ఉడీ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన సర్జికల్ దాడిని సంపూర్ణంగా సమర్థిస్తున్నానన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.. ఇంతటితో ఉడీకి సంబంధించి ప్రతీకారం తీరినట్లేనని వ్యాఖ్యానించారు. ఇండియాలో పాకిస్థానీ నటీనలులపై నిషేధం విధించడం సరికాదన్న ఆయన నిర్మాతల మండలి నిర్ణయాన్ని తప్పుపట్టారు.