కేజ్రీవాల్, చిదంబరంపై కేసు | Case filed against Kejriwal, Chidambaram on surgical strike | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్, చిదంబరంపై కేసు

Published Wed, Oct 5 2016 8:20 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

సర్జికల్ దాడులపై వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ నేతలు పీ చిదంబరం, సంజయ్ నిరుపమ్లపై బిహార్లోని ముజఫర్పూర్ కోర్టులో కేసు నమోదైంది.

ముజఫర్పూర్: సర్జికల్ దాడులపై వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ నేతలు పీ చిదంబరం, సంజయ్ నిరుపమ్లపై బిహార్లోని ముజఫర్పూర్ కోర్టులో కేసు నమోదైంది. సర్జికల్ దాడులపై ఆధారాలు వెల్లడించాలంటూ భారత సైన్యాన్ని అవమానించేలా ఈ ముగ్గురూ వ్యాఖ్యానించారని, వీరిని విచారించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ జగన్నాథ్ షా అనే వ్యక్తి దేశ ద్రోహం కేసు పెట్టారు. ఈ కేసును ఈ నెల 19న కోర్టు విచారించనుంది. ఫిర్యాదు చేసిన జగన్నాథ్ షా .. ఆప్ ఔర్ హమ్ అనే కొత్త పార్టీకి అధ్యక్షుడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement