాటి పత్రాలు ఇచ్చారా? నిర్లక్ష్యంగా పోగొట్ట్టుకుంటే అం దుకు బాధ్యులని ఎవరినైనా గుర్తించారా? ఇవన్నీ వివ రించకుండా ఫైల్ పోయిందంటే అంగీకరించే ప్రసక్తే లేదు.

ఈ వివరాలన్నింటితో ప్రమాణ పత్రం దాఖలు చేయవలసి ఉంటుంది. నిజంగానే ఫైల్ దొరకకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారు? ఆ కాగితాల ప్రతు లు ఇంకా ఏ ఫైళ్లలోనైనా ఉంటే వాటిని సేకరించి తిరిగి ఫైల్‌ను రూపొందిస్తారా లేదా? ఆ పని ఎందుకు చేయ లేదు అని నిలదీసే అధికారం సమాచార కమిషనర్‌కు ఉంది. సమాచార అధికారి జవాబు ఇవ్వాల్సి ఉంటుం ది. కంపెనీని మరో రాష్ట్రానికి మార్చినంత మాత్రాన కంపెనీ యజమాని కార్మికుడికి బాకీ చెల్లించే బాధ్య తను తప్పించుకోలేడు. హరియాణాలో రెవెన్యూ అధి కారికి డబ్బు వసూలు చేసే బాధ్యతను అప్పగించక పోవడం అన్యాయం.
 ఈ కేసులో రికవరీ నోటీసు ఇవ్వడానికి వెళ్లిన బెయిలిఫ్ (కోర్టు అమీనా)కు లంచం ఇచ్చారని కార్మికుడి అనుమానం. బెయిలిఫ్ నోటీసు ఇవ్వడానికి వెళ్లినా తుగ్లకాబాద్‌లో కంపెనీ వారి కార్యాలయం కని పించలేదని అతనొక నివేదిక ఇచ్చినట్టు రికార్డ్డులో చేర్చారు. ఈ కంపెనీ కార్యాలయం తెలుసుకుందామ ని తాము అక్కడి పోలీస్ స్టేషన్‌కు వెళ్లామని, కాని అక్కడా ఏ సమాచారమూ దొరకలేదని మరొక కాగి తం ఫైల్‌లో చేర్చారు. దాంతో రికవరీ నిలిచిపోయింది.

కార్మికుడికి డబ్బు ఎగవేసిన కంపెనీ వారి మరొక ఫ్యాక్టరీ అదే తుగ్లకాబాద్‌లో మరొక చోట పని చేస్త్తు న్నా బెయిలిఫ్ అక్కడికి వెళ్లడం లేదని, కంపెనీతో కుమ్మక్కయి బెయిలిఫ్ తప్పుడు నివేదిక ఇస్త్తున్నాడని కార్మికుడి ఆరోపణ. కార్మికుడు బెయిలిఫ్ పైన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. కార్మికుడి బాకీ వసూలు కోసం ఏం చేశారో ప్రమాణ పత్రంలో వివ రించాలని సమాచార కమిషనర్‌గా నేను ప్రభుత్వ అధి కారికి ఆదేశాలు జారీ చేశాను. ఇటువంటి కేసులు ఇం కా ఎన్నో ఉన్నాయి. అవార్డులున్నా బాకీ వసూలు కాని కార్మికులు ఇంకెందరో?


 (మహిందర్ పాల్ సింగ్ వర్సెస్ ఎస్‌డీఎం కల్కా జీ ఢిల్లీ ప్రభుత్వం నంబర్ ఇఐఇ//2013/002184, 2186 అ కేసులో తీర్పు ఆధారంగా)

(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement